ADVERTISEMENT
home / Food & Nightlife
మంచు లక్ష్మీ చెప్పిన.. పాలియో డైట్ సీక్రెట్స్ ఇవే

మంచు లక్ష్మీ చెప్పిన.. పాలియో డైట్ సీక్రెట్స్ ఇవే

(Actress Manchu Lakshmi shares her views on Paleo Diet)

తెలుగులో అనతి కాలంలోనే బాగా పాపులరైన నటి, యాంకర్, వ్యాఖ్యాత మరియు నిర్మాత మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు కుమార్తై అయినా సరే.. ఎప్పుడూ తనదైన శైలిలోనే రాణించారామె. ఇటీవలే ఓ వెబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలియో డైట్ గురించి తన ఆలోచనలను పంచుకున్నారామె. 2020 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. తాను తన జీవితంలో తీసుకుంటున్న అత్యద్భుతమైన నిర్ణయం ఏదైనా ఉందంటే.. అది డైట్‌లో చేసుకుంటున్న మార్పని తెలిపారు. అయితే పాలియో డైట్‌ని పాటించడం కొంచెం కష్టమని అభిప్రాయపడ్డారు.

డైట్ పాటించడం అంటే కేవలం పుస్తకాలు చదివి.. ఏదో తినేయడం కాదని.. దానిని సీరియస్‌గా తీసుకోవాలని.. తన విషయానికి వస్తే.. దీనిని తన లైఫ్ స్టైల్‌లో భాగం చేసుకోవాలని అనుకుంటున్నానని తెలిపారామె. అలాగే ఇలా డైట్ మార్చుకోవాలని భావించినప్పుడు.. నిపుణుల పర్యవేక్షణ అనేది అత్యంత అవసరం అని.. అందుకే తన డైట్ ప్రణాళికలు చూసుకొనేందుకు.. ఇంట్లోనే ఒక న్యూట్రిషియనిస్ట్‌ని అపాయింట్ చేశానని తెలిపారామె. అలాగే ఈ పాలియో డైట్ వల్ల కలిగే ఉపయోగాల గురించి కుటుంబీకులకు కూడా చెప్పానని తెలిపారు మంచు లక్ష్మి.

భార్యాభర్తల్లా విడిపోతున్నాం.. స్నేహితుల్లా కలిసుంటాం – మంచు మనోజ్

ADVERTISEMENT

ఈ మధ్యకాలంలో అనేకమంది సెలబ్రిటీలు పాటిస్తున్న డైట్ సూత్రాలలో ముఖ్యమైంది.. ఈ పాలియో డైట్. వేగంగా బరువు తగ్గి.. నాజూగ్గా కనిపించడంలో కూడా ఈ డైట్ ప్రధాన పాత్ర పోషిస్తుందట. ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులకు స్వస్తి పలుకుతూ.. పూర్తి సహజమైన ఆహారానికి పెద్దపీట వేయడమే ఈ పాలియో డైట్ ముఖ్య ఉద్దేశం. చిత్రమేంటంటే.. మన శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గాలంటే.. మన ఆహారంలో సహజమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండాలని ఈ డైట్ చెబుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న లాజిక్‌తో ఈ డైట్ నడుస్తుంది. 

ఆ అబ్బాయి నాకన్నా.. తెలుగు బాగా మాట్లాడుతున్నాడు: మంచు లక్ష్మీ

పండ్లు, కాయగూరలు, గింజలు, విత్తనాలు, మాంసం, ఓమెగా 3 ఫ్యాటీ ఆమ్లలు అధికంగా కలిగే చేపలు, వేరుశెనగ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో చేసిన ఉత్పత్తులను మాత్రమే చాలామంది ఈ పాలియో డైట్‌ను పాటించే క్రమంలో వాడుతుండడం విశేషం. దాదాపు 10,000 సంవత్సరాల నాటి ఆహార పద్ధతులను పోలి ఉండే ఈ సహజమైన డైట్‌ను ఎలా పెడితే అలా పాటించకూడదని.. కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలని.. అప్పుడే ఫలితాలు పొందే అవకాశముందని అంటున్నారు నిపుణులు. 

తారల రాత్రి జీవితం గురించి.. మనకు చెప్పడానికి వచ్చేస్తోంది మంచు లక్ష్మి ..!

ADVERTISEMENT

ఈ పాలియో డైట్‌నే చాలామంది కేవ్ మెన్ డైట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. దాదాపు అడవిలో దొరికే ఉత్పత్తులే ఈ డైట్‌లో సింహభాగం ఉంటాయి. బరువును తగ్గించడం లేదా స్థిరంగా ఉంచేలా చేయడం.. అలాగే రక్తపోటు స్థిరీకరించేలా చేయడం అనేది పాలియో డైట్ ముఖ్య ఉద్దేశం. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచడానికి కూడా ఈ డైట్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ డైట్‌ శాస్త్రీయతను ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. ఆధునిక వైద్యంలో పాలియో డైట్ సూత్రాలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయన్నది పలువురి అభిప్రాయం.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.                                                                                

 

 

ADVERTISEMENT

 

 

24 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT