ADVERTISEMENT
home / Celebrity Life
ఈ శ్రీదేవిని చూస్తే.. ‘అతిలోక సుందరి’ తిరిగి భూమ్మీదకొచ్చిందా అన్నట్లుంది కదా..!

ఈ శ్రీదేవిని చూస్తే.. ‘అతిలోక సుందరి’ తిరిగి భూమ్మీదకొచ్చిందా అన్నట్లుంది కదా..!

అందాల రాశి… అతిలోక సుందరి.. ఇలాంటి ఎన్ని పదాలు చెప్పినా అద్భుతమైన శ్రీదేవి (Sridevi) అందాన్ని అవి పూర్తిగా వర్ణించలేవు. ఆమె మనందరినీ వదిలి వెళ్లిపోయి సంవత్సరం దాటినా.. తను ఇంకా మనలోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. చిత్రమేంటంటే.. నిన్నటి నుంచి ట్విట్టర్‌లో #SrideviLivesForever అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి ఓ ముఖ్యమైన కారణం కూడా ఉంది.

అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (madame tussads) మ్యూజియంలో ఈరోజు ఆవిష్కృతమైంది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోలను ఆమె భర్త బోనీ కపూర్, సింగపూర్‌కి చెందిన మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ “శ్రీదేవి కేవలం మా గుండెల్లోనే కాదు.. కోట్లాది మంది అభిమానుల మనసుల్లోనూ ఎప్పుడూ జీవించే ఉంటుంది. తన మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించే సమయం కోసం ఎంతో వేచిచూస్తున్నా” అంటూ ట్వీట్ చేస్తూ దానికి శ్రీదేవి విగ్రహానికి సంబంధించిన టీజర్ వీడియోను జోడించడం విశేషం.

ADVERTISEMENT

Instagram

ఈ ఉదయం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో.. శ్రీదేవి విగ్రహాన్ని కూతుళ్లు ఖుషీ కపూర్, జాన్వి కపూర్‌లతో కలిసి ఆమె భర్త బోనీ కపూర్ ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆ ముగ్గురూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా కూతుళ్లు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్‌‌లు కళ్ల నీళ్లు పెట్టుకోవడం కూడా మనం గమనించవచ్చు.

ఈ కార్యక్రమంలో శ్రీదేవి కుటుంబంతో పాటు.. బోనీ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్, రాఖీ పంజాబీ వంటి సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. మిస్టర్ ఇండియాలోని “హవా హవాయి” పాటలో వేసుకున్న దుస్తుల్లో ఈ మైనపు బొమ్మను అలంకరించడం విశేషం. ఈ మైనపు విగ్రహంతో కలిసి కపూర్ కుటుంబం దిగిన ఫొటోలు చూస్తే.. శ్రీదేవి నిజంగానే తిరిగి వచ్చిందేమో.. ఆమె నిజంగానే కుటుంబంతో కలిసి ఫొటోలు దిగిందేమో అని అనిపించడం ఖాయం.

ఈ ఏడాది ఆగస్టు 13 తేదిన.. శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా సింగపూర్‌‌కి చెందిన మేడమ్ టుస్సాడ్స్ ఆమె విగ్రహాన్ని తమ మ్యూజియంలో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. “బాలీవుడ్ ఐకాన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లడిస్తూ.. ఆమెకు నీరాజనాలు అందించేలా ఈ సెప్టెంబర్‌లో ఆమె మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఆ విగ్రహం అన్నింటి కంటే ఎంతో ప్రత్యేకం. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌కి ఇది అదనపు ఆకర్షణగా మారుతుందని భావిస్తున్నాం” అంటూ మ్యూజియం నిర్వాహకులు ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

ఆ ట్వీట్‌కి బోని కపూర్ సమాధానం ఇస్తూ “మేడమ్ టుస్సాడ్స్ శ్రీదేవిని గౌరవిస్తూ.. ఆమె మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నందుకు నానెంతో ఆనందంగా ఉన్నా. నేను మా కుటుంబం ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేస్తాం. వచ్చేనెల ఆ గొప్ప అనుభవాన్ని పొందేందుకు ఎంతగానో వేచిచూస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.

https://www.instagram.com/viralbhayani/

లేడీ సూపర్ స్టార్ అని తన ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే అతిలోక సుందరి శ్రీదేవి.. తెలుగు, తమిళం, మలయాళం వంటి దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలో కూడా.. దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది. ఐదు దశాబ్దాల పాటు సినీరంగాన్ని యేలి.. సీనియర్ నుంచి జూనియర్ హీరోల వరకూ అందరితోనూ నటించింది. ఆమె నటించిన ‘మామ్’ సినిమాకి జాతీయ పురస్కారం కూడా దక్కింది. అయితే దాన్ని అందుకోకముందే దుబాయ్‌లో.. ఫిబ్రవరి 24 తేదిన శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

దుబాయ్‌కి తన మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్లి సందర్భంగా వెళ్లిన శ్రీదేవి.. అక్కడి హోటల్ బాత్ టబ్‌లో మునిగి మరణించిన సంగతి తెలిసిందే. ముందు అనుమానాస్పద మరణంగా గుర్తించినా.. ఆ తర్వాత ఆమె మరణానికి ఎవరూ కారణం కాదని.. ఆమెది హత్య లేదా ఆత్మహత్య కాదని.. సహజ మరణమేనని అక్కడి ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

04 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT