ADVERTISEMENT
home / వినోదం
వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ట్రైలర్.. నిజంగానే అదిరిపోయింది ..!

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ట్రైలర్.. నిజంగానే అదిరిపోయింది ..!

వరుణ్ తేజ్ – చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో  ప్రేక్షకులను ప్రభావితం చేయగల మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మెగా కాంపౌండ్ నుండి తెరంగేట్రం చేసిన హీరోగా కేవలం మాస్ సినిమాలకే పరిమితం కాకుండా.. అభినయ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ‘కంచె’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో పాటు.. ఫిదా, తొలి ప్రేమ లాంటి హిట్ చిత్రాలతో కూడా విజయాలు సాధిస్తూ  దూసుకుపోతున్నాడు.

ఇక తాజాగా వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం అదిరిపోయే మేకోవర్‌తో మన ముందుకి వచ్చిన వరుణ్ తేజ్, వాల్మీకి (Valmiki) ట్రైలర్‌‌తో తన సత్తా ఏంటన్నది చూపెట్టాడు. ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ అనే రౌడీ షీటర్ పాత్రలో.. ప్రతినాయకుడి లక్షణాలతో ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్నాడు వరుణ్ తేజ్.

సైకిల్ పైన “శ్రీదేవి”గా.. ఫ్యాన్స్ హృదయాలని కొల్లగొట్టేస్తున్న ‘వాల్మీకి’ పూజ హెగ్డే ..!

వాల్మీకి చిత్రం విషయానికి వస్తే, 2014లో వచ్చిన జిగర్తాండ అనే తమిళ చిత్రానికి రీమేక్ ఇది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్ధార్థ, లక్ష్మి మీనన్, బాబీ సింహాలు నటించారు. ఇదే సినిమాకి తెలుగు రీమేక్‌గా వస్తున్న వాల్మీకి చిత్రానికి.. హరీష్ శంకర్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక వాల్మీకి ట్రైలర్ చూస్తుంటే.. హరీష్ శంకర్ మార్క్ స్పష్టంగా తెలుస్తోంది. ఒక తమిళ చిత్రానికి రీమేక్ చిత్రమంటే నమ్మలేనంతగా మాటలు, యాక్షన్ విషయంలో పూర్తిగా శ్రద్ధ పెట్టి దర్శకుడు సినిమా తీశాడనిపిస్తుంది. 

ADVERTISEMENT

ఇక ట్రైలర్ ఎలా సాగిందంటే –

డాన్ పాత్రలో వరుణ్ తేజ్ (Varun Tej) అభినయం అదుర్స్. గద్దలకొండ గణేష్ అంటూ లుక్ పరంగానే కాకుండా.. డైలాగ్ డెలివరీతోనూ విలనిజాన్ని కూడా వరుణ్ అద్భుతంగా పండించాడనిపిస్తుంది.  అదే సమయంలో సినీ రంగంలోకి అడుగుపెట్టాలని భావించే ఓ యువకుని పాత్రలో తమిళ యువ నటుడు అథర్వ కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్స్‌గా మృణాళిని, పూజ హెగ్డేలు ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

ఈ ట్రైలర్ (Valmiki Trailer)  చూసాక వరుణ్ తేజ్ పాత్ర ప్రధానంగా.. ఈ చిత్రం నడుస్తుందని స్పష్టమవుతోంది. పైగా ఆ పాత్ర చెప్పే డైలాగ్స్ అత్యద్భుతంగా పేలాయి. అసలే మంచి పంచ్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. అటువంటిది ఆయన పెన్నుకి.. మంచి పని చెప్పే పాత్ర దొరికితే ఆయన తన విశ్వరూపాన్ని కచ్చితంగా చూపెడతాడు. అదే ఈ ట్రైలర్‌లో కూడా కనిపించింది.

నాగార్జున కొత్త టాటూ చూసారా? ఆ టాటూ ప్రత్యేకత ఏమిటి?

ఈ ట్రైలర్‌లో (Trailer) ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చిన డైలాగ్స్ మీకోసం –

ADVERTISEMENT

* నా పైన పందేలేస్తే గెలుస్తరు… అదే నా తోటి పందాలేస్తే సస్తరు.

* మనం బతుకుతున్నమని పదిమందికి తెల్వక పోతే.. ఇగ బతుకుడేందుకురా!!

* ఉత్త గీతలే మన చేతిలుంటయి… రాతలు మన చేతిలుండై..

* గవాస్కర్ సిక్స్ కొట్టుడు… బప్పిలహరి పాట గొట్టుడు.. నేను బొక్కలిరగొట్టుడు… సేమ్ టు సేమ్.. అదే ప్యాషన్

ADVERTISEMENT

* గద్దలకొండ గణేష్ అంటే… గజ గజ గజ వణకాలే…

ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌లో ఇన్ని మనకి వినిపిస్తుంటే… సినిమా చూస్తే ఇంకెన్ని కనిపిస్తాయో మనం ఊహించగలం. ఇక తమిళంలో రిలీజ్ అయినప్పుడు.. చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు ఈ వాల్మీకి ట్రైలర్ చూస్తుంటే కూడా.. అందులో హిట్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకం పైన రామ్, గోపీచంద్ ఆచంటలు నిర్మించడం జరిగింది. మిక్కీ కె మేయర్ బాణీలు సమకూర్చగా.. అయాంక్ బోస్ ఛాయాగ్రహణం అందించారు.

చివరగా ఈ ట్రైలర్‌లో.. గత్తరలేపినవ్ … చింపేసినవ్ పో.. అనే డైలాగ్‌‌‌తో ముగించాడు దర్శకుడు హరీష్ శంకర్.

కొసమెరుపు – మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో – ‘ఐ యామ్ నాట్ డన్ ఎట్’ అనే డైలాగ్‌కి స్పూఫ్‌గా.. బ్రహ్మాజీ చేత  ఓ డైలాగ్ చెప్పించడం అందరి చేత నవ్వులు పూయించింది.

ADVERTISEMENT

కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

09 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT