తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!

తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!

దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. మన దేశంలోనే కాదు.. హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లాడిన ఆమె తన మ్యారీడ్ లైఫ్‌ని ఆనందంగా గడుపుతోంది. గతేడాది డిసెంబర్‌లో జోధ్ పూర్‌లో ఇటు క్రిస్టియన్, అటు పంజాబీ పద్ధతుల్లో వివాహమాడిన ఈ జంట పెళ్లి తర్వాత స్విట్జర్లాండ్‌కి హనీమూన్‌కి వెళ్లింది. 


పెళ్లికి ముందు నుంచి తమ ఫొటోలో పీడీఏని (పబ్లిక్ డిస్ ప్లే ఆఫ్ అఫెక్షన్)  చూపడం ఈ జంటకు అలవాటే. వీరిద్దరూ చూసేందుకు అంతే అందంగా కూడా ఉంటారని చాలామంది హాలీవుడ్ ఫ్యాన్స్ చెబుతుంటారు. నిజమైన ప్రేమకు వయసు అడ్డు కాదని చాటిన ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడింది.


pc3


తాము ఇప్పుడప్పుడే పిల్లల గురించి ఆలోచించట్లేదని చెప్పిన ప్రియాంక.. భవిష్యత్తులో తాను భారత ప్రధానిగా మారి దేశానికి సేవలు అందించాలనుకుంటున్నానని చెప్పింది. నిక్ అమెరికా అధ్యక్షుడిగా గెలవాలన్నది తన ఆకాంక్ష అని కూడా చెప్పింది. ఇవి కేవలం కలలే అయినా.. ఇవి నిజం అయితే బాగుంటుందని.. ఎందుకంటే తాము ఎల్లప్పుడూ సమాజం ఆనందంగా ఉంటే చూసి సంతోషించాలనుకునేవాళ్లమని.. సమాజంలో మార్పు కోసం తాము రాజకీయాల్లో అడుగుపెట్టే రోజు ఒకటి వస్తుందని కూడా చెప్పిందామె. 


వీరి పెళ్లి జరిగిన రోజు నుంచి.. ప్రియాంక నిక్‌ల జంట త్వరలోనే పిల్లలను కనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.. ప్రియాంక గర్భం ధరించిందని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. అయితే వీరిద్దరూ అలాంటిదేమీ లేదని చెప్పేశారు. అయితేనేం.. తమ బెడ్రూంకి సంబంధించిన.. ఓ ముఖ్యమైన అంశాన్ని అభిమానులతో పంచుకుంది ఈ జంట. అంతేకాదు.. పెళ్లయిన ప్రతి జంట ఈ సీక్రెట్ ఫాలో అయితే చాలు చాలా ఆనందంగా ఉంటారని కూడా చెప్పుకొచ్చింది.


pc6


"ప్రతి పెళ్లయిన జంట తమ కాపురాన్ని ఆనందంగా కొనసాగించేందుకు.. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటిదే మేం కూడా చేశాం. మేం బెడ్ రూంలో ఇలా ఉండాలి అంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నాం. వాటిని ఇద్దరం తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం. అవి మా ఇద్దరిలో నాకే కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కానీ నిక్ కోసం వాటిని తప్పనిసరిగా పాటించాలని భావించాను" అంటోంది ప్రియాంక.


అందులో ముఖ్యమైన నియమం ఏంటో తెలుసా? బెడ్రూంలోకి తమ మొబైల్ ఫోన్‌ని తీసుకురారట. బెడ్రూంలో మొబైల్ వాడకూడదని వీరిద్దరూ నియమం పెట్టుకున్నారట. ఈ నియమాన్ని వారిద్దరూ తప్పనిసరిగా పాటిస్తారట. నిక్ విషయంలో అయితే ఫర్వాలేదు. కానీ ప్రియాంక చోప్రాకి మొబైల్ ఫోన్ ఉపయోగించకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుందట. ఆమెకు ఫోన్ వాడడం, సోషల్ మీడియాలో ఉండడం చాలా అలవాటు.


అందుకే తనకు ఈ నియమాన్ని పాటించడం కాస్త కష్టమేనని చెబుతోంది ప్రియాంక. అయినా సరే నిక్ కోసం తన ఫోన్‌ని బెడ్రూం బయటే వదిలేసి వెళ్తుందట. మొబైల్ ఫోన్ పెళ్లయిన జంటల మధ్యలో దూరాన్ని పెంచుతుందని వీరిద్దరూ నమ్ముతారట. అందుకే వీరిద్దరూ దాన్నే దూరంగా ఉంచుతున్నారు. తమలా పెళ్లయిన ప్రతి జంట చేస్తే.. వారిద్దరూ తక్కువ కాలంలోనే దగ్గరవుతారని చెబుతోంది ప్రియాంక.


pc2


"బెడ్‌రూంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు సమయం గడపాలే తప్ప.. మొబైల్ ఫోన్ చూస్తూ కాదని నిక్ ఎప్పుడూ చెబుతుంటాడు. అందుకే మొబైల్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా సరే.. దానికంటే మా బంధానికే నేను ప్రాధాన్యం ఇస్తాను కాబట్టి ఆ నియమాన్ని నేను తప్పక పాటిస్తాను. దీనివల్ల ఇద్దరి మధ్య దగ్గరితనం పెరగడంతో పాటు గొడవలు కూడా తక్కువగా జరుగుతాయి" అని అంటోందామె. మీరు కూడా దీన్ని ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి మరి.


ఇవి కూడా చదవండి.


 


ఆ రెండేళ్లు నరకం అనుభవించా.. అయినా చావును ఎదురించా : సుస్మిత సేన్


కాస్త జిప్ వేసుకోవాల్సింది.. : రకుల్ పై విమర్శలు చేస్తున్న నెటిజన్లు..


ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి