ఈ విషయాలు కేవలం.. ఐస్ క్రీం ప్రేమికులకు మాత్రమే అర్థమవుతాయి..!

ఈ విషయాలు కేవలం.. ఐస్ క్రీం ప్రేమికులకు మాత్రమే అర్థమవుతాయి..!

ఐస్ క్రీం (Ice cream).. ఈ రెండు పదాలు వింటే చాలు.. చాలామందికి నోట్లో నీళ్లూరిపోతాయి. చల్లచల్లగా, కమ్మకమ్మగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ గొంతులోకి జారిపోతుంది ఐస్ క్రీం. అలాగే చాలామంది ఐస్ క్రీం అంటే చాలు..ఎంతదూరమైనా వెళ్లేందుకు..ఏదైనా చేసేందుకు సిద్ధమవుతుంటారు.

అందరూ కేక్స్, చాక్లెట్లు తింటుంటే.. ఐస్ క్రీం ప్రేమికులు (Ice cream lovers) మాత్రం అదెక్కడుందో వెతుకుతుంటారు. పార్టీల్లో విందుభోజనం వదిలేసి ఐస్ క్రీంపై పడిపోతారు. వీళ్లకు ఐస్ క్రీం తినడానికి ప్రత్యేకంగా ఓ సందర్భం అంటూ అవసరం లేదు. అలా ఐస్ క్రీంని ఇష్టపడేవారిలో మీరు ఒకరైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం..

Shutterstock

1. అర్థరాత్రి ఆకలి

డాక్టర్ ఆరోగ్యకరమైన ఆహారం తినాలని చెప్పారని.. రాత్రి ఎంతో ఆరోగ్యంగా ఆహారం తిని పడుకుంటారు. కానీ అర్థ రాత్రి ఐస్ క్రీం ఆకలి మిమ్మల్ని ఆగనివ్వదు.. మీ ఫేవరెట్ ఆహారం తిన్నా..ఐస్ క్రీం లేకుండా అది పూర్తవ్వదు. కాబట్టి అర్థ రాత్రి తప్పనిసరిగా మీకు ఐస్ క్రీం ఆకలి వేస్తుంది.

2. స్నేహితులు నవ్వుతుంటారు..

బయటకు వెళ్లినప్పుడు మిగిలిన ఆర్డర్ మొత్తం.. మీ స్నేహితులు ఇచ్చినా.. డెసర్ట్ ఆర్డర్ మాత్రం మీరే ఇస్తుంటారు. ఎందుకంటే డెసర్ట్ ఆర్డర్ మీకు నోటిపైనే ఉంటుంది. మీరు ఎఫ్పుడూ ఐస్ క్రీంలు మాత్రమే తింటుంటే.. మీ స్నేహితులు మిమ్మల్ని చూసి నవ్వుతుంటారు. కొంతమందైతే మీకు నిక్ నేమ్స్ కూడా పెట్టే ఉంటారు.

Shutterstock

3. పంటి నొప్పి తప్పదు..

ఇన్ని ఐస్ క్రీంలను ఇష్టంగా తింటుంటే పళ్ల పిప్పి, సెన్సిటివిటీ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు.. మీ దగ్గర మంచి రెమెడీ కూడా ఉంది. అదేంటంటారా? కోల్గేట్ సెన్సిటివ్ క్లోవ్ టూత్ పేస్ట్. దీనితో సెన్సిటివిటీ మాత్రమే కాదు.. పళ్ల పిప్పి కూడా మీ దగ్గరికి రాకుండా ఉంటుంది. పంటి నొప్పి అంటే ఏంటో కూడా మీకు తెలీనంతగా మీరు దాన్ని మర్చిపోతారు. మీకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీంని మీకు నచ్చినంతగా ఎంజాయ్ చేస్తారు.

హైదరాబాద్‌లో "సామాన్యుడి ఐస్ క్రీమ్" అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!

4.ఏ రెసిపీతోనైనా ఐస్ క్రీం తప్పనిసరి

జిలేబీ, గులాబ్ జామూన్, కేక్, ఫ్రెంచ్ ఫ్రైస్.. దేంతో అయినా సరే మీరు ఐస్ క్రీం జోడించుకుంటారు. ఒక్క జిలేబీకి రెండు స్కూప్ ఐస్ క్రీం జోడించి తినే మిమ్మల్ని.. అందరూ వింతగా చూస్తున్నా మీకు నచ్చినట్లుగా మీరు తినడమే మీకిష్టం. అంతేకాదు.. కూల్ డ్రింక్‌తో కూడా ఐస్ క్రీం తినడం మీకు ఇష్టం.

Shutterstock

5. అన్నివేళలా ఐస్ క్రీం

మీ మూడ్ ఎలా ఉన్నా సరే.. ఐస్ క్రీం తినడం తప్పనిసరి. సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. కోపంగా ఉన్నా.. ఫీలింగ్ ఏదైనా సరే.. దానికి సొల్యూషన్ ఐస్ క్రీం మాత్రమే. ప్రతి సమస్యలోనూ అదే మనకు తోడుండి.. మన బాధను తగ్గిస్తుంది. ప్రతి సంతోషంలో తోడుండి.. ఆనందాన్ని పెంచుతుంది.

మంచు ముక్కలు మీ బరువును.. ఎంత సులువుగా తగ్గించేస్తాయో తెలుసా?

6. ఫ్లేవర్ ఎంపికలో కన్ఫ్యూజన్ తప్పదు

చాలామంది అమ్మాయిలకు ఎలాంటి దుస్తులు ధరించాలో అర్థం కాదని అనుకుంటారు. కానీ మీ విషయంలో మాత్రం మీకు నచ్చిన ఐస్ క్రీం ఫ్లేవర్ ఏంటో తెలుసుకోవడమే కష్టం. స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, చాక్లెట్.. ఇలా ఫ్లేవర్ ఏదైనా రుచి మాత్రం అద్భుతం. ఫ్లేవర్ల గురించి మాట్లాడాలంటే మాత్రం బాస్కిన్ రాబిన్స్ గురించే చెప్పాలి. అక్కడున్నన్ని ఫ్లేవర్లు ఇంకెక్కడా ఉండవు. కొల్గేట్ వారి సాయంతో విడుదలైన క్లోవ్ క్యాండీ క్రష్ ఐస్ క్రీం ఐస్ క్రీం ఓసారి ప్రయత్నించి చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది.

shutterstock

7. షేరింగా? అస్సలు చేయను..

ఐస్ క్రీం ఒక్క స్కూప్ తినడం అంటే.. ఏంటో మీకు అస్సలు అర్థం కాదు. అంత ఇష్టమైన ఫుడ్ కొద్దిగా తింటే ఏం బాగుంటుంది? అదే మీ ఫీలింగ్ కూడా. ఒక స్కూప్ ఐస్ క్రీం తినడం అంటే ఐస్ క్రీంకి అన్యాయం చేసినట్లే. ఇక ఐస్ క్రీం విషయానికి వస్తే షేరింగ్ అంటే మీరు అస్సలు ఒప్పుకోరు. మీ స్నేహితులెవరైనా ఐస్ క్రీం షేర్ చేయమంటే వారితో గొడవ పెట్టుకోవడానికి కూడా సిద్ధమైపోతారు. కావాలంటే స్నేహం కట్ చేసుకుంటారు. కానీ ఐస్ క్రీం షేర్ చేసుకోవడానికి మాత్రం మీరు ఒప్పుకోరు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

మీ సెక్స్ లైఫ్ ని ఆనందంగా మార్చేందుకు ఈ ఆహారపదార్థాలు ఎంతో తోడ్పడతాయి..