ADVERTISEMENT
home / సౌందర్యం
నూనె కాని నూనె.. జొజోబా నూనె  అందించే సౌందర్య ప్రయోజనాలివే..!

నూనె కాని నూనె.. జొజోబా నూనె అందించే సౌందర్య ప్రయోజనాలివే..!

జొజోబా నూనె గురించి మ‌న‌లో చాలా త‌క్కువ మందికి తెలుసు. కానీ సౌందర్య పోషణ విషయంలో దీనికి సాటి మరేదీ లేదనే చెప్పుకోవాలి. నేటివ్ అమెరికన్ తెగలకు చెందినవారు దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు చర్మం, కురులను సంరక్షించే ఉత్పత్తుల తయారీలో జొజోబా నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉన్న విటమిన్ ఇ, బీ5 చర్మంపై ఏర్పడిన సన్నని గీతలు, ముడతలను తగ్గించి సున్నితంగా మార్చేస్తుంది. అందుకే దీన్ని స్కిన్ టోనర్‌గానూ ఉపయోగిస్తారు. ఇది సీబమ్(sebum)లా పనిచేసి చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది.

అయితే వయసు పెరిగే కొద్దీ చర్మగ్రంథుల నుంచి సీబమ్ ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. దీనివల్ల చర్మం నిర్జీవంగా తయారవుతుంది. అందుకే స్కిన్ కేర్ రొటీన్‌లో జొజోబా ఆయిల్‌ను భాగం చేసుకొంటే.. చర్మం మాయిశ్చరైజ్ అవ్వడంతో పాటు సాఫ్ట్‌గా తయారవుతుంది. జొజోబా ఆయిల్ ఉపయోగాలు చర్మం వరకే పరిమితవ్వలేదు. ఇది జుట్టుకి సైతం పోషణ ఇచ్చి బలంగా మారుస్తుంది. అంతేకాదు.. ఆరోగ్యాన్ని సైతం సంరక్షిస్తుంది. ఇంకా దీని గురించి సందేహాలున్నాయా? అయితే జొజోబా ఆయిల్ ద్వారా క‌లిగే ఉపయోగాలేంటో మీరు తెలుసుకోవాల్సిందే.

జొజోబా ఆయిల్ అంటే ఏంటి?

11-jojoba-oil-for-skin-hair

ADVERTISEMENT

అరిజోనా, మెక్సికో వంటి దేశాల్లో పండే జొజోబా మొక్కల గింజల నుండి ఈ నూనెను తీస్తారు. బంగారు వర్ణంలో ఉండే JOJOBA OIL అనే మాట సరిగ్గా ఎలా పలకాలో తెలుసా? J స్థానంలో H పెడితే ఎలా పలుకుతాం అలా అన్నమాట. అంటే హొహొబా ఆయిల్ అని పలకాలన్నమాట! ఇంట్రెస్టింగా ఉంది కదా!! మీకింకో విషయం తెలుసా? జొజోబా అసలు నూనే కాదు. అది లిక్విడ్ వ్యాక్స్.

మన చర్మగ్రంథులు విడుదల చేసే సీబమ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే ఇది చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుతుంది. జొజోబా నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఎటువంటి చర్మతత్వం కలిగినవారైనా దానిని ఉపయోగించవచ్చు.

జొజోబా నూనెలో విటమిన్ బి, సి, ఇల తో పాటుగా ఖనిజ లవణాలైన కాపర్, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మానికి తగిన పోషణ అందుతుంది. దీనిలో ఉన్న హీలింగ్ ప్రోపర్టీస్ సీబమ్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తాయి. అలాగే చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మారుస్తాయి. తలకు రాసుకొంటే స్కాల్ఫ్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కురులు బలంగా తయారవుతాయి. రాలిన జుట్టు స్థానంతో కొత్త వెంట్రుక‌లు పుట్టుకొస్తాయి.

జొజోబా ఆయిల్ ఉపయోగాలు

ADVERTISEMENT

ముందుగా మనం చెప్పుకొన్నట్టుగానే జొజోబా నూనెను చర్మం, కురుల తత్వంతో సంబంధం లేకుండా అందరూ వాడొచ్చు. మీ డైలీ బ్యూటీ రొటీన్‌లో దీన్ని ఎలా భాగం చేసుకోవాలి? దీనికి పరిష్కారం ఒక్కటే.. సాధారణంగా దీన్ని ఇతర నూనెలతో కలిపి మిశ్రమంగా ఉపయోగిస్తారు. కాబట్టి మీరు రోజూ ఉపయోగించే నూనెలో దీన్ని కలిపి ఉపయోగించుకోవచ్చు.

జొజోబా వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకొందాం.

చర్మఆరోగ్యం కోసం జొజోబా నూనె

2-jojoba-oil-for-skin-hair

ADVERTISEMENT

వాతావరణ కాలుష్యం, రసాయనాలతో నిండిన సబ్బులు, షాంపూలు, ఇతర సౌందర్య ఉత్పత్తులు, వేణ్నీళ్ల స్నానం.. మొద‌లైన వాటి వ‌ల్ల‌ చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. చర్మంపై ఉండే సహజనూనెలు తొలిగిపోయి పొడిగా, కళావిహీనంగా తయారవుతుంది. రోజంతా ఎయిర్ కండిషన్డ్ గదిలో గడిపేవారి చర్మం సైతం తరచూ పొడిగా మారిపోతుంటుంది.

వివిధ కారణాల వల్ల చర్మం పొడిబారడమే కాకుండా.. పగిలినట్లుగా తయారవుతుంది. సీబమ్, పీహెచ్ విలువల సమతౌల్యం దెబ్బతింటుంది. ఇలా జరగడం వల్ల చర్మానికి చాలా నష్టం జరుగుతుంది. చర్మం జిడ్డుగా లేదా పొడిగా మారిపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇలా కాకుండా చర్మం ఎప్పటి లాగే సౌందర్యవంతంగా ఉండాలంటే.. జొజోబా ఆయిల్ వాడాల్సిందే. మాయిశ్చరైజర్‌గా దీన్ని రోజూ ఉపయోగిస్తే.. చర్మానికి చాలా ప్రయోజనం జరుగుతుంది. ఇది చర్మంపై పొరలా ఏర్పడి తేమ కోల్పోకుండా చేస్తుంది. ఇది సీబమ్ మాదిరిగా పనిచేస్తుంది కాబట్టి చర్మం పొడిగా మారదు. అలాగే సీబమ్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది కాబట్టి.. జిడ్డుగానూ తయారవ్వదు. కాబట్టి దీన్ని ముఖానికి, చర్మానికి కూడా ఎలాంటి సందేహం లేకుండా అప్లై చేసుకోవచ్చు.

జొజోబా నూనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, గాయాలు, వాటి కారణంగా ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. మీ చర్మంపై గాయాలుంటే.. వాటికి కాస్త జొజోబా నూనె అప్లై చేసి చూడండి.. ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. చాలా తక్కువ సమయంలోనే అవి తగ్గుముఖం పడతాయి.

ADVERTISEMENT

ఆలివ్ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మొటిమలు తగ్గించడానికి జొజోబా నూనె

అసలే జిడ్డుగా ఉన్న చర్మానికి నూనె రాస్తే ఇంకా జిడ్డుగా మారిపోతుందేమో? మొటిమలు ఎక్కువైపోతాయేమోననే సందేహం మీకు రావచ్చు. కానీ జొజోబా ఆయిల్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఇలా జరిగే అవకాశమే ఉండదు. పైగా మొటిమలు తగ్గుముఖం పడతాయి. 

జొజోబా నూనె మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అందుకే మొటిమలు, మొటిమలు రావడానికి అవకాశం ఉన్న చర్మం కలిగినవారు దీన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. జొజోబా నూనె తేలిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు రాసుకొన్న తర్వాత జిడ్డుగా అనిపించదు. కాబట్టి అసౌకర్యంగా అనిపించదు. పైగా దీనిలో ఉన్న విటమిన్లు, మినరల్స్ పాడయిన చర్మాన్ని తిరిగి పూర్వపు స్థితికి చేరుస్తాయి. రోజూ ఈ నూనెను ఉపయోగించడం ద్వారా చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గానే ఉంటుంది.

ADVERTISEMENT

జొజోబా నూనె – జుట్టు ఆరోగ్యం

4-jojoba-oil-for-skin-hair

జుట్టు, స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జొజోబా నూనెను ఉపయోగించవచ్చు. ఇది వెదజల్లే మైల్డ్ సువాసన కారణంగా దీన్ని తలకు రాసుకోగానే చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ నూనెకు జిడ్డుగా ఉండే తత్వం తక్కువ కాబట్టి.. తల జిడ్డుగా అనిపించదు. దీనిలో ఉన్న ఔషధ గుణాల వల్ల చుండ్రు, స్కాల్ప్ పొడిబారడం, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు.. ఇది కుదుళ్లను బలంగా చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

దీనివల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. హెయిర్ డ్రయర్, స్ట్రెయిటనర్ వల్ల జుట్టుకి జరిగిన నష్టాన్ని జొజోబా నూనె వాడటం ద్వారా పూడ్చుకోవచ్చు. బిరుసుగా మారిన జుట్టుని సాఫ్ట్‌గా మార్చడానికి జొజోబా నూనెను హెయిర్ సీరమ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

ADVERTISEMENT

ఇప్పటి వరకు మనం జొజోబా నూనె వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకొన్నాం. ఆ ప్రయోజనాలను పొందడానికి మనమేం చేయాలో తెలుసుకొందాం.

జొజోబా ఆయిల్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి?

జొజోబా నూనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చర్మ, కేశ సౌందర్యం కోసం రోజూ ఉపయోగించడం వల్ల మన అందం మరింత పెరుగుతుంది. జొజోబా నూనె ద్వారా మనకు కలిగే బహుళ ప్రయోజనాల కార‌ణంగా దాన్ని వాడాలని ఉన్నప్పటికీ దుష్ప్రభావాలు(side effects) కలుగుతాయేమోననే అనుమానం రావడం సహజం. అయితే దీనిలోని ఔషధ గుణాల వల్ల అలాంటివేమీ జరగవు. కాబట్టి సంకోచం లేకుండా దీన్ని ఉపయోగించవచ్చు.

మాయిశ్చరైజర్‌‌గా జొజోబా నూనె

ADVERTISEMENT

3-jojoba-oil-for-skin-hair

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి జొజోబా నూనెను ఉపయోగించవచ్చని తెలుసుకొన్నాం కదా.. మరి దాన్ని ఎలా, ఎప్పడు ఉపయోగించాలి? స్నానం చేసిన వెంటనే కొన్ని చుక్కల జొజోబా నూనెను శరీరానికి రాసుకోవాలి. కావాలనుకొంటే.. మీరు రోజూ ఉపయోగించే ఫేస్ క్రీం,బాడీ మాయిశ్చరైజర్లో కొన్ని చుక్కలు కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం తేమ కోల్పోదు. పైగా చర్మాన్ని సాఫ్ట్‌‌గా మార్చి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది.

మేకప్ రిమూవర్‌గా జొజోబా నూనె

మేకప్‌తో పాటు చర్మంపై పేరుకొన్న మురికి, జిడ్డు, దుమ్మును జొజోబా నూనెతో తొలగించుకోవచ్చు. ఇది చర్మాన్ని క్లెన్స్ చేయడంతో పాటు సహజమైన నూనెలు కోల్పోకుండా చేస్తుంది. కొన్ని చుక్కల జొజోబా నూనెను ముఖానికి రాసుకొని మేకప్ పూర్తిగా తొలగిపోయేంత వరకు మర్ధన చేసుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

ADVERTISEMENT

పెదవులు మృదువుగా

లిప్స్టిక్ అప్లై చేసుకోవడానికి ముందు లేదా రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు జొజోబా ఆయిల్‌తో మర్ధన చేసుకొంటే.. సాఫ్ట్ పింక్ లిప్స్ మీ సొంతమవుతాయి. పెట్రోలియం జెల్లీ సహా ఇతర లిప్ బామ్‌లతో పోలిస్తే జొజోబా ఆయిల్ సురక్షితమైనది. జొజోబా నూనె పొడిబారిన, పగిలిన పెదాలకు పోషణ అందించి మామూలుగా మారుస్తుంది. దీనికోసం కొన్ని చుక్కల జొజోబా నూనెను పెదవులకు రాసుకొంటే సరిపోతుంది. దీన్ని రుతువులతో సంబంధం లేకుండా ఏడాదంతా ఉపయోగించవచ్చు.

ముదిమి ఛాయలు రాకుండా..

జొజోబా నూనెలో విటమిన్ బి, ఇ, సి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని యాంటీ ఏజింగ్ క్రీం మాదిరిగా ఉపయోగించవచ్చు. దీనిలో ఉన్న విటమిన్లు, మినరల్స్ చర్మానికి పోషణ అందించి యవ్వనంగా మెరిసేలా చేస్తాయి. దీన్ని ముఖానికి లేదా చర్మంపై గీతలు, ముడతలు ఏర్పడిన చోట రాసుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

రాత్రి నిద్రపోయే ముందు ఈ నూనెను చర్మానికి రాసుకొని కాసేపు మర్ధన చేసుకోవాలి. లేదా నాలుగు నుంచి ఐదు చుక్కల జొజోబా నూనెను నైట్ క్రీంలో కలిపి దాన్ని ముఖానికి రాసుకొన్నా ఇదే ఫలితం లభిస్తుంది. లేదా నైట్ క్రీం రాసుకొన్న తర్వాత కొన్నిచుక్కల నూనెను ముఖానికి మసాజ్ చేసుకొన్నా ఇదే ఫలితం దక్కుతుంది.

సన్ బర్న్స్‌‌కి చికిత్స..

రానున్నది వేసవి కాలం. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ సూర్యుని ప్రతాపానికి చర్మం గురి కాక తప్పదు. మరి సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మాన్ని మామూలుగా మార్చుకొనేదెలా? దానికి పరిష్కారంగా జొజోబా నూనె ఉంది కదా. దీనిలో ఉన్న విటమిన్ బి, ఇ సూర్యుని ప్రతాపానికి గురైన చర్మాన్ని చల్లదనాన్ని అందిస్తాయి. సూర్యరశ్మి కారణంగా దెబ్బతిన్న చర్మకణాలను బాగుచేస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి సన్ బర్న్స్‌కి గురైన చర్మానికి జొజోబా నూనె రాస్తూ ఉండాలి.

మొటిమలు తగ్గడానికి..

ADVERTISEMENT

సీబమ్ ఉత్పత్తిని జొజోబా ఆయిల్ క్రమబద్ధీకరిస్తుంది. దీనివల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియాను సంహరిస్తాయి. అందుకే ఇటీవలి కాలంలో మొటిమలను తగ్గించడానికి వాడే సౌందర్య ఉత్పత్తుల్లో జొజోబా నూనెను ఉపయోగిస్తున్నారు.

Also Read: బ్యూటీ రిజల్యూషన్స్: సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం

జొజోబా నూనె వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు

6-jojoba-oil-for-skin-hair

ADVERTISEMENT

జొజోబా ఆయిల్ స్కాల్ఫ్‌ని శుభ్రం చేస్తుంది

జొజోబా నూనె తేలిక స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల రాసుకొన్న వెంటనే స్కాల్ఫ్‌లోకి ఇంకిపోతుంది. అంతేకాదు.. మాడుపై ఉన్న మురికి, దుమ్ము, అధికంగా ఉత్పత్తి అయిన సీబమ్‌ను తొలగిస్తుంది. జొజోబా నూనెను కురులకు రాసుకొంటే.. వాతావరణ కాలుష్య ప్రభావం వాటిపై పడకుండా కాపాడుతుంది.

వెంట్రుకల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది

జొజోబా నూనెలో విటమిన్ బి, ఇతో  పాటుగా జింక్ వంటి  ఖనిజాలున్నాయి. ఇవి జుట్టుకు మేలు చేసేవే. ఈ నూనెతో మాడుకు మర్దనా చేసుకోవడం ద్వారా రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. జుట్టు సైతం బలంగా తయారవుతుంది.

ADVERTISEMENT

డాండ్రఫ్ తగ్గిస్తుంది

చర్మంపైనే కాకుండా మాడుపై కూడా సీబమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది అవసరమైన దానికంటే ఎక్కువ విడుదలైతే.. స్కాల్ఫ్ కూడా ఆయిలీగా తయారవుతుంది. కొన్ని వారాల పాటు క్రమం తప్పుకుండా జొజోబా నూనె ఉపయోగిస్తే.. సీబమ్ ఉత్పత్తి నియంత్రణలోకి వస్తుంది. ఇలా రాసుకోవడం వల్ల చుండ్రు, ఇతర స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ల నుంచి సైతం విముక్తి లభిస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి. దీనితో పాటుగా సోరియాసిస్, పొట్టు రాలే సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

 Also Read: చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి

దైనందిన జీవితంలో జొజోబా ఆయిల్  ఎలా వాడాలి?
7-jojoba-oil-for-skin-hair

ADVERTISEMENT

జొజోబా ఆయిల్ వల్ల చర్మం, జుట్టుకి కలిగే లాభాల గురించి తెలుసుకొన్నాం. మరి దాన్నిరోజూవారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి?

ఫేస్ & బాడీ ఆయిల్

స్నానం చేసిన వెంటనే కొన్నిచుక్కల జొజోబా నూనెను ముఖానికి, శరీరానికి రాసుకోవాలి. జొజోబా నూనె మీ చర్మానికి రక్షణ కవచంగా ఏర్పడి.. తేమ కోల్పోకుండా చూస్తుంది.

ఫేషియల్ ఆయిల్

ADVERTISEMENT

ఫేషియల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొన్న తర్వాత జొజోబా నూనెను ముఖానికి అప్లై చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికోసం కొన్ని చుక్కల జొజోబా నూనెను చేతిలో వేసుకొని బాగా రుద్ది.. ముఖానికి అద్దుకొంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ముఖం రోజంతా తాజాగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా వాడితే చర్మం చాలా సాఫ్ట్‌గా తయారవుతుంది.

షాంపూ, కండిషనర్లలో కలిపి

కొన్ని చెంచాల జొజోబా నూనెను మీరు ఉపయోగించే షాంపూ, కండిషనర్లలో కలపండి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా శుభ్రపడుతుంది. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే జొజోబా నూనె కలిపిన షాంపూ, కండిషనర్ వాడే ముందు వాటిని బాగా షేక్ చేయడం మరచిపోవద్దు.

ఫేస్ ప్యాక్, బాడీ ప్యాక్స్

ADVERTISEMENT

కొన్ని చుక్కల జొజోబా ఆయిల్‌ను ఫేస్ ప్యాక్ లేదా బాడీ ప్యాక్‌లో కలిపి దాన్ని చర్మానికి అప్లై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ప్యాక్స్ చర్మంపై పేరుకొన్న మురికిని తొలగిస్తాయి. ఈ ప్రక్రియలో చర్మం పొడిబారకుండా జొజోబా నూనె కాపాడుతుంది.

ఫేస్ వాష్ 

మీరు ఉపయోగించే ఫేస్ వాష్ బాగా నురగ ఎక్కువ వస్తోందా? అయితే దానిలో పారాబెన్స్ ఎక్కువగా ఉన్నట్టే. మ‌రి వాటి ప్రభావం చర్మం మీద పడకుండా ఎలా కాపాడుకోవాలి? ఏముంది.. మీ ఫేస్ వాష్‌లో కొద్దిగా జొజోబా నూనెను కలిపితే సరిపోతుంది. జొజోబా నూనె ఫేస్ వాష్ నురగ తక్కువ వచ్చేలా చేయడంతో పాటు.. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

మేకప్ రిమూవర్

ADVERTISEMENT

మేకప్ తొలగించడానికి జొజోబా నూనె బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా జొజోబా నూనెతో ముఖాన్ని మసాజ్ చేసుకొంటే సరిపోతుంది. జొజోబా నూనె చర్మంపై ఉన్న మేకప్, మురికిని వదలగొట్టి చర్మరంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. మర్ధన పూర్తయిన తర్వాత మైల్డ్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

స్కాల్ఫ్ శుభ్రం చేయడానికి

చిన్న గిన్నెలో జొజోబా నూనెను తీసుకొని గోరువెచ్చగా వేడి చేయాలి. దీన్ని మాడుకి రాసుకొని కాసేపు మర్ధన చేసుకోవాలి. జుట్టుకి సైతం దీన్ని రాసుకొని దువ్వుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు శుభ్రపడటమే కాకుండా.. దానికి కావాల్సిన పోషణ సైతం అందుతుంది. ఇలా చేస్తే జుట్టుకి కండిషనర్ రాసుకోవాల్సిన అవసరం రాదు. ఇంకా మంచి ఫలితం రావాలంటే.. రాత్రి నిద్రపోయే ముందు జొజోబా నూనెను తలకు రాసుకొని మరుసటి రోజు తలస్నానం చేయాలి.

హెయిర్ సీరమ్

ADVERTISEMENT

హెయిర్ సీరమ్‌కి బదులుగా జొజోబా ఆయిల్ ఉపయోగించవచ్చు. తలస్నానం చేసిన తర్వాత ఈ నూనెను కొద్దిగా తలకు రాసుకొంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు బిరుసుగా మారకుండా ఉంటుంది.

భారత్‌లో దొరికే నాణ్యమైన జొజోబా ఆయిల్స్

జొజోబా నూనె కొనాలనుకొంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఖర్చు కాస్త ఎక్కువైనప్పటికీ రసాయనాలు కలపని నూనె ఎంచుకోవడం మంచిది. నాణ్యమైన, ఆర్గానిక్ జొజోబా నూనె అయితే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న నాణ్యమైన జొజోబా నూనెల వివరాలు..

1. సోల్ ఫ్లవర్ జొజోబా ఆయిల్(రూ 585)

ADVERTISEMENT

2. న్యాసా జొజోబా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్(రూ 855)

3. అరోమా మ్యాజిక్ జొజోబా ఆయిల్(రూ 719)

4. డేవ్ హెర్బ్స్ 100% నేచురల్ ప్యూర్ జొజోబా ఆయిల్(రూ 299)

5. సెయింట్ బొటానికా గోల్డెన్ వర్జిన్ ప్యూర్ జొజోబా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్(రూ 699)

ADVERTISEMENT

Also Read: చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులు 

తరచూ అడిగే ప్రశ్నలు

1. జొజోబా నూనె వాడితే hair fall తగ్గుతుందా?

హెయిర్ లాస్ సమస్యను జొజోబా ఆయిల్ సమర్థంగా తగ్గిస్తుంది. అంతేకాదు.. రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు మొలిచేలా చేస్తుంది. దీనిలో ఉన్న ఒమెగా 6, 9 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ హెయిర్ గ్రోత్‌ను పెంచుతాయి. జొజోబా ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడానికి కారణమైన ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. దీనివల్లే జుట్టు రాలే సమస్య తగ్గి.. జుట్టు ఒత్తుగా తయారవుతుంది.

ADVERTISEMENT

2. Oily skin కలిగిన వారు జొజోబా ఆయిల్ వాడొచ్చా?

ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా జొజోబా ఆయిల్ వాడొచ్చు. ఎందుకంటే ఇది ద్రవ రూపంలో ఉన్న పాలీ అన్సాచ్యురేటెడ్ వ్యాక్స్. పైగా ఇది చర్మం ఉత్పత్తి చేసే సహజనూనెలకు దగ్గరగా ఉంటుంది. దీన్ని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం సీబమ్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తుంది. ఫలితంగా చర్మం జిడ్డుగా మారదు.

3. చర్మం ముడతలు పడకుండా జొజోబా ఆయిల్ కాపాడుతుందా?

కచ్చితంగా.. వయసు పెరగడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. దీనికి కారణం వయసు పెరిగే కొద్దీ చర్మం యవ్వనంగా కనిపించేలా చేసే సీబమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. జొజోబా ఆయిల్ సీబమ్ లానే పనిచేస్తుంది కాబట్టి.. చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది.

ADVERTISEMENT

4. శీతాకాలంలో జొజోబా నూనె చర్మానికి రాసుకోవచ్చా?

నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. జొజోబా నూనెను చాలా త్వరగా చర్మంలోకి ఇంకిపోతుంది. దీనిలో ఉండే విటమిన్ ఇ, బి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ చిట్కాలతో.. నొప్పి లేకుండా వ్యాక్సింగ్ చేసుకోవడం సాధ్యమే..!

ADVERTISEMENT

ఎప్ప‌టికీ మీ వయసు ఇర‌వైలానే క‌నిపించాలా?? అయితే ఇలా చేయ‌కండి..!

ఈతరం అమ్మాయిలకు ఉప‌క‌రించే.. బామ్మగారి సౌందర్య చిట్కాలు..

26 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT