మనలో చాలామంది అమ్మాయిలకు పెద్ద సమస్య నడుము, తొడలు (Thighs) లావుగా కనిపించడం.. సెల్యులైట్ తగ్గించడానికి.. తొడలు సన్నగా మారడానికి మనం రకరకాల పద్ధతులు పాటిస్తూనే ఉంటాం. కానీ ఎంత చేసినా ఆ కొవ్వు(Fat) అక్కడికే వెళ్లి ఎందుకు చేరుతుందో చాలామందికి అర్థం కాని ప్రశ్న.
అందుకే అటు తొడల భాగంలో కొవ్వును తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తూనే.. ఇటు లావు తగ్గేవరకూ కాస్త సన్నగా కనిపించేందుకు రకరకాల ఫ్యాషన్లను కూడా ప్రయత్నించవచ్చు. వీటి వల్ల సన్నగా కనిపించడంతో పాటు కొత్త లుక్ కూడా సొంతం చేసుకోగలుగుతాం. మరి, అలా మనల్ని స్లిమ్ అండ్ ఫిట్‌గా మారుస్తూ.. తొడ భాగాన్ని సన్నగా కనిపించేలా చేసే అవుట్ ఫిట్స్ గురించి తెలుసుకుందామా..
1. ఎ లైన్ డ్రస్సులు, స్కర్టులు
లావుగా ఉన్నవారు సన్నగా కనిపించాలనుకుంటే దానికి ఎ లైన్ దుస్తుల కంటే మంచివి ఇంకేవీ ఉండవేమో. కాస్త టైట్‌గా ఉండే మినీ, మిడీ స్కర్ట్స్ మన తొడలు లావుగా కనిపించేలా చేస్తే.. ఎ లైన్ దుస్తులు మాత్రం కింద లావుగా, వదులుగా కనిపించి.. మీ నడుముపై ఫోకస్‌ని పెంచుతాయి. మీరు కాస్త సన్నగా కనిపించేలా చేస్తాయి. అందుకే సన్నగా కనిపించాలి అనుకునేవారికి ఇవి బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవచ్చు.
2. లాంగ్ టాప్స్ వద్దు..
చాలామంది తాము లావుగా ఉన్నామన్న విషయాన్ని దాచేందుకు.. పొడుగ్గా ఉండే టాప్స్ ఎంచుకుంటూ ఉంటారు. అయితే పొడుగ్గా ఉన్నంతమాత్రాన వాటిలో మీరు సన్నగా కనిపిస్తారని చెప్పలేం. ఇది చాలామందికి ఉండే ఓ అపోహ మాత్రమే. మీ తొడలు మాత్రమే లావుగా ఉంటే.. ఇలాంటి లాంగ్ టాప్స్ ఎంచుకోవడం వల్ల అవి మిమ్మల్ని మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. వీటి బదులు సన్నగా ఉండే టాప్స్ వేసుకోవడం వల్ల.. మీరు కూడా సన్నగా కనిపించే వీలుంటుంది. అంతేకాదు.. మీ పైభాగానికి కింది భాగానికి మధ్య బ్యాలన్స్ కుదిరేలా చేసి.. మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి ఈ తరహా టాప్స్.
3. పొడుగు ప్యాంట్స్ ధరించండి..
తొడలు లావుగా ఉన్నా.. స్లిమ్‌గా కనిపించాలంటే పొడుగ్గా ఉన్న ప్యాంట్లు ధరించాల్సి ఉంటుంది. ఇలాంటి పొడుగాటి ప్యాంట్లు మీరు సన్నగా ఉన్నారని భ్రమించేలా చేస్తాయి. అందుకే మీ ప్యాంట్లు కాస్త పొడుగైతే వాటిని పైకి మడత పెట్టడం ఆపి కాలి మడమ వరకూ ఉండేలా చూసుకోండి.
4. పాయింటెడ్ షూలతో..
మీ కాళ్లు ఎలా కనిపిస్తున్నాయనేది మీ దుస్తులే కాదు.. చెప్పులపై కూడా ఆధారపడి ఉంటుంది. డిజైనర్, ఎంబ్రాయిడరీ లేదా కాస్త వెడల్పుగా ఉన్న షూ ధరించడం వల్ల మీరు మరింత లావుగా కనిపించే ప్రమాదం ఉంటుంది. కానీ సన్నగా పాయింటెడ్ హీల్స్ వేసుకుంటే కాళ్లు కాస్త సన్నగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఇవి మీ కాళ్లు మరింత పొడవుగా కనిపించేలా చేసి మీరు పొడవుగా ఉన్న ఫీలింగ్‌ని కూడా కలిగిస్తాయి.
5. అవుట్ ఫిట్స్‌తో మాయ చేయండి..
లావుగా ఉన్నవారు తమ శరీరాన్ని పట్టి ఉంచే దుస్తులు కాకుండా ఫ్లోయీ ఫ్యాబ్రిక్ దుస్తులు ధరిస్తే చాలా అందంగా కనిపిస్తారు. పల్చగా గాలికి ఎగురుతున్నట్లుగా ఉండే ఈ దుస్తులు మీరు ఎంత లావున్నారో బయటకు తెలియకుండా చేస్తాయి.
6. వైడ్ లెగ్ ప్యాంట్స్‌తో..
గత రెండేళ్ల నుంచి వెడల్పాటి ప్యాంట్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. పలాజోలు, షరారాలు.. ఇలా అందులో చాలా రకాలే ఉన్నాయి. ఈ ట్రెండీ ప్యాంట్లు మిమ్మల్ని ఫ్యాషనబుల్‌గానే కాదు.. సన్నగా కూడా కనిపించేలా చేస్తాయి. వీటిని బ్లోక్ హీల్స్ లేదా వెడ్జెస్‌తో మ్యాచ్ చేసి వేసుకుంటే సరి. పర్ఫెక్ట్ లుక్ మీ సొంతం అవుతుంది.
7. హై వెయిస్ట్ ప్యాంట్స్..
సిగరెట్ ప్యాంట్స్ ఎప్పుడూ అవుటాఫ్ ఫ్యాషన్ కావు. క్లాసీగా, స్టైలిష్‌గా ప్రతి శరీరతత్వానికి సరిపడేలా ఉంటాయి ఈ ప్యాంట్స్. స్కిన్నీ జీన్స్ వేస్తే కాళ్లు ఫిట్‌గా కనిపించినట్లే.. ఈ సిగరెట్ ప్యాంట్స్ ధరిస్తే సన్నగా, ఫిట్‌గా కనిపిస్తారు. అందులోనూ హై వెయిస్ట్ సిగరెట్ ప్యాంట్స్ ధరిస్తే మరింత స్లిమ్‌గా కనిపిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఫ్యాషనబుల్ వస్తువులు.. మీ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే..!
ఈ దుపట్టాలతో మీ బ్రైడల్ లుక్‌ని.. మరింత మెరిపించండి..!
31 రోజులు.. 31 హెయిర్‌స్టైల్స్.. నెలలో ప్రతిరోజూ కొత్తగా కనిపించండిలా..!
Images : Shutterstock