భార్యాభర్తల్లా విడిపోతున్నాం.. స్నేహితుల్లా కలిసుంటాం - మంచు మనోజ్

భార్యాభర్తల్లా  విడిపోతున్నాం.. స్నేహితుల్లా కలిసుంటాం - మంచు మనోజ్

మంచు మనోజ్ (manchu manoj).. మంచు మోహన్ బాబుకి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అయితే ఈ హీరో గత రెండేళ్లుగా ఎటువంటి చిత్రాలు చేయకుండా కేవలం ఇంటికే పరిమతమయ్యాడు. ఏదో అప్పుడప్పుడు వారి సొంత స్కూల్ అయిన శ్రీ విద్యానికేతన్ కి సంబందించిన కార్యక్రమాల్లో కనపడడం తప్ప మరే ఇతర సందర్భాల్లో మనోెజ్ బయట కనపడలేదు. అలాగే మనోజ్ నుండి సినిమాకి సంబందించిన ప్రకటనలు కూడా రావడం లేదు.

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

అయితే ఒక్క సోషల్ మీడియా ద్వారానే ఆయన అభిమానులతో లేదా చిత్రపరిశ్రమలో ఉన్న తోటివారితో అందుబాటులో ఉన్నాడు. ఎల్లపుడూ ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే ఈ మంచు వారి అబ్బాయి మౌనం వెనుక ఉన్న కారణం కొద్దిసేపటి క్రితమే వెల్లడైంది. రెండేళ్లగా తన జీవితంలో జరుగుతున్న సంఘర్షణ, తాను ఎదుర్కొన్న బాధ గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అందరితో పంచుకున్నాడు మనోజ్. 

తన జీవిత భాగస్వామి ప్రణతి రెడ్డి (pranathi reddy) కి & తనకి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల వల్ల ఇద్దరం విడాకులు (divorce) తీసుకున్నామని మనోజ్ ప్రకటించాడు. ఆ భేదాభిప్రాయాలని తగ్గించుకునే ప్రయత్నం ఇరు వైపుల నుండి జరిగిందట. అయితే వీరి ప్రయత్నాలు సత్ఫాలితాలు ఇవ్వకపోవడంతో ఈ ఇద్దరు  విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారట. అలా ఈరోజు నుండి తామిద్దరూ వేర్వేరు జీవితాలు గడపబోతున్నట్టుగా తెలియచేశాడు మనోజ్.

అయితే తాము అప్పుడు & ఇప్పుడు కూడా ఒకరంటే ఒకరికి ఎంతో మంచి స్నేహితులమని చెప్పిన మనోజ్.. తమ స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు.  ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు.. దాని వల్ల ఎదుర్కొన్న బాధ,  సమస్యలను పరిష్కరించుకునే క్రమంలోనే సినిమాల పైన పూరి ధ్యాస పెట్టలేకపోయానని చెప్పుకొచ్చాడు మనోజ్. విడాకులు తీసుకున్న తాను మళ్లీ తాను ఎప్పుడూ ప్రేమించే సినిమాల పైన దృష్టి నిలపబోతున్నట్టుగా తెలియచేస్తూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్టుగా ప్రకటించాడు.

మాది 100 % 'లవ్ స్టోరీ' - సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

ఈ రెండేళ్ళ కాలంలో తనకి అన్నిరకాలుగా సహాయసహకారాలతో పాటుగా మానసిక ధైర్యాన్ని అందించిన తన కుటుంబానికి, స్నేహితులకి  సినిమాలు చేయకపోయినా కూడా అండగా నిలిచిన ఫ్యాన్స్ కి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను అని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తెలియపరిచారు మనోజ్. 

పైన చెప్పిన కారణంగానే మంచు మనోజ్ సినిమాలకి రెండేళ్లుగా దూరంగా ఉంటునట్టుగా స్పష్టమైంది. అయితే మనోజ్ & ప్రణతిలు విడిపోవడానికి అసలు కారణమేంటి అనేదాని పైన ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. కారణాలు ఏవైనప్పటికి మే 20, 2015లో ఈ ఇద్దరు ఒకటైన నాటి నుండి నేటి వరకు అంటే వీరి వైవాహిక జీవితం కేవలం నాలుగేళ్ల పాటే కొనసాగడం విచారకరం. గతేడాది ప్రారంభంలోనే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలొచ్చినట్లు.. అందుకే ప్రణతి అమెరికా వెళ్లిపోయి తన తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటున్నట్లు చాలా వార్తలొచ్చాయి. కానీ అప్పుడు మనోజ్ వాటన్నింటినీ ఖండిస్తూ తమ మధ్య ఎలాంటి ఇబ్బందులూ లేవని చెప్పడం విశేషం. ఆ ప్రకటన వచ్చిన సంవత్సరం తర్వాత ఇప్పుడు విడాకుల ప్రక్రియ పూర్తయిపోయిందని మనోజ్ ప్రకటించడం చూస్తే వారి బంధంలో రెండేళ్ల క్రితమే గొడవలు ప్రారంభమయ్యాయని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. 

 

'కలిసి బ్రతకలేము అని అనుకున్నప్పుడు విడిపోయి ఎవరి జీవితాల్లో వారు హాయిగా ఉండడమే మంచిది' అని నిర్ణయించుకున్న ఈ జంట నిర్ణయానికి మనమూ సానుకూలంగా స్పందిస్తూ వారి భవిష్యత్తు అందంగా సాగాలని కోరుకుందాం. మంచు మనోజ్ ఆఖరుగా వెండితెర పైన కనిపించిన చిత్రం ఒక్కడు మిగిలాడు. శ్రీలంక లోని తమిళుల పైన ఆధారం చేసుకుని తీసిన చిత్రంలో కనిపించిన మంచు మనోజ్.. ఆ తరువాత మరే ఇతర చిత్రానికి సంతకం చేయలేదు.

ఇక ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తాను అని ప్రకటించడంతో ఆయన నుండి మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాలని ఆశించడానికి వీలుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని మనోజ్ మర్చిపోవాలని.. తన వృత్తిపరమైన జీవితంలో పొందే విజయంతో సంతోషంగా జీవించాలని మనసారా ఆశిద్దాం.

'ఉప్పెనంత ప్రేమ'కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి