ప్రభాస్ డై - హార్డ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా సాగే సాహో టీజర్ టాక్ మీకోసం..

ప్రభాస్ డై - హార్డ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా సాగే  సాహో టీజర్ టాక్ మీకోసం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. తాజాగా నటిస్తోన్న చిత్రం సాహో (Saaho). బాహుబలి పార్ట్ 2 చిత్రం విడుదలైన తర్వాత ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమాలు విడుదల కాలేదు. భారీ స్థాయిలో రూపొందిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన సాహో చిత్రంతో రెబల్ స్టార్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త విడుదలైనా క్షణాల్లోనే దాని ప్రచారం ఊపందుకుంటోంది. ఇక అభిమానులంతా ఎప్పట్నుంచో ఆశగా ఎదురుచూస్తోన్న ఈ చిత్ర టీజర్ విడుదలైతే? వారంతా ఊరికే ఉంటారా చెప్పండి.. అందుకే యూట్యూబ్ లో దాని గురించి ప్రశంసలు, కామెంట్ల వర్షం కురిపించేస్తున్నారు. ఇంతకీ కొద్దిసేపటి క్రితమే విడుదలైన సాహో టీజర్ (Saaho Teaser) ఎలా ఉందో మీకు తెలుసా?? పదండి చూద్దాం..


సాహో టీజర్ ఎలా ఉందంటే - 

Subscribe to POPxoTV

సాహో టీజర్ చూస్తే.. ఇండియాలోనే అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్న మాటలు అక్షరసత్యం అనిపించకమానదు. ‘నా సంతోషం, బాధ.. పంచుకోవడానికి నాకు ఎవరూ లేరు..’ అంటూ శ్రద్ధాకపూర్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నీకు నేనున్నాను అంటూ ప్రభాస్ శ్రద్ధను హత్తుకుంటాడు. ఇలా సున్నితంగా సాగే సన్నివేశం నుంచి కథ ఒక్కసారిగా యాక్షన్ లోకి వెళ్లిపోతుంది. ప్రభాస్ స్టైల్లో చెప్పాలంటే.. భారీ గన్స్, చూపుతిప్పుకోనివ్వని పోరాట ఘట్టాలు, బైక్ ఛేజ్ లు.. ఇలా ప్రేక్షకులను ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి. 


వీటికి తోడు ఈ సినిమాలో ఉన్న భారీ తారాగణం కూడా కథకు ప్లస్ అవుతుందనే అనిపిస్తోంది. టీజర్ లో మనకు మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, నీల్ నితన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్.. తదితరులు కనిపిస్తారు.


భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం దాదాపు రూ.350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా బడ్జెట్ తో ఓ వైపు రికార్డు సృష్టిస్తూనే; మరోవైపు ఆ భారీ విలువలను స్క్రీన్ పై కూడా కనిపించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందుకు మనకు టీజర్ లో కనిపించే విజువల్స్ ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సినిమా సింహభాగం యాక్షన్ నేపథ్యంలోనే సాగుతుంది కాబట్టి దానికి తగ్గట్లుగానే తన నిర్మాణ విలువలు కూడా ఉండేలా చూసుకున్నారు సుజీత్. ఇక టీజర్ విషయానికి వచ్చేసరికి మనం తప్పకుండా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి.. ఒక పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ కి సరిగ్గా సరిపోయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనకు వినిపిస్తుంది. సినిమా మొత్తం యాక్షన్ నేపథ్యంలోనే సాగినప్పటికీ 4 లేదా 5 యాక్షన్ ఎపిసోడ్స్ ని మాత్రం కీలకంగా చిత్రీకరించారు దర్శక, నిర్మాతలు. వాటిలో కొన్ని మనం టీజర్ లోనూ చూడచ్చు. అవి..


టీజర్ లో కనిపించిన యాక్షన్ ఎపిసోడ్స్ -


* ప్రభాస్ బైక్ ఛేజ్ సన్నివేశం


* ఫైటర్స్ తో ఎడారి లో ఫైట్


* ప్రభాస్ & శ్రద్ధ కపూర్ కలిసి చేసిన ఫైట్ (బాహుబలి చిత్రంలో ప్రభాస్ - అనుష్క చేసినదానికి మోడరన్ వెర్షన్ లా ఉంది) 


* దుబాయ్ లోని ఎతైన భవంతి పై చేసిన యాక్షన్ ఎపిసోడ్


బాహుబలిగా మునుపటి చిత్రాల్లో మెరిసిన ప్రభాస్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తారని అభిమానులంతా మొదట్నుంచీ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాటికి తగ్గట్లుగానే సాహోలో ప్రభాస్ తన స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల ద్వారా అందరి చూపునీ తనవైపు తిప్పుకుంటున్నాడు. ఈ టీజర్ చూస్తే బాహుబలి వంటి ఒక గొప్ప హిట్ తర్వాత ప్రభాస్ సరైన కథనే ఎంచుకున్నాడు అని అనిపించకమానదు.


సాహోలో ప్రభాస్ సరసన ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోన్న విషయం మనకు తెలిసిందే. అయితే తొలి చిత్రంతోనే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శ్రద్ధ. అయితే ఈ జంట మధ్య సాగే కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? ఈ అమ్మడి అభినయం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలియాల్సి ఉంది.


కొద్దిసేపటి క్రితమే విడుదల చేసిన ఈ సాహో టీజర్ ను కేవలం తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ని ఈ చిత్రం ద్వారా మరింత పెంచాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు అర్థమవుతోంది.


కేవలం టీజర్ తోనే ఈ స్థాయిలో అంచనాలు రేకెత్తిస్తే.. ఇక త్వరలో విడుదల కానున్న ట్రైలర్ ఆ అంచనాలని ఇంకే స్థాయికి తీసుకెళుతుందో చూడాలి. అయితే అందరూ ఊహించినట్టుగా ట్రైలర్ విడుదల తేదీని మాత్రం ఇందులో ఏమీ చెప్పలేదు.


ఇక, అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ల మధ్య జరిగే సంభాషణలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఎక్కించేలా ఉన్నాయి..


వాటిలో కొన్ని -


శ్రద్ధాకపూర్ - అసలు ఎవరు వీళ్ళు?


ప్రభాస్ - ఫ్యాన్స్...


శ్రద్ధ కపూర్ - ఇంత వయలెంట్ గా ఉన్నారు...


ప్రభాస్ - డై-హార్డ్ ఫ్యాన్స్ ...


చూద్దాం.. టీజర్ తో రేకెత్తించిన ఆసక్తి, అంచనాలను ట్రైలర్ లో కూడా కొనసాగిస్తారా? లేక వాటి పాళ్లను మరింత పెంచుతారా?? ప్రస్తుతానికైతే ఈ టీజర్ ని చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం..


ఇవి కూడా చదవండి


అలా అయితే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారు : శ్రుతి హాసన్


బర్త్ డే గర్ల్ శిల్పా శెట్టి అంత అందంగా, ఫిట్‌గా ఉండేందుకు కారణాలేంటో మీకు తెలుసా?


దిశా పటానీ హాట్ ఫొటోలు చూసి.. వాళ్ల నాన్న ఏమన్నారో తెలుసా?