బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో భాగంగా ఈరోజు 14వ వారానికి సంబందించిన నామినేషన్స్ జరగనున్నాయి. ఈ సీజన్ కి సంబంధించి ఇదే ఆఖరి నామినేషన్స్ గా భావించవచ్చు. కారణం వచ్చే వారంతో ఈ సీజన్ ముగుస్తుంది అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ మిగులుతారు కాబట్టి ఎటువంటి నామినేషన్స్ వచ్చేవారం ఉండవు.
Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం
ఇక ఈ వారం నామినేషన్స్ కాస్త వైవిధ్యంగా ఉండబోతున్నాయి. ఇంటిలో ఉన్న ఆరుగురు సభ్యులలో ఒక్కరే ఈ నామినేషన్స్ టాస్క్ లో గెలిచే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి వెళ్లేందుకు టికెట్ దక్కించుకుంటారు. మిగిలిన అయిదుగురు సభ్యులు కూడా ఈవారం నామినేషన్స్ లో ఉండడం జరుగుతుంది. దీనికి సంబందించిన ప్రోమో కూడా కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ ప్రోమో లో రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) & వరుణ్ సందేశ్ (varun sandesh) ల మధ్య ఈ టాస్క్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే, వారు బిగ్ బాస్ టికెట్ టు గ్రాండ్ ఫినాలే గెల్చుకుంటారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఆ టికెట్ ని గెల్చుకుని నేరుగా ఫైనల్ కి వెళతారు అనేది ఈరాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ తో తేలిపోనుంది. అయితే ప్రోమోలో చూపెట్టినట్టుగా ఈ ఇద్దరిలో ఒకరు ఆ టికెట్ ని గెల్చుకుంటారా? లేక మిగిలిన నలుగురిలో ఒకరు గెల్చుకుంటారా? అన్న దానిపై రాత్రికి ఎపిసోడ్ ప్రసారమైతేనే కాని ఒక క్లారిటీ రాదు.
ఇదిలావుండగా నిన్నటి ఎలిమినేషన్ దాదాపు అందరూ ఊహించినట్టుగానే జరిగింది. వితిక బిగ్ బాస్ ఇంటిని విడిచి వెళ్లే సమయంలో వరుణ్ సందేశ్ కన్నీటిపర్యంతమయ్యాడు. దాదాపు 90 రోజుల పాటు ఒకే చోట ఇలా కలిసి ఉండి విడిపోవాల్సి రావడంతో వరుణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే వితిక కాస్త ఓదార్చడంతో.. కంట్రోల్ అయ్యాడు.
రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!
ఇక వితిక వెళ్లే సమయంలో వరుణ్ సందేశ్ ని పక్కకి పిలిచి ఎవ్వరితో గొడవలు పెట్టుకోవద్దు & టాస్క్ బాగా ఆడేందుకు ప్రయత్నించు.. నువ్వు కచ్చితంగా ఫైనల్ వరకు ఉంటావు కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు గేమ్ నుండి దృష్టి పక్కకి పెట్టకు అని చెప్పడం జరిగింది. అయితే వితిక నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వడానికి పరోక్షంగా శివజ్యోతి కారణమని ఇప్పటికి కూడా వరుణ్ సందేశ్ అనుకుంటుండడంతో ఈ వారం హౌస్ లో శివజ్యోతి తో వరుణ్ సందేశ్ ప్రవర్తన ఎలా ఉండబోతున్నదో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఇక ఇదే విషయమై, వితిక ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వచ్చాక మాట్లాడుతూ.. తన మనసులో అయితే ఏమి లేదు, కచ్చితంగా నాకన్నా కూడా నువ్వు బెటర్ అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పింది. అలాగే తన బిగ్ బాస్ జర్నీ చూసుకున్నాక ఇది తన జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేని ఒక అనుభూతి అని నాగార్జున తో తన మనసులో మాట తెలిపింది.
అలాగే ఆఖరిలో గత రెండు వారాలుగా రాహుల్ తమతో సరిగ్గా ఉండడం లేదు అని నాకనిపించింది. అయితే నేను & వరుణ్ సందేశ్ మాత్రం ఎప్పటికి కూడా నీకు ఫ్రెండ్స్ అని చెప్పగా.. దానికి రాహుల్ కూడా మీరిద్దరూ కూడా నాకు ఎప్పటికి మంచి స్నేహితులే అని తెలిపాడు. అలా వితిక బిగ్ బాస్ జర్నీ ముగిసింది.
ఎలిమినేషన్ కి ముందు హౌస్ మేట్స్ అందరితో కొన్ని సరదా ఆటలు ఆడించారు నాగార్జున. అందులో భాగంగా ముందు ఇంటి సభ్యులు తమకు తాము ఓ పాటను అంకితమిచ్చుకొని దానికి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత టాస్క్ లో కళ్లకు గంతలు కట్టి ఒక్కొక్కరికీ ఒక్కో నవ్వించే టాస్క్ ని అందించారు. ఇందులో శ్రీముఖి డ్యాన్స్, రాహుల్, అలీ బాక్సింగ్ వంటివి ప్రేక్షకులను నవ్వించాయి.
ఆఖరుగా.. ఈరోజు జరగబోయే నామినేషన్స్ ద్వారా ఫైనల్ కి వెళ్లే తోలి కంటెస్టెంట్ ఎవరో తేలనుంది. అదే సమయంలో ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోయే కంటెస్టెంట్ ఎవరు అనేదాని పైన కూడా ఒక అంచనా రానుంది.
Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!