ఒకప్పుడు తమిళ, తెలుగు చిత్రాలలో తిరుగులేని కథానాయికగా సత్తా చాటి.. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా తనదైన శైలిలో రాణించిన నటి, రాజకీయవేత్త జయలలిత (Jayalalithaa). ఆమె జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ ఒకటి రూపొందుతుందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ఈ రోజు ఆయా వెబ్ సిరీస్ నిర్మాతలు జయలలిత జీవిత కథా చిత్రం ‘క్వీన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. జయలలిత పాత్రలో ఇద్దరు నటీమణులు యాక్ట్ చేస్తారని తెలిపారు.
ఈ వెబ్ సిరీస్‌లో యంగ్ జయలలిత పాత్రలో అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) కనిపించగా.. రాజకీయ నాయకురాలిగా మారిన జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తారట. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. అలాగే ఈ సిరీస్‌లో ఎంజీ రామచంద్రన్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ నటిస్తున్నారని వినికిడి. తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుందని సమాచారం.
ఏ మాయ చేశావె, ఘర్షణ, రాఘవన్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండడంతో సర్వత్రా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం.
జయలలిత జీవితంలో.. చివరి 75 రోజులు ఆధారంగా మరో బయోపిక్..!
Here's the First look poster of #Jayalalitha bio web series Titled as #Queen – directed by @menongautham and Kidaari Director Prasath Murugesan#JJ #PuratchiThalaiviJayalalitha#Amma #QueenFirstLook
An @MXPlayer Original Series pic.twitter.com/HjyXs65d4R
— Yuvraaj (@proyuvraaj) September 7, 2019
ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత జీవితాన్ని మూడు అధ్యాయాలుగా చూపించనున్నారు. ఆమె బాల్యం, టీనేజ్.. అలాగే రాజకీయనాయకురాలిగా ఆమె సాగించిన ప్రస్థానాన్ని కూడా ఈ చిత్రంలో భాగంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సిరీస్ విడుదల తేది గురించి నిర్మాతలు ఎలాంటి ప్రకటనను కూడా విడుదల చేయలేదు. ఇప్పటికే జయలలిత జీవిత చరిత్రను సినిమాగా తెరకిక్కించాలని భావించారు పలువురు నిర్మాతలు. అలాగే జయలలిత బయోపిక్‌లో నిత్యా మీనన్ నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి.
జయలలిత బయోపిక్ “తలైవి” గురించి.. ఆసక్తికర విశేషాలు
ఈ క్రమంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ కథ బయటకు రావడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ వెబ్ సిరీస్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారని.. తొలుత కేవలం 10 ఎపిసోడ్లను మాత్రమే ప్రసారం చేస్తారని.. వాటికి వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి.. మిగతా భాగాలను షూట్ చేస్తారని వినికిడి. ఇది నిజ జీవిత కథ అయినప్పటికీ.. సినిమాటిక్ ఫీల్ రావడం కోసం.. కొంత ఫిక్షన్ కూడా ఈ సిరీస్‌లో జోడించారని తెలుస్తోంది. ఈ చిత్రంలో యంగ్ జయలలితగా నటంచిన అనిక సురేంద్రన్ ఇంతకు క్రితమే విశ్వాసం, ఎన్నాయ్ అరిందాళ్ లాంటి తమిళ చిత్రాలలో నటించింది.
శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?
అన్నాడీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించిన జయలలిత 2016లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణించాక.. తమిళనాడు రాజకీయాలలో ఎన్నో ఊహించని మార్పులు సంభవించాయి. పన్నీర్ సెల్వం కొన్నాళ్లు సీఎంగా చేసినా.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలను పళనీ స్వామి దక్కించుకున్నారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.