వారిద్దరూ ప్రస్తుతం సౌతిండియాలోనే కాదు.. దేశమంతా ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న పాపులర్ యువ కెరటాలు. అందం, అద్భుతమైన నటన, చిలిపితనం వంటివన్నీ తెరపై చూపుతూ అభిమానుల మనసు దోచేసి వారి ఫేవరెట్‌గా మారిపోయారు. వాళ్లే విజయ్ దేవర కొండ (Vijay devarakonda), సాయిపల్లవి (Sai pallavi)లు.. ఒకరు ఆంధ్రప్రదేశ్‌లో పుడితే మరొకరు కేరళలో పుట్టారు.
కానీ తమ సినిమాలతో అభిమానుల మనసు కొల్లగొట్టారు.. “భానుమతి ఒక్కటే పీస్..” అన్న డైలాగ్‌తో అబ్బాయిల గుండెల్లో సాయిపల్లవి బాణాలు గుచ్చితే.. “అది నా పిల్ల..” అంటూ ప్రతి అబ్బాయి, అమ్మాయిని తన క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యేలా చేశాడు విజయ్. ఈ ఇద్దరూ ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేనివారే. కానీ సినీ రంగంలోకి వచ్చి తామేంటో నిరూపించుకున్నారు. తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే తమ నటనతో రౌడీలమని నిరూపించారు ఈ మాస్ హీరో, హీరోయిన్‌లు. రౌడీ బేబీ పాటతో సాయిపల్లవి ఫేమస్ అయిపోతే.. అర్జున్‌రెడ్డితో అందలమెక్కిన విజయ్ రౌడీ బ్రాండ్‌తో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఎంతగా అంటే వారి అభిమానులు తామే “రౌడీ బేబీ లేదా రౌడీస్” అని పిలుచుకునేంతగా వీరికి కనెక్ట్ అయిపోయారు. ఈ ఇద్దరు రౌడీస్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వారి జీవితానికి సంబంధించి మీకు తెలియని కొన్ని విశేషాలు.. మీరు ఇప్పటివరకూ చూసి ఉండని వారి ఫొటోలు మీకోసం..
తమిళనాడులో పుట్టి, కోయంబత్తూరులో పెరిగిన సాయి పల్లవికి ఓ ట్విన్ సిస్టర్ కూడా ఉంది. తన పేరు పూజ.
ఆమె తండ్రి సెంథమలై కన్నన్ పోలీస్ ఆఫీసర్. అమ్మ రాధ. ఆమెకు నాట్యం అంటే ఎంతో ఇష్టమట.
నాట్యం నేర్చుకొని తల్లిలా మారాలని తానే సొంతంగా ఐశ్వర్యా రాయ్, మాధురీ డ్యాన్స్ చూసి నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలిచ్చింది సాయిపల్లవి. ఈటీవీ ఢీ కార్యక్రమంలోనూ పాల్గొంది.
అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్‌ని అయ్యాను అంటుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం నిజంగానే డాక్టర్. జార్జియాలోని టిబిల్లిసీ స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసిందామె.
చిన్నతనంలోనే పల్లవి, ఆమె సోదరి పూజ సినిమాల్లో నటించారు. సాయి పల్లవి మొదటి చిత్రం “కస్తూరి మాన్” అనే తమిళ సినిమా. హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో కంగన స్నేహితురాలిగా కూడా నటించిందీ సుందరి. కానీ మలయాళంలో ప్రేమమ్ సినిమాతో తనకు స్టార్ డమ్ దక్కింది.
సాయి పల్లవి బడగ అనే తెగకు చెందిన అమ్మాయి. లిపి కూడా లేని ఆ భాషను మాట్లాడే కుటుంబాల్లో ఇంతటి స్టార్ డమ్ పొందిన అమ్మాయి పల్లవి ఒక్కరే.
సాధారణంగా తన జుట్టు కత్తిరించుకోవడం, మేకప్ వంటివి ఆమెకు నచ్చవట. కానీ కొన్నిసార్లు మాత్రం మేకప్ వేసుకుంటుందీ బ్యూటీ.
ఇక మన రౌడీ హీరో అర్జున్ రెడ్డి.. అదేనండీ.. మన విజయ్ దేవరకొండ గురించి చూస్తే..
విజయ్‌కి వెండితెరతో పరిచయం లేకపోయినా.. బుల్లితెరతో మాత్రం సంబంధం ఉంది. తన తండ్రి దేవరకొండ గోవర్థన్ రావు బుల్లితెర డైరెక్టర్. విజయ్‌కి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. తన పేరు ఆనంద్.
చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తట విజయ్‌కి. ఎంతగా అంటే నాలుగో క్లాస్‌లోనే స్క్రిప్టులు, కథలు రాసేవాడట. మేడం మీరేనా? అనే షార్ట్ ఫిల్మ్‌ని కేవలం ఐదు గంటల్లో డైరెక్ట్ చేశాడట విజయ్.
నటన అంటే ఆసక్తితో థియేటర్ గ్రూప్‌లో కూడా పనిచేశాడు. “నువ్విలా” సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో తెరంగేట్రం చేసినా.. “పెళ్లి చూపులు” సినిమాతో మంచి పేరు సాధించాడు విజయ్.
నటనే కాదు.. సేవలోనూ ముందుంటాడు మన రౌడీ. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం మూడు ఐస్ క్రీం ట్రక్స్ పంపి వారిని ఎండ నుంచి కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇలాంటివి చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయండోయ్..
రౌడీ అనే క్లాతింగ్ బ్రాండ్‌ని ప్రారంభించాడు విజయ్. ఈ ఆలోచన తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు వచ్చిందట. తన రౌడీ బ్రాండ్ కోసం రౌడీ ఆంథంని కూడా తయారుచేసిన విజయ్ దాన్ని తనే పాడాడు. అదే కాదు.. గీత గోవిందంలో “వాట్ ద వాట్ ద” పాటను తనే పాడాడు. చిన్నతనంలో సింగర్ కావాలనుకున్నా అని.. ఆ కలను ఇలా తీర్చుకున్నా అని చెబుతాడీ హీరో.
ఇవి కూడా చదవండి
నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య
పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!