రకుల్ ప్రీత్, రానా ప్రేమించుకుంటున్నారా? రకుల్ ఏం చెబుతోందంటే..

రకుల్ ప్రీత్, రానా ప్రేమించుకుంటున్నారా? రకుల్ ఏం చెబుతోందంటే..

రకుల్ ప్రీత్ సింగ్ (rakul preet singh).. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ మంచి విజయాలను అందుకుంటోంది. ఇటీవలే అజయ్ దేవగణ్ సరసన ఆమె నటించిన దే దే ప్యార్ దే సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె నటించిన మర్జావాన్.. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోఫీ చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న వర్క్ ఇట్ అప్ షో లో పాల్గొంది రకుల్ ప్రీత్. ఇందులో భాగంగా టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి (rana daggubati) తో తాను డేటింగ్ చేస్తున్నానన్న పుకార్లకు(rumours) సమాధానం చెప్పింది రకుల్. ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న ఈక్వేషన్ గురించి చెప్పుకొచ్చిందీ బ్యూటీ..

ఈ బ్యూటిఫుల్ భామకి, బాహుబలి స్టార్ రానా కి మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా వెబ్ సైట్లు వెల్లడించాయి. వీళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం.. ఇద్దరికీ కామన్ స్నేహితులు ఉండడం, ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండడం వల్ల వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ ఎన్నో వార్తలొచ్చాయి. తాజాగా ఈ టాక్ షోలో భాగంగా రకుల్ మాట్లాడుతూ.. అవునా.. ఇలా కూడా అనుకుంటున్నారా? మేమిద్దరం కేవలం నైబర్స్ (పక్కపక్కన నివసించే వాళ్లం) మాత్రమే. అంతేకాకుండా లక్ష్మి మంచు నా బెస్ట్ ఫ్రెండ్. తన స్నేహితుల గ్రూప్ లో రానా కూడా ఉండడం వల్ల మేం కలిసి బయటకు వెళ్లడం కామన్ గా జరుగుతుంటుంది. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను సినిమా రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఉన్న స్నేహితుల్లో తను కూడా ఒకరు. మేమిద్దరం మొదట స్నేహితులుగా మారినప్పుడు రానా కి వేరే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేది. ఇక మేమిద్దరం ప్రేమించుకునే అవకాశం ఎక్కడిది? అంటూ తామిద్దరి మధ్య ప్రేమ లాంటిది ఏదీ లేదని చెప్పేసింది రకుల్. అంతేకాదు.. తనకే అవసరం వచ్చినా రానా తోడుంటాడని చెప్పిన రకుల్ తమ స్నేహితుల గ్రూప్ లో 15 మంది వరకూ ఉంటారని.. అందులో ఇద్దరు ముగ్గురమే సింగిల్ కాబట్టి తమకే లింకప్ చేసి పుకార్లు పుట్టిస్తారని చెప్పుకొచ్చింది.

రకుల్, రానా కలిసి ఒక చిత్రంలో కూడా నటించలేదు. అయితే ఇద్దరూ ఒకే గ్యాంగ్ లో ఉండడం.. ఎక్కువగా కలిసి బయట కనిపించడం వల్ల వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అప్పట్లో రానా త్రిష ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రానా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా.. ఇద్దరికీ కుదరక బ్రేకప్ చెప్పుకున్నారట. ఆ తర్వాత త్రిష వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం.. ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగాయి.

కేవలం రానా తో మాత్రమే కాదట.. ఇంకెవరితోనూ ప్రేమలో లేనని చెప్పుకొచ్చిందీ అందాల భామ. తన ప్రేమ గురించి రకుల్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను ఎవరితో ప్రేమలో లేను. నాకు ఎవరితో ఎఫైర్స్ లేవు. నేను పనిలో చాలా చాలా బిజీగా ఉన్నాను. అందుకేనేమో నేను దాని గురించి ఆలోచించేందుకు కూడా నాకు సమయం దొరకట్లేదు. అందుకే నేను సింగిల్ గా ఉన్నానని నాకు అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది రకుల్. ఒకవేళ భవిష్యత్తులో ప్రేమలో పడితే ప్రపంచానికి చెప్పడానికి తాను వెనకాడనని చెబుతూ ఒకే పరిశ్రమకు చెందిన వాడైతే తనని అర్థం చేసుకుంటాడనని భావిస్తున్నానని కానీ ప్రేమ ఎప్పుడు, ఎవరిపై ఫుడుతుందో తెలీదు కాబట్టి ఎవరిని ప్రేమిస్తానో చెప్పలేనంటోంది రకుల్.

ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియాలు నటించిన మర్జావాన్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది రకుల్. ఈ సినిమా నవంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ లోనే మరో సినిమాలో నటించనుంది. అర్జున్ కపూర్ సరసన కొత్త డైరెక్టర్ కాశ్వి నాయర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో రకుల్ కథానాయికగా కనిపించనుంది. పంజాబ్, లాస్ ఏంజెల్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందట. ఇవి కాకుండా తాను నటించబోయే సినిమాల గురించి మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తానని తాజాగా రకుల్ ఓ ప్రకటన కూడా చేసింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.