నాగార్జున కొత్త టాటూ చూసారా? ఆ టాటూ ప్రత్యేకత ఏమిటి?

నాగార్జున కొత్త టాటూ చూసారా? ఆ టాటూ ప్రత్యేకత ఏమిటి?

మన్మథుడు అలియాస్ కింగ్ నాగార్జున ఏది చేసినా సరే.. అందులో కాస్త వైవిధ్యం ఉంటుంది. అలాగే ఆకర్షించేదిగా కూడా ఉంటుంది. తాజాగా ఆయన తన ఎడమ చేతి పైన వేసుకున్న ఒక టాటూ.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ టాటూ గురించిన ప్రస్తావనను.. నిన్న జరిగిన బిగ్ బాస్ షోలో (Bigg Boss) ముఖ్య అతిథిగా వచ్చిన నాని తీసుకువచ్చారు. దానితో ఆ టాటూ (Tattoo) నాగ్ ఎప్పుడు వేయించుకున్నారు ? ఎందుకు వేయించుకున్నారు? ఆ టాటూ డిజైన్ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? లాంటి ప్రశ్నలకి ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పారో.. ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం.

60వ బర్త్‌డే స్పెషల్: కింగ్ & బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గురించిన ఆసక్తికర విషయాలు..!

ముందుగా ఆ టాటూ గురించి నాగార్జున ఏం చెప్పారంటే -

Nagarjuna Tattoo

"అందులో మనకి కనిపిస్తున్న నాగు పాము నా పేరు నాగార్జునకి (Nagarjuna) సరిపోతుంది. కంపాస్ కనిపిస్తుంది కదా, అది ట్రూ నార్త్ కంపాస్ (True North Compass). ఆ కంపాస్ మధ్యలో ఉన్న కంటిని - 'థర్డ్ ఐ' గా చెబుతాము. ఆ కంపాస్ & ఈ 'ఐ' కి అర్ధమేంటంటే - జీవితంలో ఎప్పుడు కొత్తదనం లేదా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం. అలాగే టాటూ పైన కనిపిస్తున్న 'N' అనే అక్షరం నా పేరు లేదా ట్రూ నార్త్ అయినా కావచ్చు. అలాగే పాము చుట్టూ ఉన్న వాటికి అర్థం ఏంటంటే- పాము ఎలాగైతే కుబుసం విడిచేస్తుందో.. అలాగే నేను కూడా గతాన్ని విడిచిపెట్టేసి.. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగుతుంటాను" అని వివరణ ఇచ్చారు నాగ్. 

ఇక ఈ టాటూని వేయించుకోవడానికి గల కారణం కూడా తెలిపారు నాగ్. మొన్న జరిగిన తన పుట్టినరోజుకి కానుకగా తనకి తాను ఇచ్చుకున్న గిఫ్ట్.. ఈ టాటూ అని చెప్పారు ఆయన. ఈ సందర్భంగా ఆయన తనకు కేవలం 30 సంవత్సరాలే అంటూ చెప్పి.. అందరిని నవ్వించడం జరిగింది. అదే సమయంలో దానికి కౌంటర్‌గా "మీకు 29 సంవత్సరాలే కదా" అంటూ హీరో నాని సైతం కొంటెగా నాగ్‌ని ఆటపట్టించడం విశేషం.

అలాగే ఈ టాటూని వేసే సమయంలో తీసిన వీడియోని కూడా నాగ్..  బిగ్ బాస్ ఇంటి సభ్యులతో పాటుగా వీక్షకులకు సైతం చూపించారు.  ఈ టాటూ వేసింది ప్రపంచ ప్రఖ్యాత టాటూ ఆర్టిస్ట్ సావియో డిసిల్వా. అతని టాటూస్ చాలా ఫేమస్. అతన్ని పర్సనల్‌గా సంప్రదించడానికి.. తన ఇన్‌స్టాగ్రామ్ వివరాలను కూడా  నాగ్ తెలియజేశారు. మొత్తానికి నాగార్జున ఏది చేసినా.. అందులో కొత్తదనం ఉండాలని కోరుకుంటారు కదా. అందుకే ఆయన తన మనస్తత్వానికి తగిన టాటూని కూడా వేయించుకున్నారు అనుకోవచ్చు.

Bigg Boss Telugu 3 : కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ

మరొక విషయం ఏమిటంటే.. దాదాపు మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఈ టాటూ సంస్కృతిని పరిచయం చేసింది నాగ్ అని చెప్పాలి.  మన్మథుడు చిత్రం విడుదలైన సమయంలో.. నాగార్జున తన కుడి భుజం పై ఓంకారం ఆకారంలో ఉన్న ఓ టాటూని వేయించుకున్నారు. అప్పట్లో అది టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది. ఎందుకంటే ఆ సమయంలో టాటూ సంస్కృతి చిత్రపరిశ్రమలో లేదు. హిందీ చిత్రపరిశ్రమలో ఉన్నప్పటికి కూడా అది ఇంకా టాలీవుడ్‌లో మొదలవ్వలేదు.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ మొదలయ్యాక తన ఎడమ చేతి మణికట్టు దగ్గర.. బిగ్ బాస్ లోగోని కూడా టాటూ‌గా వేసుకుంటున్నారు. అయితే అది పర్మనెంట్ టాటూ కాదు. ఈ ప్రోగ్రాం హోస్ట్ చేయడానికి వేసుకున్న టెంపరరీ టాటూ మాత్రమే.

ఏదైనా ఒక కొత్త ట్రెండ్‌ని సినిమాలు లేదా లైఫ్ స్టైల్‌లో ఫాలో అవ్వడం కేవలం..  కింగ్ నాగార్జునకే చెల్లిందని అనుకోవచ్చు. అవును మరి.. ఆయన విలక్షణత వల్లే.. 60వ వడిలోకి వచ్చాక కూడా నవ మన్మథుడిగానే కొనసాగుతున్నారు.  ఆయన జీవితం మనకి 'వయసు కేవలం శరీరానికి తప్ప.. మనసుకి కాదు' అనే ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది.

"మన్మథుడు" మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ)