ADVERTISEMENT
home / Celebrity Life
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే ఏం చేస్తాను.. దీనికి సమాధానం చెప్పలేను : పూజా హెగ్డే

ప్రభాస్ ప్రపోజ్ చేస్తే ఏం చేస్తాను.. దీనికి సమాధానం చెప్పలేను : పూజా హెగ్డే

పూజా హెగ్డే (Pooja Hegde).. మూగముడి అనే తమిళ సినిమాతో తన కెరీర్  ప్రారంభించిన ఈ  సుందరి తెలుగులోనూ ‘ఒక లైలా కోసం, ముకుంద’ సినిమాలతో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. హిట్, ఫ్లాప్ అనే అంశంతో సంబంధం లేకుండా.. అగ్ర కథానాయకులందరితో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది  పూజ. తాజాగా మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’ సినిమాలో నటించిన ఆమె.. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురంలో’ కూడా నటించింది.

ఈ సినిమా ‘జనవరి 12’ తేదిన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీని తర్వాత ప్రభాస్‌తో (Prabhas)  కలిసి ‘జాన్’ అనే సినిమాలో నటించేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాగే ఈమె చేతిలో మరో మూడు భారీ చిత్రాలున్నాయట. వీటి వివరాలను త్వరలో వెల్లడిస్తానంటోందీ బ్యూటీ. ఇటీవలే ఓ బాలీవుడ్ న్యూస్ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. తాను నటించిన హీరోలతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది పూజ. అలాగే సోషల్ మీడియాలో ప్రేక్షకులు తనని అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చింది. 

1. అక్షయ్‌తో మీ వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి?

ADVERTISEMENT

అక్షయ్ సర్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మేం క్రికెట్, లుడో వంటి ఆటలు ఆడేవాళ్లం. తను చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎప్పుడూ ఒక దగ్గర ఉండలేరు. తనతో కలిసి షూటింగ్ అంటే.. అది షూటింగ్‌లా కాకుండా ఒక సరదా ఆటలా సాగిపోతుంది.

‘యువరాణి’గా మారిన ‘జిగేలు రాణి’ .. వైరల్ అవుతున్న పూజా హెగ్డే కొత్త లుక్

2. మహేష్ బాబుతో షూటింగ్ అనుభవం ఎలా ఉంది? మీరిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారు?

మహేష్ బాబు నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా వాయిస్ మాడ్యులేషన్ విషయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ఎక్కడ వాయిస్ తగ్గించాలో.. ఎక్కడ పెంచాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుంది. ఇక మీదట కూడా.. ఇద్దరం కలిసి పనిచేయాలనే కోరుకుంటున్నా.

ADVERTISEMENT

3. వరుణ్ ధావన్‌తో మీ పెయిర్ బాగుంటుందని భావిస్తున్నా.. మీరేమంటారు?

అవును.. మేమిద్దరం కలిస్తే అందమైన యంగ్ పెయిర్‌లా ఉంటాం. ఈ విషయాన్ని మీరే వరుణ్‌కి, దర్శకులకి చెప్పండి. తనతో సినిమా వస్తే ఒప్పుకుంటా.

4. శ్రద్ధా కపూర్ పై మీ అభిప్రాయం..

ADVERTISEMENT

తను చాలా అందంగా ఉంటుంది. ప్రెట్టీ గర్ల్

5. ఇప్పటి వరకూ మీరు చేసిన రోల్స్‌లో కష్టమైంది

నా కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో కష్టమైంది.. నేను ప్రస్తుతం ‘అఖిల్’తో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో నేను స్టాండప్ కమెడియన్‌గా కనిపిస్తాను. కామెడీ చేయడం నాకు చాలా కష్టం. అలాగే స్టాండప్ కామెడీ చేయడం మరీ కష్టం. మామూలుగా  కమెడియన్స్‌కి గంట సేపు సమయం ఉంటుంది. కానీ మేం మాత్రం పది నిమిషాల్లో చేయాలి. అది కూడా పది యాంగిల్స్‌లో చేయాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మీరు ఒక జోక్ రాసి ఇచ్చాక.. నేను దాన్ని చెబితే అంత బాగా రాదు. మీరు అనుకున్నట్లు నేను చేయలేను. కానీ నటిగా నేను అలా చేయాలి. మహిళలు రాసే కామెడీకి.. మగవారు రాసే కామెడీకి తేడా ఉంటుంది. అందుకే మహిళా కమెడియన్ల వద్ద కూర్చొని.. వారిని గమనించి ఈ పాత్రలో నటించా.

6.ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు?

ADVERTISEMENT

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ప్రభాస్, అఖిల్‌లతో సినిమాలు చేస్తున్నా. హిందీలో రెండు సినిమాలు ఒప్పుకున్నా.

7. మిమ్మల్ని ప్రభాస్ ప్రపోజ్ చేస్తే ఏం సమాధానమిస్తారు

అయ్యో.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ఇలాంటివాటికి సమాధానం చెప్పలేను. సినిమాలో అయితే ఫర్వాలేదు. కానీ ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు..? అన్నదాని వెనుక చాలా స్టోరీ ఉంటుంది.

ADVERTISEMENT

ఆ విషయంలో ప్రభాస్, నేను ఒకేలా ఆలోచిస్తాం : పూజా హెగ్డే

8. మరాఠీ సినిమాలో నటిస్తారా?

మంచి స్క్రిప్టు వస్తే ఏ భాషలో అయినా నటించేందుకు నేను సిద్ధం. నేను కేవలం బాలీవుడ్ నటిగా మాత్రమే కాకుండా.. ఇండియన్ సినిమా నటిగా చెప్పుకునేందుకు ఇష్టపడతాను. చాలామంది హిందీలో అవకాశాలు వస్తున్నా.. ఇంకా తెలుగు సినిమాల్లో ఎందుకు నటిస్తున్నావని అడుగుతారు. కానీ దక్షిణాదిలో అభిమానులు తమ ఫేవరెట్ స్టార్స్‌ని చాలా ఇష్టపడతారు. అభిమానులందరికీ దగ్గర కావడానికి భాష ముఖ్యం కాదని నా ఫీలింగ్.

9. సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తారా?

ADVERTISEMENT

నాకు సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి సినిమాలో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను.

10. మీ ఫేవరెట్ నెట్ ఫ్లిక్స్ షోస్ ?

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్.. డార్క్, నాకోస్ (ఇందులో మొదటి రెండు సీజన్లంటే నాకు చాలా ఇష్టం)

ADVERTISEMENT

11. షారూఖ్ సినిమాలో ఛాన్స్ వస్తే?

చాలా ఎక్సయిటింగ్‌గా ఫీలవుతాను. షారూఖ్, సల్మాన్, బచ్చన్ లాంటి వారితో నటించాలని నా కోరిక. అది ఇప్పటిలో తీరుతుందా?

12. మీకు ఎవరి ఫిట్‌నెస్ రొటీన్ అంటే ఇష్టం?

అక్షయ్ సర్ ఓ నింజా లాంటివారు. ఆయన చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. ఆయన చాలా ఫిట్. మనందరం ఫిట్‌గానే ఉంటాం. కానీ అందులో కొన్ని రకాలుంటాయి. ఆయన కేవలం ఒక సినిమా కోసం మాత్రమే కాదు.. తాను భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండేందుకు వర్కవుట్ కూడా చేస్తారు. నేనూ అలాంటిదాన్నే. నేను కూడా వారానికి ఆరు రోజులు వర్కవుట్ చేస్తాను.

ADVERTISEMENT

13. రామ్ చరణ్‌తో జిగేలు రాణి పాటలో నటించారు. తర్వాత ఏ సినిమాలో నటించనున్నారు?

రామ్ చరణ్, రాజమౌళి గారితో చేసే సినిమా పూర్తయ్యాక మేం సినిమా చేస్తామని ఆశిస్తున్నా..

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

03 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT