ADVERTISEMENT
home / వినోదం
అయిదు భాషలలో తెరకెక్కుతున్న.. ‘విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్’ చిత్రం

అయిదు భాషలలో తెరకెక్కుతున్న.. ‘విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్’ చిత్రం

విజయ్ దేవరకొండ (vijay deverakonda) -ఈ రౌడీ స్టార్‌కి ఒక్క తెలుగు నాటనే కాకుండా.. బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా ఒక క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రదర్శించిన అసాధారణ నటనతో తను ఎంతో పేరు తెచ్చుకున్నాడు . ఇక విజయ్ హిందీలో తెరంగేట్రం చేస్తాడనే వార్త ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. కరణ్ జోహార్ నిర్మించే ఓ చిత్రంలో తను నటిస్తాడనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. 

దేశాన్నే అబ్బురపరిచిన.. హైదరాబాదీ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ : ఈ టాప్ 5 విశేషాలు మీకోసం

అయితే ఈ వార్తలకి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే అటు విజయ్ లేదా ఇటు కరణ్ జోహార్ కూడా దీనిపై స్పందించలేదు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (puri jagannadh).. విజయ్ దేవరకొండ కాంబినేషనులో ఒక చిత్రం తెరకెక్కుతుందని ఇటీవలే ఓ ప్రకటన వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు ఉదయం ఎటువంటి హడావుడి లేకుండా.. ఈ సినిమా ప్రారంభోత్సవం జరగడం విశేషం. దీనికి సంబంధించి ముహూర్త కార్యక్రమాలు జరగడంతో పాటు.. తొలి షెడ్యూల్  షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది.

మరొక విశేషమేమిటంటే.. విజయ్ – పూరిల చిత్రం ద్వారానే రౌడీ స్టార్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని కరణ జోహార్ స్వయంగా (karan johar) తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానరుపై సమర్పించడం ద్వారా.. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరిగా మారిపోయారు. ఇక ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా విడుదల అవుతుందని టాక్. అలాగే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఛార్మి కౌర్ (charmme kaur) ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ADVERTISEMENT

మొత్తానికి విజయ్ దేవరకొండ హిందీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న వారికి.. ఈ చిత్రం ద్వారా సమాధానం చెప్పేశాడు రౌడీ స్టార్. అలాగే దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా ‘బుడ్డా హోగా తేరా బాప్’ అంటూ అమితాబ్ బచ్చన్‌తో హిందీలో ఒక చిత్రం తీసిన చాలా సంవత్సరాల తరువాత.. మరలా ఇప్పుడు బాలీవుడ్‌లో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

నన్ను ఒక వేశ్యగా చూసారు : తన మనసులోని బాధను బయటపెట్టిన నటి కల్కి కొచ్లిన్

అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక ఫైటర్ పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకే ఈ చిత్రానికి తొలుత ‘ఫైటర్’ అని టైటిల్ అనుకున్నప్పటికి.. ఆ  తర్వాత కొన్ని కారణాల వల్ల.. వేరే టైటిల్ కోసం చిత్ర బృందం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ చిత్రంలో పాత్ర కోసం విజయ్ తన శరీరాన్ని ఒక ఫైటర్ మాదిరిగా సిద్ధం చేసేందుకు థాయిలాండ్ వెళ్లి మరి.. అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం విశేషం.

ప్రస్తుతానికి ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ (ramya krishna), రోనిత్ రాయ్ కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

ADVERTISEMENT

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి.. మంచి ఊపుమీదున్న పూరి జగన్నాధ్.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో మరొక మంచి బ్లాక్ బస్టర్ ఇస్తాడా? లేదా అనేది వేచి చూడాలి. అలాగే విజయ్ హిందీలోకి అడుగుపెట్టి ఈ చిత్రం ద్వారా హిట్ కొడతాడా లేదా..? అన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది.

‘పవర్ యోగా’తో.. మనకు కలిగే ప్రయోజనాలెన్నో ..!                    

 

20 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT