ఉపాసన హోస్ట్ అవతారమెత్తి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందంటే..

ఉపాసన హోస్ట్ అవతారమెత్తి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందంటే..

ఉపాసన కామినేని (Upasana kamineni).. కేవలం స్టార్ వైఫ్ గానే కాదు.. అపోలో ఫౌండేషన్ ఎండీగా తన బాధ్యతలను అద్భుతంగా నిర్విర్తిస్తోందీ యంగ్ బిజినెస్ వుమన్. అపోలో ఆధ్వర్యంలో కొనసాగే బీ పాజిటివ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్‌కి చీఫ్ ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.


ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఉపాసన తన లైఫ్ స్టైల్ మార్చుకోవడంతో పాటు డైటింగ్, వ్యాయామాలతో తన బరువు తగ్గించుకుంది. అప్పటి నుంచి ఇతరులు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ బరువు తగ్గడానికి వ్యాయామాలు, డైట్ రెసిపీలు వంటివి పంచుకుంటూ.. బరువు పెరగకుండా ఉండేందుకు.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చిట్కాలు అందిస్తూ ఉంటుంది.


ఇప్పుడు మరో అవతారం ఎత్తి కేవలం వంటల వీడియోలు, వ్యాయామానికి సంబంధించిన వీడియోలు మాత్రమే కాకుండా ఇతర సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి ఫిట్ నెస్ సీక్రెట్లను కూడా అభిమానులకు అందించే ప్రయత్నం చేస్తోందట ఉపాసన. తన ఆధ్వర్యంలో సాగే బీ పాజిటివ్ మ్యాగజైన్ కవర్ కోసం షూట్‌లో పాల్గొన్న సమంతను (Samantha) ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ఓ టీజర్ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇంతకుముందు ఈ మ్యాగజైన్ కవర్ పై హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్‌, కత్రినా కైఫ్‌, రామ్‌ చరణ్‌, షాహిద్‌ కపూర్‌, అలియా భట్‌, కృతి సనన్‌ వంటి వాళ్లందరూ కనిపించారు. తమ ఫిట్ నెస్ గురించి పంచుకున్నారు. ఏప్రిల్ మ్యాగజైన్ కోసం సమంత ఈ షూట్‌లో పాల్గొంది.


సమంతతో ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించడం గురించి ఉపాసన చెబుతూ 'ఇలా ఇంటర్వ్యూలు చేయడం నాకు చాలా కొత్త. అలా మాట్లాడాలంటే నాకు భయమేసింది. అందుకే సమంతతో ఈ ఇంటర్వ్యూలను ప్రారంభిస్తున్నా. తనైతే నాకు చాలా క్లోజ్. మా ఇంట్లో మనిషిలా కలిసిపోతుంది. నాకు మంచి స్నేహితురాలు.. తనతో క్యాజువల్‌గా మాట్లాడేయచ్చు. అందుకే తనని ఎంచుకున్నా' అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాదు.. సమంత W ఇంటర్వ్యూలో 'నా గురించి కేర్ తీసుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. నువ్వు సూపర్.. నేను నీ ఇన్ స్టాగ్రామ్ ఎప్పుడూ చూస్తుంటా. నీ వీడియోలు చూస్తేనే ఫిట్‌గా అయిపోతే బాగుండు అనిపిస్తుంది' అని తెలపడం గమనార్హం. 


ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంటూ స్వీటెస్ట్, స్ట్రాంగెస్ట్ సమంత తన ఫిట్ నెస్ సీక్రెట్లను పంచుకుంది. అవి చదవాలంటే స్టాండ్స్‌లో ఉన్న బీ పాజిటివ్ మ్యాగజైన్ చదవండి అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు.. టాలీవుడ్ బెస్ట్ కోడలి అవార్డును కూడా ఆమెకు అంకితమిచ్చింది.

ఉపాసన విడుదల చేసిన ఈ వీడియో టీజర్‌లో భాగంగా ఉపాసన, సమంతలిద్దరూ ఒకరి ఇన్ స్టాగ్రామ్ మరొకరు తరచూ చూస్తుంటాం అని చెప్పడం విశేషం. అంతేకాదు.. సమంతను మొదట ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం చెబుతూ నువ్వైతే నేను కంగారు పడినా నన్ను రిలాక్స్ చేస్తావు. అందుకే నీతో ఇంటర్వ్యూ చేశా అని చెప్పింది. అంతేకాదు.. ఫిట్ నెస్‌కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ 'ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం సరైనదా లేదా ?' అని ఉపాసన అడగ్గా.. 'లేదు.. నేను చాలా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేస్తాను. బరువులు ఎత్తుతాను. అందుకే ఖాళీ కడుపుతో ఇవన్నీ చేయను' అని సమంత సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున, చైతన్య, సమంత ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ ఫిట్గా ఉంటారని ఉపాసన ప్రశ్నించింది. దీనికి సమంత చెప్పిన సమాధానాన్ని మాత్రం ఈ వీడియోలో చూపించకపోవడం విశేషం.


కుటుంబం ఇమేజ్తో, తన భర్త స్టార్డమ్‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది ఉపాసన. అటు అపోలో ఫౌండేషన్ బాధ్యతలు చూడడంతో పాటు.. ఇటు వీడియోలు చేస్తూ అందరికీ దగ్గరవుతోంది. ఆమె చేసే ఫిట్ నెస్ వీడియోలు చూస్తూ ఎంతో మంది ఫిట్‌గా ఉండేందుకు స్ఫూర్తిని పొందుతున్నారు. కేవలం ట్రైలర్ మాత్రమే విడుదలైన ఈ వీడియో కోసం.. ఎంతో మంది వేచి చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాలా? 


ఇవి కూడా చ‌ద‌వండి.


మంచుకొండ‌ల్లో మెగాస్టార్ హాలిడే.. విరామాన్ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి దంపతులు..!


ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెరగాలంటే.. ఇలా ప్ర‌య‌త్నించి చూడండి.. !


#POPxoWomenWantMore ఉపాస‌న స్టార్‌ వైఫ్ మాత్ర‌మే కాదు.. గొప్ప సేవామూర్తి కూడా..!