ట్రాఫిక్ పాఠాలు చెబుతున్న... ఈ శాంటా క్లాజ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ట్రాఫిక్ పాఠాలు చెబుతున్న... ఈ శాంటా క్లాజ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

క్రిస్మస్ అంటేనే శాంటా క్లాజ్.. అలాగే శాంటా క్లాజ్ అంటేనే క్రిస్మస్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు, పెద్దలకు బహుమతులు, కానుకలు ఇవ్వడం అనేది ఈ శాంటా క్లాజ్ ప్రత్యేకత. అయితే.. ఈసారి ఇదే శాంటా క్లాజ్ పాత్ర సహాయంతో.. జనాలకు ఓ మంచి సందేశం ఇవ్వాలని భావించారు గోవాకి చెందిన ట్రాఫిక్ పోలీసులు. తామే స్వయంగా శాంటా క్లాజ్ (Santa Claus) వేషాలు వేసుకొని గోవా (Goa) వీధులలో వాహనదారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. అలా పంచిపెడుతూనే హెల్మట్ ధరించి వాహనం నడపాలని.. అలాగే వేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు. 

ప్రస్తుతం ఈ వినూత్న శాంటా క్లాజ్‌లకు నిజంగానే మంచి రెస్పాన్స్ వస్తోంది. పోలీసు అధికారులతో పాటు సామాన్య జనం కూడా ఈ శాంటా క్లాజ్ కాన్సెప్టును ఎంతగానో అభినందిస్తున్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నాలతో జనాలకి అవగాహన కల్పించడం వల్ల.. వారు మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో గోవాలో ట్రాఫిక్‌కు సంబంధించి ఎన్నో కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లను వాడేవారితో పాటు అమ్మే వారిపై కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భారీ స్థాయిలో ఫైనులు కూడా వసూలు చేస్తున్నారు. 

క్రిస్మస్‌ని ఎంజాయ్ చేయాలా? అయితే ఈ పనులు తప్పక చేయండి..

అలాగే ప్రస్తుతం శాంటా క్లాజ్ కాన్సెప్టుతో అవగాహన కల్పించడం అనేది కూడా .. ఇదే ప్రథమం కాదు. గతంలో హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలలో కూడా ఈ కాన్సెప్టుతో వాహనచోదకులకు సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించారు ట్రాఫిక్ పోలీసులు. నిజం చెప్పాలంటే.. ఈ శాంటా క్లాజ్ పాత్రే చాలా విచిత్రమైన పాత్ర. ఈ పాత్రకు ప్రేరణ సెయింట్ నికోలస్ అనే వ్యక్తి అని అంటారు. అయితే తర్వాతి కాలంలో శాంటా క్లాజ్ నిజంగానే ఉన్నాడని.. ఉత్తర ధ్రువం (North Pole) నుండి ఆయన పిల్లల కోసం బహుమతులు తీసుకొస్తుంటాడని అభూత కల్పనలతో కూడిన ఓ కథ ప్రచారంలోకి వచ్చింది.

ఈ కేక్ రెసిపీలతో.. మీ క్రిస్మస్‌ని అద్భుతంగా జరుపుకోండి

ఆ తర్వాత శాంటా క్లాజ్ అనే వ్యక్తి నిజంగా అందరూ అనుకొనే ఉత్తర ధ్రువపు నార్త్ పోల్‌లో లేడని.. అమెరికాలోని నార్త్ పోల్‌ అనే పేరు గల చిన్న పట్టణంలో ఉన్నాడని కొందరు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నిజమే అని నమ్మి.. అనేకమంది పిల్లలు 'శాంటా క్లాజ్, నార్త్ పోల్, అమెరికా' అడ్రస్‌కి లక్షలాది ఉత్తరాలు మెయిల్ చేయడంతో.. ఆ దేశపు పోస్టల్ శాఖ విస్తుపోయిందట. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ.. శాంటా క్లాజ్ నిజంగా ఉన్నాడని నమ్మి ఉత్తరాలు రాసే అమాయక పిల్లల కలలను చెదరకొట్టకూడదని భావించి.. తిరుగు టపాలు రాయడం విశేషం.

షాపింగ్‌కు వెళ్తున్నారా.? అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

ఆ విధంగా శాంటా క్లాజ్ పాత్ర చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం శాంటా క్లాజ్ ఆకారంలో కేకులు కూడా తయారు చేస్తూ విక్రయిస్తున్నాయి కొన్ని బేకరీలు. కొన్ని రెస్టారెంట్లు, పబ్స్, బార్స్ శాంటా క్లాజ్ థీమ్‌తో డిన్నర్ నైట్లు, బఫేలు, పార్టీలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఏదేమైనా.. క్రిస్మస్ పండగకి ఇంత కళ వచ్చిందంటే దానికి కారణం శాంటా క్లాజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఇదే శాంటా పాత్రను సందేశాలు ఇవ్వడానికి ఉపయోగించుకోవడం కూడా మంచి పరిణామయే. మొత్తానికి మన క్రిస్మస్ తాతే .. అసలు సిసలైన క్రిస్మస్ హీరో అయిపోయాడు మరి. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.