ADVERTISEMENT
home / Celebrity gossip
అలా అయితే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారు : శ్రుతి హాసన్

అలా అయితే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారు : శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ (Shruthi haasan).. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ఇటు దక్షణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కథానాయిక. కేవలం నటనతోనే కాదు.. తన గాత్రంతోనూ మంచి పేరు సంపాదించుకుందీ అందాల నాయిక. మైఖెల్ కోర్సలే తో ఆమె ప్రేమాయణం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త చెబుతారా? అని అంతా వేచిచూశారు. కానీ ఏప్రిల్ 26న ఆమె బాయ్ ఫ్రెండ్ మైఖెల్ తామిద్దరం విడిపోయినట్లు ప్రకటించగానే అభిమానులంతా షాక్ కి గురయ్యారు. దీని గురించి శ్రుతి ఇప్పటివరకూ స్పందించలేదు. తాజాగా పింక్ విల్లా కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన వివరాలన్నింటినీ వెల్లడించింది శ్రుతి.

shruthi4

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తన జీవితంలో ఆనందంగా ఉన్నానని చెబుతూ.. నేను ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నా.. నేను సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడు తను ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తోంది అని చాలామంది భావించారు. కానీ నా జీవితంలో నేను చాలా ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నానని నా అభిప్రాయం. జీవితం కూడా పెర్ఫ్యూమ్ వాసన పీల్చడం లాంటిదే.. చాలా పెర్ఫ్యూమ్స్ ఒకేసారి వాసన చూస్తే ఏది ఎలా వాసన వస్తోందో కాసేపటి తర్వాత అస్సలు అర్థం కాదు. మధ్యలో ఓ నిమిషం బ్రేక్ తీసుకొని బయటకు వెళ్లి తిరిగొస్తేనే వాటన్నింటిలో బెస్ట్ ఏదనే విషయం అర్థం అవుతుంది. జీవితం కూడా అంతే.. మనం కొనసాగిస్తున్నన్ని రోజులు అలా జరిగిపోతూనే ఉంటుంది. బయటకు వెళ్లి కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి వచ్చి ఆలోచిస్తే తప్ప.. జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నామో అర్థం కాదు.. అంటూ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం గురించి చెప్పుకొచ్చింది శ్రుతి.

shruthi6

ADVERTISEMENT

అంతేకాదు.. తన పెళ్లి గురించి తరచూ వచ్చే పుకార్ల గురించి కూడా మాట్లాడిందీ బ్యూటీ.. నాపై ఇప్పటివరకూ వచ్చిన పుకార్లు నిజమై ఉంటే నేను ఈపాటికే పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు తల్లై విడాకులు తీసుకొని ఉండేదాన్ని. నా జీవితంలో అంతా అయిపోయింది.. అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఒక అమ్మాయి తన జీవితంలో అన్నింటి నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటే అది తప్పా? నాకైతే ఈ కథనాలన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నాకు సాధారణంగానే పెళ్లంటే చాలా భయం. నేను పెళ్లి చేసుకుంటున్నా అని పుకార్లు వచ్చిన ప్రతిసారి ఇలాంటివి ఎందుకు రాస్తారో.. నా విషయంలో ఇలా రాయకండి ప్లీజ్ అనుకునేదాన్ని. కానీ తప్పదుగా.. నా దృష్టిలో ఆనందకరమైన వివాహ జీవితం అంటే పెళ్లి తర్వాత కూడా నా కెరీర్ ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా నేను కొనసాగించగలగడమే.. ఇది నాకు నేను పెట్టుకున్న నియమం. నేను వర్కింగ్ వైఫ్, వర్కింగ్ మామ్ గా ఉండాలనుకుంటున్నా. అలా ఉండేందుకు ఒప్పుకున్న వ్యక్తినే పెళ్లాడతా.. అంటూ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది శ్రుతి.

shruthi5 3180634

ప్రేమ గురించి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది శ్రుతి. నేను బయటకు కనిపించను కానీ లోపల చాలా రొమాంటిక్. ఈ విషయం నాకు కూడా చాలా లేట్ గా తెలిసింది. నేను చాలా రొమాంటిక్ కాబట్టి ప్రేమించే వ్యక్తితో ఉండాలనుకుంటా. కానీ అదే సమయంలో నాకు నా స్పేస్ కూడా కావాలి. నాలో నాకు అన్ రొమాంటిక్ గా అనిపించేది ఇదే. నేను ఎవరితోనైనా చాలా క్లోజ్ గా ఉండి.. వారిని ప్రేమిస్తే వారితో చాలా రొమాంటిక్ గా ఉండగలను. అంతలా వారితో పెద్ద కనెక్షన్ లేకపోతే నా వ్యవహార శైలి నాకే అన్ రొమాంటిక్ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి మాయమైపోయినా నేను పెద్దగా పట్టించుకోనట్లే ఉంటాను.. ఓ వ్యక్తి పట్ల ఆకర్షితురాలినవ్వడం.. ఆ వ్యక్తి గురించే ఆలోచించడం.. తనతో రొమాంటిక్ గా మాట్లాడడం.. ఇవన్నీ నాకిష్టం. నేను చాలా రొమాంటిక్ వ్యక్తిని కానీ అది నా వ్యక్తిగత స్పేస్ నాకు ఉన్నంత వరకే. దానికి భంగం కలిగితే నేను ఊరుకోలేను. అంటూ ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

shruthi2 6083169

ADVERTISEMENT

 

తన ప్రేమ గురించి, మైఖెల్ గురించి ఏమాత్రం ప్రస్తావించని ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన బ్రేకప్ కి కారణం చెప్పకనే చెప్పిందని.. అది బ్రేకప్ కాదు.. తను కాస్త గ్యాప్ తీసుకోవాలనుకుంటుందని.. ఇలా నెటిజన్లు తమకు తోచిన విధంగా ఈ ఇంటర్వ్యూని అన్వయించుకుంటున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పడం ఇష్టం లేదని శ్రుతి చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకేనేమో.. అందుకే తన వ్యక్తిగత వ్యవహారాల గురించి ఏమాత్రం బయటకు వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి.

ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి

ADVERTISEMENT

“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత

ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించిన ఏక్తా.. సింగిల్‌గా ఎందుకు మిగిలిందో తెలుసా?

Images : Shutterstock. 

12 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT