'సైరా' విజయాన్ని పురస్కరించుకొని.. 'తమన్నా'కు రామ్ చరణ్ అందించిన అద్భుత కానుక ఇదే..!

'సైరా' విజయాన్ని పురస్కరించుకొని..  'తమన్నా'కు రామ్ చరణ్ అందించిన అద్భుత కానుక ఇదే..!

(Tamannaah gets Crystal Ring as Surprise Gift from Ramcharan)

'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో కథానాయకుడి ప్రేయసిగా.. ప్రజలలో స్వాతంత్య్ర అభిలాషను పెంపొందించే నర్తకిగా విభిన్నమైన పాత్రలో.. ప్రముఖ నటి తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాత్రకు హీరోతో సరిసమానంగా.. ప్రశంసలు దక్కడం విశేషం. ఆ చిత్ర విజయంలో ఆమెది కూడా ప్రధాన పాత్రే అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం 'సైరా' చిత్రానికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికే వసూళ్లలో రూ.100 కోట్ల మార్కుకి చేరువవుతోంది.

ఇక ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకొని.. 'సైరా' నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తమన్నాకి ఒక చిత్రమైన బహుమతిని ప్రజెంట్ చేశారు. ఆ విషయాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. రామ్ చరణ్ తమన్నాకు కానుకగా ఇచ్చిన.. క్రిస్టల్ రింగ్ ఫోటోని ఆమె షేర్ చేశారు. 'శ్రీ 'చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. ఆ తర్వాత హ్యపీ డేస్, 100 %  లవ్, బద్రినాథ్, రచ్చ, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, ఊపిరి లాంటి చిత్రాలలో నటించింది.

పవర్ ఫుల్‌గా సాగిన.. "సైరా నరసింహారెడ్డి" టైటిల్ సాంగ్ లిరిక్స్..!

తర్వాత 'బాహుబలి' చిత్రం ద్వారా తమన్నా.. దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అందులోని అవంతిక పాత్ర ఆమెకు మరింత పేరు తెచ్చింది. అలాగే "ఎఫ్ 2" చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించిన ఆమె.. ఇల్లాలి పాత్రలో కూడా అందరినీ అలరించింది. ప్రస్తుతం 'సైరా' చిత్రంలోని లక్ష్మీ పాత్రకు కూడా ఆమె ప్రేక్షకుల నుండి కితాబునందుకుంది. ఇప్పుడు తమన్నా చేతిలో అయిదు చిత్రాలు ఉన్నాయి. పెట్రోమ్యాక్స్, యాక్షన్, దటీజ్ మహాలక్ష్మి చిత్రాలతో పాటు.. ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. 

'సైరా' చిత్రంలో.. 'సై.. సైరా' అనిపించే 9 అంశాలివే

అలాగే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో.. మహేష్ బాబు సరసన ఓ ప్రత్యేక గీతంలో కూడా కనువిందు చేయనుంది తమన్నా. నవాజుద్దీన్ సిద్ధీఖీ సరసన "బోలే చూడియా" అనే హిందీ చిత్రంలో కూడా తమన్నా నటించడం విశేషం. అంతకు ముందే ఆమె హిమ్మత్ వాలా, హమ్ షకల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, తుతక్ తుతక్ తుతియా, కామోషీ లాంటి హిందీ చిత్రాలలో నటించింది. చిత్రమేంటంటే.. ఆమె 15 ఏళ్ల వయసులో నటించిన తొలి చిత్రం కూడా హిందీ సినిమానే కావడం విశేషం.

"సైరా" టీజర్‌లో .. టాప్ 10 ఆసక్తికర విశేషాలు ఇవే..!

తమన్నా నటించిన తొలి చిత్రం "చాంద్ సా రోషన్ చెహరా". ఈ చిత్రం 2005లో విడుదలైంది. అయితే తమన్నా 8 సార్లు ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి నామినేషన్ పొందినా.. ఒక్కసారి కూడా అవార్డును పొందకపోవడం గమనార్హం. అయితే "కండేన్ కాదలై" చిత్రానికి మాత్రం ఉత్తమ నటిగా సౌత్ స్కోప్ అవార్డును కైవసం చేసుకుంది. అలాగే 100 % లవ్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును గెలుపొందింది. అలాగే తడాఖా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి (క్రిటిక్స్) పురస్కారాన్ని సైమా నుండి పొందింది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.