ADVERTISEMENT
home / Celebrations
“మాతృభూమికి స్వాగ‌తం”.. వింగ్ కమాండర్ అభినందన్‌‌ పై ప్రశంసల వెల్లువ..!

“మాతృభూమికి స్వాగ‌తం”.. వింగ్ కమాండర్ అభినందన్‌‌ పై ప్రశంసల వెల్లువ..!

అభినంద‌న్ వ‌ర్థ‌మాన్‌.. (Abhinandan) రెండు రోజుల నుంచి ఈ పేరు దేశ‌మంతా మార్మోగిపోయింది. పాకిస్థాన్‌కి చెందిన ఎఫ్‌16 ఫైట‌ర్ జెట్‌ని మ‌న మిగ్‌ 21 పేల్చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ దాడిలో భార‌త వింగ్ కమాండ‌ర్ అభినందన్‌‌ పాకిస్థాన్ భూమిపై ప‌డిపోయాడు. శత్రు దేశంలో ఉన్నా.. ఏమాత్రం భ‌య‌ప‌డ‌ని అత‌డి ధైర్యానికి పాకిస్థాన్ మీడియా వంద‌నం చేసింది. అభినంద‌న్ గురించి ప్ర‌త్యేక క‌థనాలు రాసింది. యుద్ధ‌విమానం గాలిలో పేలిపోయి ప్యారాచూట్ సాయంతో పాకిస్థాన్‌లో దిగిన అభినంద‌న్ అక్క‌డి స్థానికుల‌ను “ఇది ఏ దేశం” అని అడిగాడ‌ట‌.

అందులో ఓ తుంట‌రి “ఇది ఇండియా” అని చెప్పినా న‌మ్మ‌కుండా “జై భార‌త్” అంటూ నినాదాలు చేశాడ‌ట‌. దానికి వారు తిరిగి నినాదాలు చేయ‌కుండా కోపంతో “ఇది పాకిస్థాన్” అని చెప్పార‌ట‌. అలాగే వారు అత‌డిని కొట్టేందుకు ముందుకు రావ‌డంతో త‌న ద‌గ్గ‌ర ఉన్న గ‌న్‌తో గాల్లో కాల్పులు జ‌రిపి వారిని భ‌య‌పెట్టాడ‌ట అభినంద‌న్‌. శ‌త్రుదేశంలో ఉన్నా.. ఆ దేశానికి చెందిన‌వారినే భ‌యంతో ప‌రుగులు పెట్టేలా చేసిన వీరుడు త‌ను.

ఆపై త‌న ద‌గ్గ‌ర ఉన్న ర‌క్ష‌ణ ర‌హ‌స్యాల‌ను నాశ‌నం చేసేందుకు మ‌ధ్య‌లో ఓ చెరువు క‌నిపిస్తే అందులో దూకి త‌న జేబులో ఉన్న మ్యాప్‌తో పాటు ఇత‌ర పేప‌ర్ల‌ను మింగేశాడ‌ట‌.ఆపై మిలిట‌రీకి దొరికి దెబ్బ‌లు తిన్నా.. శత్రుసైన్యం త‌న‌ని ఎన్ని య‌క్ష‌ప్ర‌శ్న‌లు వేసినా.. త‌ను ఏవి చెప్పాలో అవి మాత్ర‌మే చెప్పాడు కానీ వారికి భ‌య‌ప‌డ‌లేదు. వారు అడిగిన పలు ప్ర‌శ్న‌ల‌కు “నేను ఈ అంశాలపై మాట్లాడకూడదు” అని ధైర్యంగా స‌మాధాన‌మిచ్చాడు అభినంద‌న్‌.

ఇలాంటి ధైర్య‌శాలి నేడు త‌న మాతృభూమికి తిరిగొస్తుంటే పూర్తి దేశం పుల‌కించిపోయింది. త‌మ బిడ్డే.. త‌మ ఇంట్లోని వ్య‌క్తే తిరిగి వ‌స్తున్న‌ట్లు ఆనందం వ్య‌క్తం చేసింది. #WelcomeHomeAbhinandan హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ట‌ర్ నిండిపోయింది. మ‌రి, అభినంద‌న్ భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్టిన ఆనందాన్ని (celebrities) సెల‌బ్రిటీలు ఎవరెవరు ఎలా పంచుకున్నారో చూద్దాం రండి..

ADVERTISEMENT

 

1. టాలీవుడ్ బ్యూటీ త‌మ‌న్నా అభినంద‌న్‌కి వెల్‌కం చెబుతూ “అభినంద‌న్.. నీ ఓపిక‌, స‌హ‌నానికి మా సెల్యూట్‌. శ‌త్రుదేశంలో రెండు రోజులు ఉన్నా.. నువ్వు ఎంతో ధైర్యంగా నిల‌బ‌డ్డావు.. వెల్‌కం హోం అభినంద‌న్” అంటూ ట్వీట్ చేసింది.

2. మ‌రో బ్యూటీ రాశీ ఖ‌న్నా.. “నా గుండె గ‌ర్వంతో పొంగిపోతోంది. నీ ధైర్య‌సాహ‌సాలు ప్ర‌శంస‌నీయం. మేమంతా నిన్ను చూసి ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాం” అని ట్వీట్ చేసింది.

3. టాలీవుడ్ అందాల న‌టి కాజ‌ల్ “మీరు వెయ్యేళ్లు బ‌త‌కాలి.. సెల్యూట్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌. మ‌న త్రివిధ ద‌ళాల‌కు నా సెల్యూట్‌.. అభినంద‌న్‌కి నా సెల్యూట్” అంటూ ట్వీట్ చేసి త‌న ఫీలింగ్‌ని పంచుకుంది.

ADVERTISEMENT

4. టెన్నిస్ తార సానియా ట్వీట్ చూస్తూ.. “వెల్‌కం బ్యాక్ వింగ్ కమాండ‌ర్ అభినంద‌న్‌. మీరు నిజ‌మైన హీరో. దేశ‌మంతా మీరు చూపించిన ధైర్యం, ప‌రిణ‌తికి సెల్యూట్ చేస్తుంది. జైహింద్” అంటూ త‌న ఆనందాన్ని పంచుకుంది.

5. “రాజకీయ నాయ‌కులు ఎన్ని రాజకీయాలైనా చేయ‌నీ. మీడియా అంద‌రికీ వినిపించేలా అర‌వ‌నీ.. కానీ సామాన్య ప్ర‌జ‌లుగా మ‌నంద‌రం క‌లిసి మ‌న హీరోకి వెల్‌కం చెబుదాం” అంటూ అభినంద‌న్ గురించి తాను రాసిన ఓ క‌విత‌ను పంచుకున్నారు ప్ర‌కాశ్ రాజ్‌.

6. అభినంద‌న్‌కి స్వాగ‌తం ప‌లుకుతూ వ‌రుస ట్వీట్లు చేసింది న‌టి ప్రీతి జింతా. “ఇక్క‌డ అమెరికాలో ప్ర‌జలంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 65 సంవ‌త్స‌రాల క్రితం ర‌ష్యా త‌యారుచేసిన మిగ్ 21.. తాజా సాంకేతిక ప్ర‌మాణాల‌తో త‌యారైన ఎఫ్ 16ని నేల‌కూల్చింద‌ని విని వారు పైల‌ట్‌ని అభినందిస్తున్నారు. ఇది మ‌న శిక్ష‌ణ గురించి చెబుతుంది. ఉత్త‌మ విమానం అంటే సాంకేతిక‌త ఎక్కువ ఉన్న‌ది కాదు.. అందులో బెస్ట్ పైల‌ట్ ఉంటే త‌క్కువ సాంకేతికత ఉన్నా అది శ‌త్రుసైన్యాన్ని నేల‌కూల్చుతుంది..” అని ఒక ట్వీట్ చేసిన ప్రీతి..

మ‌రో ట్వీట్‌లో “ఈ రాత్రి నాకు అస్స‌లు నిద్ర‌ప‌ట్ట‌లేదు. అభినంద‌న్ ఇంటికి తిరిగి రానున్నాడ‌న్న సంతోషం నాలో నిండిపోయింది. త‌న కుటుంబం ఇప్పుడు ఎలా ఫీల‌వుతుందో నాకు తెలుసు. ప్ర‌తి నిమిషం ఓ యుగంలాగా గ‌డుస్తుంది. ప్ర‌తివార్త గుండె వేగాన్ని పెంచుతుంది. అభినంద‌న్ నీ ధైర్య‌సాహ‌సాలకు నా జోహార్లు..” అంటూ తెలిపిందామె.

ADVERTISEMENT

7. క్రికెట‌ర్ వీవీఎస్ లక్ష్మ‌ణ్ ట్వీట్ చేస్తూ “దేశ‌మంతా మిమ్మ‌ల్ని చూసి గ‌ర్విస్తోంది. మీ నిస్వార్థ‌గుణానికి, ధైర్యసాహ‌సాల‌కు నా సెల్యూట్” అని ట్వీట్ చేశారు.

8. “మ‌న ఇంటికి తిరిగి రావ‌డం కంటే మంచి ఫీలింగ్ ప్ర‌పంచంలోనే ఏదీ ఉండ‌దు. ప్రేమ, న‌మ్మ‌కం నిండిన అలాంటి ఇంటికి నీకు స్వాగ‌తం. నీ ధైర్య‌సాహసాలు చూసి మేమెంతో ధైర్యం తెచ్చుకుంటున్నాం. నీకు కృత‌జ్ఞ‌త‌లు” అంటూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌.

9. బాలీవుడ్ బ్యూటీ ర‌వీనా ట్వీట్ చేస్తూ.. “మ‌న హీరో తిరిగి రావ‌డాన్ని చూసేందుకు టీవీ సెట్‌కి అతుక్కుపోయాను. అలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల్లోనూ నువ్వు ఎంతో ప్ర‌శాంతంగా, మ‌ర్యాద‌గా, ప్రొఫెష‌న‌ల్‌గా వ్య‌వ‌హ‌రించావు. ఇది నీ వ్య‌క్తిత్వం గురించి చెబుతోంది. నిన్ను చూసి ఎంతో గ‌ర్విస్తున్నా. వెల్‌కం బ్యాక్ వింగ్ కమాండ‌ర్” అంటూ ట్వీట్ చేసింది.

10. ఇక మ‌రో బాలీవుడ్ హీరో వరుణ్ ధావ‌న్ “వెల్ కం బ్యాక్.. నువ్వు నిజ‌మైన హీరోవి. నువ్వు తిరిగి రావ‌డం చూస్తుంటే మాన‌వ‌త్వం ఇంకా బ‌తికే ఉంద‌నిపిస్తోంది. భార‌త్ మాతా కీ  జై” అంటూ త‌న ఆనందాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నాడు.

ADVERTISEMENT

11. “నీ ధీర‌త్వానికి నా సెల్యూట్, వెల్‌కం బ్యాక్ అభినంద‌న్” అంటూ ట్వీట్ చేసింది హ‌న్సిక‌.

12. “వెల్‌కం బ్యాక్ మా హీరో.. వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్” అంటూ స్వాగతం ప‌లికింది సైనా.

13. “నీలాంటి వ్య‌క్తిని క‌లిగి ఉండ‌డం మా అదృష్టం. నీ నైపుణ్యాల‌కే కాదు.. ధైర్య‌సాహ‌సాల‌కు కూడా నా వంద‌నం. మేం నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం. నిన్ను చూసి గ‌ర్విస్తున్నాం” అంటూ ట్వీట్ చేశాడు సెహ్వాగ్‌.

ఇవి కూడా చ‌ద‌వండి.

ADVERTISEMENT

జయహో భారత్.. శభాష్ ఇండియ‌న్ హీరోస్ (సోషల్ మీడియాలో ఆనంద హేల)

ఈ దేశ‌భ‌క్తి పాట‌లు వింటే.. మిమ్మల్ని మీరే మైమ‌రచిపోతారు..!

“రిపబ్లిక్ డే” ప్రత్యేక కథనం: చరిత్రను తిరగరాసిన మన మహిళా దళాలు.. !

01 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT