ADVERTISEMENT
home / Health
స్మైల్ ప్లీజ్: అలా నవ్వుతూనే ఉండండి. మీ ఆరోగ్యం మెరుగవుతుంది.

స్మైల్ ప్లీజ్: అలా నవ్వుతూనే ఉండండి. మీ ఆరోగ్యం మెరుగవుతుంది.

‘నవ్వు నాలుగు విధాలా చేటు’ ఇది ఒకప్పటి మాట. ‘నవ్వు నలభై విధాల ఆరోగ్యం’ ఇది నేటి మాట. అందుకేనేమో ఇటీవలి కాలంలో లాఫింగ్ థెరపీకి చాలామంది అలవాటు పడుతున్నారు. అందరూ ఒకే చోటుకి చేరి గట్టిగా నవ్వుతూ.. నవ్వడం ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా పార్కుల్లో గుంపులు గుంపులుగా చేరి పగలబడి నవ్వుకొనేవారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి వారిని చూస్తే మనకు కూడా నవ్వు (laughter) రావడం ఖాయం. అప్పుడప్పుడూ అసలు ఎందుకు వీళ్లంతా ఇంత గట్టిగా నవ్వుతున్నారనే అనుమానం కూడా వస్తుంది. కానీ అలా నవ్వడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అందుతాయట. అవేంటో మీరు కూడా తెలుసుకొంటే.. మీరు కూడా కచ్చితంగా నవ్వేస్తారు. 

1. ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తుంది

ఎప్పుడైనా కాస్త ఒత్తిడి అనిపించినప్పుడు కామెడీ వీడియోలు చూడటం, జోక్స్ చదవడం కొందరికున్న అలవాటు. అలా చేయడం వల్ల వారిలోని ఒత్తిడి ఉఫ్ మని ఊదేసినట్టుగా ఎగిరిపోతుందంటారు. వారు చెప్పింది అక్షరాలా నిజం. నవ్వడం వల్ల మనలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ల స్థాయి తగ్గుముఖం పడుతుంది. మెదడు ఉత్సాహంగా మారిపోతుంది.

1-benefits-of-laughter

ADVERTISEMENT

2. రక్తపోటు తగ్గిస్తుంది

ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. దీనికి కారణం రోజురోజుకీ పెరిగిపోతున్న పని ఒత్తిడే. ఈ రక్తపోటు గుండె ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే.. కాసేపు నవ్వుకోవాలి. హాయిగా నవ్వడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. పలితంగా గుండె ఆరోగ్యం(health) మెరుగుపడుతుంది. ఇంకెందుకాలస్యం పేపర్లు, మ్యాగజైన్లో వచ్చే కార్టూన్లు, జోక్స్ ఒక్కటి కూడా వదలకుండా చదివి మనస్ఫూర్తిగా నవ్వుకోండి.

3. మంచి వ్యాయామం

నమ్మాలనిపించడం లేదు కదా.. నవ్వడం వల్ల మన శరీరంలో కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. అంతేకాదు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  అదెలాగనుకొంటున్నారా? నవ్వుతున్నప్పుడు మనకు తెలియకుండానే శరీరంలోని ప్రతి భాగం కదులుతుంది. ముఖ్యంగా  పొట్ట కండరాలు, చేతులు, బుగ్గలు సంకోచవ్యాకోచాలకు గురవుతాయి. అందుకే ఆగకుండా కాసేపు నవ్వితే పొట్టలో నొప్పి వస్తుంది. బుగ్గలు నొప్పెడతాయి. మీరు నవ్వే విధానంపై క్యాలరీలు కరగడం ఆధారపడి ఉంటుంది.

ADVERTISEMENT

2-benefits-of-laughter

4. వ్యాధి నిరోధక శక్త ిపెరుగుతుంది

నవ్వడం వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. ఇవి శరీరంలో పెరుగుతున్నాయంటే ఇన్ఫెక్షన్లు, వ్యాధులను తట్టుకొనే శక్తి పెరుగుతుంది. యాంటీబాడీస్ మాత్రమే కాదు శరీరంలో టీ సెల్స్ కూడా పెరుగుతాయి. ఇవి కూడా మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు, న్యూరోట్రాన్సిమిట్టర్స్ విడుదలవుతాయి. ఎండార్ఫిన్లు నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. కాబట్టి ఏవైనా చిన్నచిన్న నొప్పులుంటే అవి క్రమంగా తగ్గుముఖం పడతాయి. అంతేకాదు మనలోని ఆత్రుత, కోపం, బాధను తగ్గిస్తాయి. న్యూరోట్రాన్సిమిట్టర్స్ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 

5. మెదడు పని తీరు మెరుగుపడుతుంది

ADVERTISEMENT

నవ్వడం వల్ల మన ఊపిరితిత్తులు తక్కువ సమయంలో ఎక్కువ గాలి పీల్చుకుంటాయి. దీనివల్ల తాత్కాలికంగా గుండె కొట్టుకొనే వేగం పెరుగుతుంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. సరిపడినంత ఆక్సిజన్ అందడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా అది చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది.

6. సానుకూల దృక్ప‌థం పెరుగుతుంది

పరీక్షల్లో మార్కులు రాలేదనో.. కోరుకొన్నఉద్యోగం దక్కలేదనో.. లేదా మరే ఇతర కారణమైనా కావచ్చు.. ఇటీవలి కాలంలో యువతలో ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ఇది వారికి మాత్రమే కాదు సమాజానికి సైతం నష్టం చేకూరుస్తుంది. మరి ఇలాంటి నెగెటివ్ ఆలోచనలను వదిలించుకొని సానుకూల భావాలను పెంచుకోవాలంటే లాఫింగ్ థెరపీ పాటించాల్సిందే. నవ్వడం వల్ల మెదడు, మనసు రెండూ రిలాక్సవుతాయి. క్రమంగా ఆలోచనా విధానం మారుతుంది.నెగటివ్ ఆలోచనలు వదలి పాజిటివ్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

3-benefits-of-laughter

ADVERTISEMENT

7. నిద్ర బాగా పడుతుంది

ఇటీవలి కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇలా నిద్ర పోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఒత్తిడి భారం పెరిగిపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయాల్సి రావడం కూడా కారణం కావచ్చు. నిద్రపోయే ముందు కాసేపు నవ్వడం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు కామెడీ ప్రోగ్రాంలు చూడటం లేదా జోక్స్ చదవడం అలవాటు చేసుకోండి.

8. మిమ్మల్ని యంగ్ గా మార్చేస్తుంది

నవ్వు ఫేసియల్ ఎక్సర్సైజ్ లా పనిచేస్తుంది. మనం నవ్వినప్పుడు ముఖంపై ఉన్న 15 కండరాలు కలసి పనిచేస్తాయి. దీనివల్ల ముఖం మొత్తానికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చర్మానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. దీనివల్ల చర్మసౌందర్యం మెరుగుపడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాబట్టి మీరెప్పుడూ యంగ్ గానే కనిపిస్తారు.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి:

ఇలాంటి చిత్ర‌విచిత్ర‌మైన వ్యక్తులు.. మీకూ మార్కెట్లో ఎదుర‌య్యారా?

అల్లరి పిడుగు బుడుగు.. మనింట్లో చిచ్చర పిడుగైతే..?

సెల్ఫ్ లవ్ : మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

17 May 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT