ADVERTISEMENT
home / Celebrity Life
‘యువరాణి’గా మారిన ‘జిగేలు రాణి’ .. వైరల్ అవుతున్న పూజా హెగ్డే కొత్త లుక్

‘యువరాణి’గా మారిన ‘జిగేలు రాణి’ .. వైరల్ అవుతున్న పూజా హెగ్డే కొత్త లుక్

(Telugu Actress Pooja Hegde to act as Rajkumari Mala in Housefull 4)

ఒక లైలా కోసం, ముకుంద, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి పూజ హెగ్డే. “రంగస్థలం”లో జిగేలు రాణిగా కూడా తన ఐటమ్ నెంబర్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ భామ.. తాజాగా ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో  ‘సైకిల్ శ్రీదేవి’గా అభిమానుల మనసును దోచేసుకుంది. ఇప్పుడు ఆమె అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘హౌస్‌ఫుల్-4’ అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌లలో పూజా హెగ్డే లుక్ కూడా ఉంది. ఈ చిత్రంలో “యువరాణి మాలా”గా.. అలాగే “పూజ” అనే సాధారణ అమ్మాయిగా రెండు విభిన్న పాత్రలలో నటిస్తుందామె. ఈమెకు బాలీవుడ్ సినిమాలు కొత్తేమీ కాదు. గతంలో హృతిక్ రోషన్ సరసన ‘మోహంజాదరో’ సినిమాలో కూడా నటించిందామె. తాజాగా పూజ నటిస్తున్న ‘హౌస్‌ఫుల్-4’ చిత్రం కొంత సోషియా ఫాంటసీ సబ్జెక్టులా అనిపిస్తోంది.

రహస్య వివాహం చేసుకున్న.. “గ్రీకువీరుడు” హీరోయిన్ పూజా బాత్రా ..!

ADVERTISEMENT

‘హౌస్‌ఫుల్-4’ చిత్రంలో అక్షయ్ కుమార్, పూజా హెగ్డేలతో పాటు బాబీ డియోల్, రితేష్ దేశ్ ముఖ్, క్రితి సనన్, క్రితి కర్బందా.. మొదలైనవారు నటిస్తున్నారు. అలాగే రానా దగ్గుబాటి కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. సాజిద్ నడియాద్‌వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆరుగురు సంగీత దర్శకులు మ్యూజిక్ అందిస్తుండగా.. అందులో మన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ కూడా ఒకరు. 

సైకిల్ పైన “శ్రీదేవి”గా.. ఫ్యాన్స్ హృదయాలని కొల్లగొట్టేస్తున్న పూజ హెగ్డే ..!

 

 

ADVERTISEMENT

 

 

 

 

ADVERTISEMENT

అలాగే పూజా హెగ్డే.. అల్లు అర్జున్ సరసన “అల వైకుంఠాపురం” అనే చిత్రంలో కూడా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్, ఎస్. రాధాక్రిష్ణలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఈ సినిమా విడుదలవుతుందని టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, మలయాళం, తమిళంలో కూడా డబ్ చేసి.. విడుదల చేయబోతున్నారు. 

ఈ సుంద‌రి అంద‌మే కాదు.. ఫ్యాష‌న్స్ కూడా లావ‌ణ్య‌మే..!

ముంబయిలో పుట్టి పెరిగిన పూజ హెగ్డేకు.. కర్ణాటకలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె తల్లిదండ్రులు మంగళూరు వాస్తవ్యులు. అలాగే ఆమె మాతృభాష తుళు. 2009లో మిస్ ఇండియాలో పోటీల్లో కూడా ఆమె పాల్గొంది. కానీ ఆమెకు లక్ కలిసిరాలేదు. ఆ తర్వాత 2010లో మళ్లీ అదే పోటీలో పాల్గొని.. సెకండ్ రన్నరప్‌గా నిలచింది. తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈమె నటించిన తొలి చిత్రం “మూగమూడి”. ఈ తమిళ సూపర్ హీరో సినిమాలో జీవా సరసన కథానాయికగా నటించింది పూజ.

Featured Image: Instagram.com/PoojaHegde

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.                                                                               

25 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT