బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!

బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ( Bigg Boss Telugu) భాగంగా జరిగిన నిన్నటి ఎపిసోడ్‌లో.. రాఖీ పండుగని ఇంటి సభ్యులు చాలా ఘనంగా చేసుకున్నారు. ఇంటి సభ్యుల కోసం వారి కుటుంబ సభ్యులు..  రాఖీలు, బహుమతులు పంపించగా.. వాటిని బిగ్ బాస్ సదరు వ్యక్తులకు అందించారు. అలాగే బిగ్ బాస్ హౌస్ సభ్యులు కూడా.. తమ కుటుంబీకులు పంపిన రాఖీలని.. ఇంట్లోని సభ్యుల చేత కట్టించుకుని ఆనందపడ్డారు. 

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

అయితే ఈ రాఖీలు వచ్చిన సందర్భంగా.. ఇంటి సభ్యులు కొంతమంది  ఎమోషనల్‌గా ఫీలయ్యారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్‌కి తన చెల్లెలు అమెరికా నుండి రాఖీ పంపించగా.. దానిని తను హౌస్‌ సభ్యురాలు హిమజ చేత కట్టించుకున్నాడు.  హౌస్‌లోకి వచ్చిన వెంటనే.. తనని ఆమె "వరుణ్ అన్న" అని పిలవడంతో తాను చాలా కనెక్ట్ అయ్యానని వరుణ్ తెలిపాడు.

ఆ తరువాత రవికృష్ణ తనకి వచ్చిన రాఖీలని.. రోహిణి, ఆషు రెడ్డిలతో కట్టించుకున్నాడు. ఇక పునర్నవి విషయానికి వస్తే.. ఆమె మాట్లాడిన మాటలు అటు ఫన్నీగా ఉన్నాయి. ఇంతకీ ఏం చెప్పిందంటే - ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరికీ రాఖీ శుభాకాంక్షలు, ఒక్క రాహుల్ (Rahul Sipligunj) కి తప్ప... ఎందుకంటే నేను ఎక్కడ రాఖీ కడతానో అని చాలా టెన్షన్ పడుతున్నాడు అని ఆమె అనడంతో అందరూ నవ్వుకున్నారు.

ఇప్పటికే పునర్నవి, రాహుల్‌ల మధ్య ఏదో జరుగుతుంది అని.. ఇంటి సభ్యులతో పాటుగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున & షో చూస్తున్న ప్రేక్షకులు కూడా అనుకుంటుండగా.. ఈరోజు పునర్నవి చేసిన కామెంట్ వారందరికీ ఒక హింట్ ఇచ్చినట్లయింది.

అయితే పునర్నవి (Punarnavi) చాలా సరదాగానే.. ఇటువంటి కామెంట్ చేసింది అని పలువురు అంటున్నారు. అలాగే శ్రీముఖికి తన తమ్ముడు రాఖీ పంపించగా, ఆ రాఖీని తనకి బిగ్ బాస్ హౌస్‌లో బాగా సన్నిహితుడైన బాబా భాస్కర్ చేత కట్టించుకుంది. అలాగే మహేష్ విట్టా కూడా రోహిణి, అషు రెడ్డి & శివజ్యోతిలతో రాఖీలు కట్టించుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?

పైన చెప్పినవన్నీ ఫన్నీ మూమెంట్స్ అయితే.. ఇప్పుడు చెప్పబోయేది ఈ ఎపిసోడ్ మొత్తానికే ఎమోషనల్ అని చెప్పవచ్చు. అలీ రెజాకి వారి ఇంటి సభ్యులు మూడు రాఖీలు పంపించి.. వాటిని తాను ఇంటిలో చెల్లెలు అని పిలుస్తున్న శివజ్యోతి చేత కట్టించుకోమని చెప్పారు. అదే సమయంలో రాఖీ కట్టించుకున్న తరువాత.. శివజ్యోతికి ఇవ్వడం కోసం ఒక బహుమతిని సైతం పంపించారు అలీ రెజా ఇంటి సభ్యులు.

ఈ విషయాన్నీ అలీ చెప్పేసరికి, శివజ్యోతి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. ఇలా బహుమతి కూడా పంపారు అని చెప్పేసరికి.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వారే కాకుండా.. షో చూస్తున్న ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అయ్యారు. రాఖీ పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో అన్నాచెల్లెళ్ల బంధం కళ్ళారా కనపడింది.

ఇదిలావుండగా... బాబా భాస్కర్ మాస్టర్‌కి.. తన భార్య రికార్డ్ చేసి పంపిన ఒక వీడియోని ప్లే చేయడం జరిగింది. ఆ వీడియోలో.. ఇంటి గురించి బెంగ పడాల్సిన పని ఏమిలేదని.. అందరం బాగానే ఉన్నామని ఆమె తెలిపింది. ఇంట్లో అందరూ "బాబా గారు" అని తనకు మర్యాద ఇస్తుండడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని వారు తెలిపారు.

అదే సమయంలో డ్యాన్స్ వేయడం ఆపొద్దు అని.. డ్యాన్స్ వేయడం చూస్తే తనకి ఆనందంగా ఉంటుంది అని చెప్పి.. "చివరగా నాగార్జున గారితో మన కూతురికి 8 లేదా 9 ఏళ్ళు అని చెప్పారు కదా... ఆ రెండు తప్పే, మన పాపకి ఇప్పుడు 10 ఏళ్ళు" అని ఆమె చెప్పింది. ఇది విన్న ఇంటి సభ్యులంతా నవ్వుకున్నారు.

ఇలా నిన్నటి ఎపిసోడ్ ఫన్నీ & ఎమోషనల్‌గా సాగింది. ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో నాగార్జున ఏమి మాట్లాడతాడన్నది ఆసక్తికరంగా ఉంది. గత వారం పెద్దగా గొడవలు ఏమి జరగనప్పటికి కూడా.. నాగ్ ఏదైనా తమ తప్పులని ఎత్తి చూపుతాడా.. అన్న టెన్షన్‌లో ఇంటి సభ్యులు ఉన్నారు. అలాగే నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో .. కనీసం 3 నుండి 4 వ్యక్తులు ఈరోజు సేఫ్ జోన్‌లో‌కి వెళతారు.

వాళ్ళెవరు అన్నది తెలియాలంటే ఈ రాత్రి వరకు ఆగాల్సిందే...

రణరంగం మూవీ రివ్యూ - యావరేజ్ గ్యాంగ్ స్టర్