అదే సంవత్సరం... అదే తేదిన నాకు బిడ్డ పుడతాడు : సమంత అక్కినేని

అదే సంవత్సరం... అదే తేదిన నాకు బిడ్డ పుడతాడు : సమంత అక్కినేని

(Samantha opens up on having a baby with Naga Chaitanya)

"ఏ మాయ చేశావే" చిత్రంతో కుర్రకారు మనసు దోచేసిన నటి సమంత. అదే చిత్రంలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి.. ఆ తర్వాత తననే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా.. అప్పుడప్పుడు సరదాగా సమాధానాలిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది ఈ భామ. "మీరు పిల్లాడిని ఎప్పుడు కంటారు ? " అని ఓ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "నేను తల్లి కావాలని ఎదురు చూస్తున్న వారికి ఇదే నా సమాధానం. 2022 ఆగస్టు 7వ తేదిన.. ఉదయం 7 గంటలకు నాకొక బేబీ పుడుతుంది. సరేనా" అని సమాధానమిచ్చింది సమంత. 

సమంత పాడిన పాటకు.. వారు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారంటే..?

అయితే సమంత అసహనంతోనే ఈ సమాధానమిచ్చిందని అభిమానులకు ఇట్టే అర్థమైంది. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో సమాధానాలివ్వడం ప్రారంభించాక.. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను కూడా మొహమాటపడకుండా కొంతమంది అడిగేస్తున్నారు. అయితే ఇటువంటి వాటికి కొందరు సెలబ్రిటీలు చాలా తెలివిగా జవాబిస్తున్నారు. ఇటీవలే నటుడు సాయి ధరమ్ తేజ కూడా ఇలాంటి జవాబే ఇచ్చారు. తనను "ఏరా" అని సంబోధించిన అభిమానికి తాను కూడా "ఏరా.." అంటూ తెలివిగా జవాబిచ్చాడు. 

"చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే" : సమంత

ఇక సమంత విషయానికి వస్తే.. ఈ సంవత్సరం ఆమె నటించిన మూడు చిత్రాలు (మజిలీ, సూపర్ డీలక్స్, ఓ బేబీ) కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం తమిళం చిత్రం "96" తెలుగులో కూడా రీమేక్ అవుతుండగా.. అందులో కూడా కథానాయికగా నటిస్తోంది సమంత. ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’  అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది సమంత. అలాగే తెలంగాణలో చేనేత పరిశ్రమలను ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా కొనసాగుతోంది సమంత. 

 

తనకు పుట్టబోయే బిడ్డల విషయానికి సంబంధించి.. గతంలో కూడా సమంత పలు ఇంటర్వ్యూలలో తన భావాలను పంచుకుంది. తను గనుక బిడ్డకు జన్మనిస్తే.. సినిమాల నుండి పూర్తిగా తప్పకుంటానని ఆమె తెలిపింది. తనకు బిడ్డ పుట్టాక.. తన కోసమే పూర్తిగా సమయాన్ని కేటాయిస్తానని.. పూర్తిస్థాయిలో తల్లి ప్రేమను అందిస్తానని ఆమె చెప్పింది. తాను బాల్యంలో చాలా కష్టపడిందని.. అటువంటి కష్టాలు తన బిడ్డ పడకుండా... తనకు కావాల్సినవన్నీ సమకూరుస్తానని.. కంటిపాపలా కాపాడుకుంటానని ఆమె తెలిపింది. 

సమంత ఫిట్‌నెస్, సౌందర్యం వెనకున్న చిట్కాలేంటో.. మీకు తెలుసా?

కేరళలో పుట్టిన సమంత తండ్రి ఓ తెలుగు వ్యక్తి కాగా.. తల్లి మలయాళీ. కానీ ఆమె పెరిగింది మాత్రం తమిళనాడులోని పల్లవరం ప్రాంతంలో కావడం గమనార్హం. ఆమెకు మూడు భాషలలోనూ పట్టు ఉంది. మోడలింగ్ చేస్తున్న రోజులలో ప్రముఖ ఛాయాగ్రహకుడు రవివర్మన్ ఆమెను చూసి.. నటన రంగానికి పరిచయం చేశారు. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, అత్తారింటికి దారేది, ఈగ, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి చిత్రాలలో నటించిన సమంత.. అనతికాలంలోనే స్టార్ హీరోయన్ స్టేటస్ సంపాదించుకుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.