Is India Safe for Women Traveling Alone? Outrage after Hyderabad Vet’s Murder in the city
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన శంషాబాద్ టోల్ ప్లాజా సమీపంలో.. బుధవారం రాత్రి అదృశ్యమైన వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ని (పోలీస్ ఉత్తర్వులను బట్టి పేరును మార్చడం జరిగింది).. కొందరు కిరాతకులు ఎంతో దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏమాత్రం ఆధారాలు దొరకకుండా ఆమెని సజీవ దహనం చేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజల నుండి మొదలుకుని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల వరకు అందరూ పోస్టులు పెడుతున్నారు.
అయితే తాజాగా దిశ హత్యకి సంబంధించి.. ఈ నేరానికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఆమెను హత్య చేశాక.. ఆనవాళ్లు చిక్కకుండా ఆమె శరీరాన్ని కిరోసిన్‌తో తగలబెట్టక మునుపే.. తనపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వార్తకు బలం చేకూర్చేలా సాక్ష్యాలు కూడా లభించడం గమనార్హం. ఎందుకంటే ఆమె పై అత్యాచారం జరిగిన ప్రాంతంతో పోల్చుకుంటే.. ఆమెని దహనం చేసిన స్థలం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అమెరికాలో అద్భుత యాత్ర : మన హైదరాబాదీ లేడీ బైకర్ ‘జయభారతి’ సాధించిన వినూత్న రికార్డ్
అయితే ఈ కేసులో కొత్త కోణం ఏంటంటే.. మృతురాలు ఎవరినో కలవడానికి బయలుదేరుతూ.. రోడ్డు పక్కన తన స్కూటీని పార్క్ చేసి వెళ్లగా.. అక్కడ ఉన్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు కావాలనే ఆ స్కూటీ టైర్‌ని పంక్చర్ చేశారని సమాచారం. ఆమె మరలా ఆ స్కూటీ కోసం వచ్చినప్పుడు.. ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ దారుణం జరిగే ముందు దిశ.. తన చెల్లెలికి ఈ పరిస్థితిని వివరిస్తూ.. “భయంగా ఉంది” అంటూ కాల్ చేసిన రికార్డింగ్‌ను పోలీసులు బహిర్గతం చేశారు. దీనితో ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు. తన చెల్లెలికి ఫోన్ చేసే బదులు.. ఆమె పోలీసులతో మాట్లాడి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఇటువంటి నేరాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఒంటరి మహిళలు, వృద్దులు లేదా ఇతరులు ఎప్పుడైనా తాము ప్రమాదంలో ఉన్నామని భావిస్తే.. వెంటనే పోలీసుల సహాయం కోసం 100 లేదా 112 నెంబర్‌కి ఫోన్ చేయాలని… అప్పుడు తమ నుండి తక్షణ సహాయం లభిస్తుందని తెలిపారు. దీని పై అవగాహన కల్పిస్తూ ఇప్పటికే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీలో స్వచ్ఛమైన ‘గాలి’ పీల్చుకోవాలంటే… ఈ ‘ఆక్సిజన్ బార్’కి వెళ్లాల్సిందే ..!
ఇక ఈ సంఘటనని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమీషన్ వెంటనే.. తమ ప్రతినిధులని హైదరాబాద్ పంపించడం జరిగింది. అలాగే సినీ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, నాని, సాయి ధరమ్ తేజ్.. నటీమణులు కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా తదితరులు ఈ సంఘటన పై స్పందించారు.
ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని.. ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా నాశనం చేసే హక్కు దుర్మార్గులకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ.. తమ బాధని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. #JusticeForDisha అంటూ సాగుతున్న ఈ సోషల్ మీడియా ప్రచారంలో ఎందరో భాగస్వాములవుతున్నారు.
— Vijay Deverakonda (@TheDeverakonda) November 29, 2019
We can’t even demand for justice cause no matter what punishment is served to the one's who did this it’s still not justified.
RIP ? Can she ?
I just feel so angry and helpless.
Requesting the media to be sensitive with the family.#Priyankareddy— Nani (@NameisNani) November 29, 2019
Angry. Saddened. Shocked. Speechless. Hearing such heart-wrenching news even today is absolutely disturbing. Let us work together as a society to bring a change and put an end to this barbarism. #JusticeForPriyankaReddy pic.twitter.com/onCJdoILKB
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 29, 2019
#RIPPriyankaReddy #JusticeForPriyankaReddy pic.twitter.com/9vCKsbsj1O
— Keerthy Suresh (@KeerthyOfficial) November 29, 2019
At a loss of words.. I feel helpless and heartbroken! It’s gut wrenching to even read about it! Where are we heading!!? These monsters need to be hanged! #RIPPriyankaReddy 😔
— Raashi Khanna (@RaashiKhanna) November 29, 2019
ప్రస్తుతం ఈ దారుణానికి పాల్పడిన నిందితులలో ఒకరిని ఇప్పటికే గుర్తించారని.. అతని పేరు మహమ్మద్ పాషా అని పేర్కొంటూ ఓ ఫోటోను మీడియాలో ప్రసారం చేస్తున్నారు. అలాగే కొన్ని గంటలలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెడుతూ.. కేసు పూర్తి వివరాలను తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. ఏదేమైనా కూడా ఇటువంటి దారుణాలు జరగడం నిజంగా దురదృష్టకరం.
ఒకే ఒక్క చిత్రం.. నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని మలుపు తిప్పింది.. ఎలాగో తెలుసా..?