సాహో (Saaho) – ఇప్పుడు ఎక్కడ చూసినా… ఎవరి నోట విన్నా కూడా దీని గురించిన చర్చే. అయితే ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే యావరేజ్ టాక్ రావడంతో.. ఒక్కసారిగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడం ఖాయం అని అనుకున్నారంతా! అయితే బాహుబలి వల్ల వచ్చిన క్రేజ్ అనుకోవాలో? లేక సినిమాలో ఉన్న ట్విస్టులు ఆకట్టుకున్నాయో? మరింకేదైనా కారణమో తెలియదు. కాని సినిమాకి మాత్రం వరుసగా నాలుగు రోజుల పాటు కనక వర్షం కురిసింది.
Saaho Movie Review: ప్రభాస్ “సాహో” చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. లేదా..?
మొదటి నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 300 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు సాధించడంతో.. ట్రేడ్ పండితులతో పాటు.. సినీ క్రిటిక్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చాలా పెద్ద డివైడ్ టాక్‌తో మొదలైన సినిమాకి కూడా.. ఈ స్థాయిలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది.
అయితే ఆ డివైడ్ టాక్‌కి ప్రధాన కారణం దర్శకుడు సుజిత్ అని… అతనికి దర్శకత్వంలో ఉన్న అనుభవరాహిత్యమే ఈ సినిమాకి ఇటువంటి ఒక టాక్ రావడానికి కారణం అని.. దాదాపు అందరూ ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. ఇక కలెక్షన్స్ పరంగా అయితే ఈ చిత్రం దూసుకుపోవడంతో, సాహో చిత్ర దర్శకుడు ఒక ఉద్వేగభరితమైన పోస్ట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఆ పోస్ట్‌లో సుజీత్ (Director Sujeeth) తన భావాలను పంచుకుంటూ ‘నా మొదటి షార్ట్ ఫిలిం 17 ఏళ్ళ వయసులో చేయడం జరిగింది. కేవలం కుటుంబసభ్యులు, ఆర్కుట్ సహాయంతో మొదలైన నా షార్ట్ ఫిలిమ్స్ ( Short Films) ప్రయాణంలో సుమారు 90 శాతం వాటికి నేనే దర్శకత్వం వహించాను. అలా చేస్తూ నా తప్పుల నుండి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఒకరకంగా అప్పుడు ఎదురైన విమర్శలే నా ఎదుగుదలకి ప్రోత్సాహకంగా మారాయి.
ప్రభాస్ డై – హార్డ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా సాగే సాహో టీజర్ టాక్ మీకోసం..
ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే.. ఎప్పుడూ కృంగిపోకుండా ముందుకి నడిచాను. ఈరోజు సాహో చిత్రాన్ని చాలామంది చూసారు. అందులో కొంతమంది సినిమా నుండి ఇంకా ఎక్కువగా కోరుకున్నారు. అయితే చాలామందికి మాత్రం నా ప్రయత్నం నచ్చింది. సాహోని చూసినందుకు ధన్యవాదాలు.. ఇంకా చూడని వారు ఉంటే తప్పక చూడండి. చూసిన వారు రెండవ సారి చూస్తే.. ఈ చిత్రం చాలా మంచి అనుభవాన్ని మీకు కలిగిస్తుంది అని చెబుతున్నాను’ అంటూ ముగించాడు.
ఈ పోస్ట్ చూసాక, సోషల్ మీడియాలో చాలామంది సుజీత్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. 28 ఏళ్ళ వయసులో ఇంతటి భారీ వ్యయంతో నిర్మించిన చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు వహించడం.. నిజంగా కత్తిమీద సాము అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ సాహో చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చిన రోజున.. ప్రభాస్ గురించి కన్నా.. ఎక్కువమంది సుజిత్ భవిష్యత్తు గురించే కంగారు పడడం జరిగింది.
ఎందుకంటే ఇంత మంచి అవకాశం సరైన రిజల్ట్ ఇవ్వకపోతే, యువకుడైన సుజిత్ సినీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని చాలామంది అనుకున్నారు. కానీ సినిమా మంచి వసూళ్ళు సాధించడంతో.. ఆయన కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ సినిమా టోటల్ లైఫ్ టైంలో ఎంత వసూలు చేస్తుందన్న దానిని బట్టి.. సుజీత్ కెరీర్ కూడా ఆధారపడి ఉందనేది వాస్తవం. అలా రాబోయే రెండు వారాల్లో సాహో చిత్రం కలెక్షన్స్‌తో పాటు.. సుజిత్ సినీ కెరీర్ కూడా ఒక అంచనాకి రానుంది.
ఇక సుజిత్ ఇంత భారీ చిత్రాన్ని తీయడానికి.. అతన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన రెబల్ స్టార్ ప్రభాస్‌ని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే బాహుబలి అంతటి పెద్ద హిట్ తరువాత.. ఒక యువ దర్శకుడికి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద సాహసమే. అదే కాకుండా.. నిర్మాణ దశలో ఉన్నప్పుడు సైతం.. ఆయన సుజిత్‌ని సపోర్ట్ చేసిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ విషయాన్నే సుజిత్ పలుమార్లు అందరితో పంచుకుని తన కృతజ్ఞతని తెలిపాడు.
Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?