రానా అందించిన కానుకతో.. మురిసిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..!

రానా అందించిన కానుకతో.. మురిసిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..!

అమర చిత్ర కథ (Amar Chitra Katha).. ఇతిహాసాలు, పురాణ గాథలను నేటి తరం చిన్నారులకు చేరువ చేస్తున్న కామిక్ పుస్తకం. మహాభారత కథలు, రామాయణ కథలు, అక్బర్ - బీర్బల్ కథలు, భాగవత కథలు, జాతక కథలు, వీరగాథలు, చారిత్రక గాథలు, బొమ్మల కథల రూపంలో ఈ పుస్తకాలు బుక్ షాపుల్లో లభ్యమవుతూ ఉంటాయి. చిన్నారులకు అర్థమయ్యే సరళమైన ఆంగ్ల భాషలో ఉండడం ఈ పుస్తకాల స్పెషాలిటీ. అలాగే ఈ మధ్యకాలంలో మిగతా భారతీయ భాషల్లో కూడా వీటిని ప్రచురించడానికి శ్రీకారం చుట్టారు పబ్లిషర్స్.


అమర చిత్ర కథలు పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ అమర చిత్ర కథే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకో తెలుసా? మన భల్లాలదేవుడు రానా (Rana) యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు.. అమర చిత్ర కథ పుస్తకాల సెట్‌ను కానుకగా ఇచ్చాడు.


భల్లాలదేవుడిచ్చిన బహుమతి ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చేసింది. ఈ సంతోషాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకొన్నారు తారక్. ‘అమర చిత్ర కథ కామిక్ పుస్తకాలు బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కానుక నా బాల్యాన్ని నాకు తిరిగి గుర్తు చేసింది. ఈ గొప్ప బహుమతిని అభయ్‌తో పంచుకొనే అవకాశం కల్పించావు. ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేశారు.

ఈ సెట్‌లో ఎన్ని పుస్తకాలుంటాయో తెలుసా? దాదాపు రెండు వందలకు పైగానే. ఈ సెట్ ధర సుమారుగా పదిహేను వేల రూపాయల పైమాటే. ధర విషయం పక్కన పెడితే ఈ పుస్తకాలు మనకందించే జ్ఞానం వెలకట్టలేనిది. అందుకే దీన్ని అమూల్యమైన బహుమతిగా భావిస్తున్నారు ఎన్టీఆర్. రానా కానుకగా ఇచ్చిన ఈ అమర చిత్రకథ సెట్‌లో చారిత్రక కథలు, ఇతిహాస కథలు, బెడ్ టైమ్ స్టోరీస్, హాస్యభరితమైన కథలు, స్ఫూర్తినిచ్చే యదార్థ గాథలు, ఫిక్షన్ కథల పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.


భారతీయ సంస్కృతిని, దాని గొప్పదనాన్ని నేటి తరం చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే.. అమర చిత్ర కథ ఆధారితమైన థీమ్ పార్కులు, లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ప్రచార కర్తగా దగ్గుబాటి రానా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కు అమర చిత్ర కథ పుస్తకాలను అందించడం ప్రాధాన్యం సంతరించుకొంది.


రానా కూడా త్వరలో ఫ్యూచర్ గ్రూపు ప్రారంభించబోయే అమర చిత్ర కథ థీమ్ పార్కుల వెంచర్‌లో భాగస్వాములవుతారని కూడా వార్తలు వస్తున్నాయి.


వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RRR సినిమాలో కొమరం భీంగా నటిస్తున్నారు. ఇదే చిత్రంలో రామ్ చరణ్ మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనువిందు చేయనున్నారు. రానా ప్రస్తుతం "హౌస్ ఫుల్ 4" లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Images: Instagram.com/JrNTR , Instagram.com/RanaDaggubati


ఇవి కూడా చ‌ద‌వండి


తండ్రి సినిమా కోసం.. మెగాఫోన్ పట్టుకున్న కూతురు..!


"చిరుత" నుండి "రంగస్థలం" వరకు.. అలుపెరగని పయనం: హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్


మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి : నయనతార


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.