ADVERTISEMENT
home / Food & Nightlife
ఈ కేక్ రెసిపీలతో.. మీ క్రిస్మస్‌ని అద్భుతంగా జరుపుకోండి

ఈ కేక్ రెసిపీలతో.. మీ క్రిస్మస్‌ని అద్భుతంగా జరుపుకోండి

Christmas Cakes Special

క్రిస్మస్ పండగ  అనేది అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండగ. పండక్కి అంతా సిద్ధమవుతున్న వేళ.. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు, అందమైన అలంకరణలు, నోరూరించే కేకులు కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కేకులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే కొన్నిసార్లు అన్ని కేకులలోనూ క్వాలిటీ  కనబడదు. అందుకే మనమే  ఇంట్లో కేక్ తయారుచేసుకొని.. ఆరోగ్యకరమైన రెసిపీలతో పండగను ఆనందంగా జరుపుకుందాం. మరి, ఈ క్రమంలో ఇంట్లోనే చక్కగా కేక్‌లను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ క్రిస్మస్ కేక్

మీరు గుడ్డు లేకుండా కేక్ తయారుచేసుకోవాలనుకుంటే.. మీ క్రిస్మస్ కేక్‌ని డ్రై ఫ్రూట్స్ సాయంతో చేసుకునే వీలుంటుంది.

ADVERTISEMENT

కావాల్సినవి

మైదా పిండి – కప్పు
పాల పొడి – కప్పు
పాలు – కప్పు
చక్కెర – కప్పు
వెనిలా ఎస్సెన్స్ – నాలుగైదు చుక్కలు
బేకింగ్ పౌడర్ – టీస్పూన్
బేకింగ్ సోడా – టీస్పూన్
డ్రై ఫ్రూట్స్ (వాల్ నట్స్, జీడి పప్పు, బాదం పప్పు)
నెయ్యి – మూడు టీస్పూన్లు

తయారీ

ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మైదా, పాల పొడి, చక్కెర, నెయ్యి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అన్నీ వేసి.. పాలతో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆపై బటర్ పేపర్ వేసిన బేకింగ్ ట్రే తీసుకొని.. కొద్దిగా నూనె రుద్ది.. అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ లోపు ఒవెన్‌ని ప్రిహీట్ చేసి పెట్టుకోవాలి. 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రిహీట్ చేసిన తర్వాత.. నలభై ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసి.. మరో పది నిమిషాల పాటు చల్లార్చితే చాలు.. డ్రై ఫ్రూట్ కేక్ సిద్ధం.

ADVERTISEMENT

ఈ విషయాలు కేవలం.. ఐస్ క్రీం ప్రేమికులకు మాత్రమే అర్థమవుతాయి..!

చాక్లెట్ మడ్ కేక్

ఈ కేక్ చాలా రుచిగా ఉంటుంది. మీకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం అయితే.. మీరు తప్పనిసరిగా ఈ కేక్‌ని రుచి చూడాల్సిందే.

కావాల్సినవి

ADVERTISEMENT

మైదా – పావు కేజీ
గుడ్లు – ఆరు
చక్కెర – అరకేజీ
కోకో పౌడర్ – వంద గ్రాములు
డార్క్ చాక్లెట్ – అర కేజీ
వెనిలా ఎస్సెన్స్ – టేబుల్ స్పూన్
వెన్న – చిన్న క్యూబ్
చాక్లెట్ – రెండు వందల గ్రాములు

తయారీ

ముందుగా డార్క్ చాక్లెట్, వెన్న కలిపి దాన్ని మిశ్రమంగా చేసుకోవాలి. తర్వాత అందులో మైదా, కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరో బౌల్‌లో గుడ్డుతో చక్కెరను బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత చాక్లెట్ మిశ్రమంతో పాటు.. చాక్లెట్ తురుమును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద.. పది నిమిషాలు ప్రిహీట్ చేసిన ఒవెన్‌లో అరగంట పాటు దీన్ని బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట పాటు చల్లార్చుకోవాలి. అంతే చాక్లెట్ మడ్ కేక్ సిద్ధం.

మొలకలతో ఆరోగ్యకరమైన, నోరూరించే వంటకాలు.. ఇలా తయారు చేసేద్దామా..!

ADVERTISEMENT

రమ్ కేక్

సాధారణంగా క్రిస్మస్‌కి సంప్రదాయబద్ధమైన రమ్ కేక్ తయారుచేయడం ఆనవాయితీ. మీరు కూడా దాన్ని తయారు చేయాలనుకుంటే.. దానికి కొన్ని రోజుల ముందుగానే డ్రై ఫ్రూట్స్‌ని రమ్‌లో నానబెట్టాలి. ఆ తర్వాత కేక్ తయారుచేసుకోవచ్చు.

కావాల్సినవి

చక్కెర – కప్పు
వెన్న – కప్పు
మైదా – కప్పు
రమ్ – అర కప్పు
బేకింగ్ పౌడర్ – టీస్పూన్
పాలు – తగినన్ని
డ్రైఫ్రూట్స్ – అర కప్పు

ADVERTISEMENT

తయారీ

మీరు ఎంత కావాలంటే అంత ముందుగా.. రమ్‌లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెట్టుకోవాలి. మామూలుగా అయితే వారం నుంచి నెల రోజుల ముందు వీటిని నానబెట్టుకోవాలి. కేక్ చేయడానికి ముందు మైదా.. బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వెన్న, చక్కెర బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మైదాలో పాలు కలిపి.. మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. అందులో చక్కెర మిశ్రమంతో పాటు.. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత దీన్ని నూనె పూసిన మౌల్డ్‌లో వేసి.. పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే రమ్ కేక్ సిద్ధం.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

20 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT