ADVERTISEMENT
home / Bigg Boss
బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సర్ ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతోందా?

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సర్ ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతోందా?

బిగ్ బాస్ సీజన్ 3 లో ఆఖరి వారం నామినేషన్స్ అయిపోయాయి. అయితే సాధారణంగా శనివారం, ఆదివారం ఉండే ప్రక్రియ ఈసారి శుక్రవారమే జరుగనుందా? అని అనుమానాలు వస్తున్నాయి.. కొద్దిసేపటి క్రితమే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్  సంబందించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో నామినేషన్స్ లో ఉన్న అయిదుగురు సభ్యులని తమ సూట్ కేస్ లని ప్యాక్ చేసుకుని గార్డెన్ ఏరియా లోకి రమ్మని చెప్పడం జరిగింది. దీనితో ఈ వారం సర్ ప్రైజ్ (surprise) ఎలిమినేషన్ (elimination) ఉండబోతుందా అనే ఆసక్తి మొదలైంది. అయితే ఆ సూట్ కేసులు ఎందుకు ప్యాక్ చేసుకున్నారో.. ఎలిమినేషన్ ఉందా? లేక అది ఏదైనా టాస్కా? అన్నది రాత్రికి తెలుస్తుంది. 

ఓట్ల కోసం హౌస్ మేట్స్ కి చిత్రవిచిత్రమైన టాస్కులు పెడుతోన్న బిగ్ బాస్..

ఇక నిన్నటి ఎపిసోడ్ లో , ముందుగా ఒకరిపై ఒకరు రంగులు పోసుకున్నారు. హౌ క్లీన్ ఈజ్ యువర్ జర్నీ.. అనే టాస్కులో భాగంగా జర్నీ పూర్తిగా క్లియర్ గా ఉన్న ఒక కంటెస్టెంట్ ని గుర్తించాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీని ప్రకారం తమకు ఇచ్చిన వ్యక్తి జర్నీ గురించి మాట్లాడుతూ వారి జర్నీ క్లియర్ గా లేకపోతే వారి పై రంగు పోయాల్సి ఉంటుంది. ఇందులో వరుణ్ బాబా భాస్కర్ పై, బాబా భాస్కర్ అలీపై, శ్రీముఖి శివ జ్యోతి పై, శివ జ్యోతి వరుణ్ పై రంగులు పోశారు. ఆఖరికి క్లీన్ జర్నీ ఉన్న వ్యక్తిగా ఫైనలిస్టుగా మారేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా హౌజ్ మేట్స్  శ్రీముఖిని ఎంపిక చేశారు. 

దీనికి సంబంధించిన టాస్క్ లో వరుణ్ సందేశ్ పేరున్న బౌల్ శివజ్యోతికి రావడంతో.. వీరి మధ్య గత వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ సమయంలో జరిగిన దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాటల సందర్భంలో మరొకసారి ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం గమనార్హం.

ADVERTISEMENT

ఆ తర్వాత టాస్క్ లో  బిగ్ బాస్ షో లో (bigg boss show) పాల్గొనే కంటెస్టెంట్స్ తమలోని అనేక భావోద్వేగాల్ని బయట పెట్టారు.  ‘కమ్ ప్యూర్ & కమ్ క్లీన్’ టాస్క్ లో భాగంగా శ్రీముఖి అయిదేళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఇంటిసభ్యులతో చెప్పడం జరిగింది. అయితే ఆ సంఘటన తన ప్రేమకథ కి సంబంధించింది కావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆమె చెప్పే దాని పైన పడింది.

ఆ సమయంలో తన కెరీర్ & ప్రేమ రెండు ఒక్కసారే మొదలై రెండిట్లోనూ సక్సెస్ ఫుల్ గా సాగుతుండడంతో జీవితంలో చాలా ఆనందంగా ఉండేదట. అలా అటు వ్యక్తిగత జీవితం ఇటు వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగిపోతున్నది అని అనుకుంటున్న సమయంలో… తన ప్రేమబంధంలో అనుకోని కుదుపులు వచ్చాయట. చాలా గొడవలు పడి వారిద్దరూ విడిపోయారట. దాంతో ఏమి చేయాలో అర్ధమవ్వక బాగా ఏడ్చెదట. ఒకానొక సందర్భంలో చచ్చిపోదాం అని కూడా అనిపించిందట. అయితే ఆ సమయంలో తన చుట్టూ ఉన్నవారి సహాయం & ఇచ్చిన ధైర్యంతో తను తన తల్లిదండ్రుల కోసం జీవించానని చెప్పింది శ్రీముఖి. 

అదే సమయంలో అమ్మాయిలు తమ కాళ్ళ పైన తాము ఆర్ధికంగా నిలబడి తమ కుటుంబానికి అండగా ఉండగలం అని అనిపించిన తరువాతే ప్రేమ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని.. ఎందుకంటే ఆ సమయంలోనే మనకి జీవితం పట్ల ఒక అవగాహన వచ్చి ముందుకి సాగే వీలుంటుంది అని ఈ షో చూస్తున్న అమ్మాయిలకి ఒక సూచన చేసింది.

అలీ రెజా చేసిన పొరపాటుతో.. రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ ఫినాలే టికెట్

ADVERTISEMENT

అయితే తాను ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పడానికి మాత్రం అస్సలు ఇష్టపడలేదు. అతడు కూడా సెలబ్రిటీ కాబట్టి పేరు తెలిస్తే అతనికి ఇబ్బంది కలుగుతుంది అని కూడా చెప్పింది. దీంతో అతను కచ్చితంగా టెలివిజన్ లేదా సినిమా రంగానికి చెందిన వ్యక్తి అని అర్థమైపోయింది. ఇక ఈ టాస్క్ ముగిశాక, శ్రీముఖితో ప్రేమలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని పలుమార్లు శివజ్యోతి ప్రయత్నించినా కూడా ఆమె చెప్పలేదు. సరికదా, ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వరుణ్ సందేశ్ ని కూడా చెప్పొద్దు అని కోరడం కొసమెరుపు. ఇదే టాస్క్ లో శివజ్యోతి తన తండ్రి చనిపోయినా తన కోసం రెండు రోజుల పాటు బతికే ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు నాటకం ఆడిన విషయం వెల్లడించింది. వరుణ్ తను టీనేజ్ లో ఉన్నప్పుడు గోవాలో జరిగిన ఓ గొడవ గురించి చెప్పుకొచ్చాడు. 

ఇదిలావుండగా ‘హౌ క్లీన్ ఈజ్ యువర్ జర్నీ’ అనే టాస్క్ ని ఇంటిసభ్యులకి ఇవ్వడం జరిగింది. అందులో నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరికి మరొకరి పేరుతో ఉన్న రంగు నింపిన బౌల్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే తమకి ఇచ్చిన బౌల్ పైన పేరున్న వ్యక్తి వద్దకి వెళ్లి, ఆ సదరు వ్యక్తి టాప్ 5 కి ఎందుకు వెళ్ళకూడదో అన్నది చెప్పాల్సి ఉంటుంది.

ఏదేమైనా.. ఆఖరి వారానికి చేరువవుతున్న ఈ తరుణంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మనసులో విషయాలని మెల్లమెల్లగా తన టాస్కుల ద్వారా బయటపెట్టిస్తున్నారు బిగ్ బాస్. షో చాలా ఎమోషనల్ గా మారి వీక్షకుల ఆదరాభిమానాలను సంపాదిస్తోంది. 

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం

ADVERTISEMENT
25 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT