అత్తా కోడళ్లు ఇద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ : సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్

అత్తా కోడళ్లు ఇద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ : సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్

ఒకే రంగు దుస్తులు ఇద్దరు వేసుకొస్తే.. చెప్పుకొని వేసుకొచ్చారా అని అడుగుతాం. అలాంటిది ఒకే రంగు, ఒకే డిజైన్ ఉన్న దుస్తులు వేసుకొస్తే.. ప్లాన్ చేసుకొని వేసుకొచ్చారేమో అనుకొంటాం. ఇలాంటి సందర్భమే తెలుగింటి కోడలు సమంత (Samantha)కు ఎదురైంది.


తను ఎలాంటి డ్రస్ వేసుకొందో అచ్చంగా.. అదే డ్రస్‌ను ఆమె అత్త దగ్గుబాటి లక్ష్మి సైతం ధరించారు. కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటన సమంతను ఆశ్చర్యంలో ముంచేసిందట. చైతూతో ఇద్దరూ కలిసి దిగిన ఈ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ‘అరె అత్తాకోడళ్లిద్దరూ భలే అందంగా ఉన్నారే’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


దగ్గుబాటి లక్ష్మి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప.. పెద్దగా బయట కనిపించరు. తన కొడుకు నాగ చైతన్య, కోడలు సమంతతో కలసి డిన్నర్ చేసిన ఆమె అచ్చం తన కోడలి మాదిరిగానే రెడీ అయ్యారు. దుస్తులు మాత్రమే కాదు హెయిర్ స్టైల్ సైతం సమంత లాగే ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఇద్దరూ ఒకే రకమైన అవుట్ ఫిట్స్‌లో కనిపిస్తే అభిమానులకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఈ Instagram ఫోటోపై కొణిదెల వారి కోడలు ఉపాసన సైతం ‘పర్ఫెక్ట్ బహు’ అని కామెంట్ కూడా చేసింది.


ఇన్‌స్టాగ్రామ్‌లోఫొటో పోస్ట్ చేస్తూ సమంత ‘ప్రతి అబ్బాయి తన తల్లి లాంటి అమ్మాయే తనకు భార్యగా రావాలని కోరుకొంటాడు. అది నిజమే. ఈ విషయంలో నాకు ఆమోదం లభించింది. సేమ్ డే.. సేమ్ అవుట్ ఫిట్‌తో అత్తయ్య మాదిరిగానే రెడీ అవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.(మేం ఏమీ ప్లాన్ చేసుకోలేదు)’ అని చెప్పుకొచ్చింది.

ఈ ఫొటోను చూసి సమంత అభిమానులు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ‘మీ అత్తగారు నీకు సోదరిలా ఉన్నార’ని ఒకరంటే.. ‘చిన్న చిన్న విషయాల్లో సైతం ఆనందం వెతుక్కొంటున్న తీరు అద్భుతమ’ని మరొకరు కామెంట్ చేశారు. యాదృఛ్ఛిక‌మే అయినా న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని మరొకరు తమ అభిప్రాయం వెలిబుచ్చారు.


నాగచైతన్య, సమంత ఇద్దరూ జంటగా నటించిన చిత్రం "మజిలీ" త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. పైగా వీరిద్దరూ హిట్ పెయిర్ కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో రిలీజ్ అవుతున్నప్పటికీ హిట్ అవుతుందనే ధీమాతో ఉందీ జంట.


 Also Read: స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!


కెరీర్ బాటకు వివాహాలు ప్రతిబంధకాలు కావు: సమంత సినీ ప్రస్థానం


స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!


భార్యాభ‌ర్త‌ల బంధం ఎలా ఉండాలో ఈ అక్కినేని జంటను చూసి నేర్చుకోవాల్సిందే..


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కథనాలు చదవచ్చు.


మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్ గా వెలుగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి - www.plixxo.com


ఇండియాలోనే అతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్ లో చేరి టాప్ బ్రాండ్స్ తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.