ADVERTISEMENT
home / Humour
వక్షోజాలు పెద్దగా ఉన్న అమ్మాయి.. ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీకు తెలుసా?

వక్షోజాలు పెద్దగా ఉన్న అమ్మాయి.. ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీకు తెలుసా?

సాధారణంగా అమ్మాయిలకు వక్షోజాలు (Boobs) పెద్దగా (big) ఉంటే అబ్బాయిలకు నచ్చుతుందని చాలామంది చెబుతుంటారు. అంతేకాదు.. రొమ్ముల సైజ్ చిన్నగా ఉన్నవారు కూడా పెద్దగా ఉన్నవారి వైపు చూస్తూ.. తమకూ అలాంటి వక్షోజాలు ఉంటే బాగుండునని అనుకుంటారు. కానీ రొమ్ములు పెద్దగా ఉన్నవారికి కూడా చాలా కష్టాలే ఉంటాయి. ఛాతిపై కొన్ని కేజీల అదనపు బరువు మోయడం మాత్రమే కాదు.. ఇతరులు తమ వైపు కళ్లప్పగించి చూడకుండా స్తనాలను కవర్ చేసుకోవడానికి వాళ్లు చాలా ఇబ్బందులే పడాలి.

రొమ్ములు కాస్త పెద్దగా ఉంటే చాలు.. మిగిలిన శరీరం ఎలా ఉన్నా ప్లస్ సైజ్ దుస్తులే కొనుగోలు చేయాలి. మిగిలిన మొత్తం శరీరానికి లూజ్‌గా ఉండే దుస్తులు.. వక్షోజాలు ఉన్న ప్రదేశంలో మాత్రం టైట్‌గా కనిపిస్తాయి. అందుకే చాలామంది తమ పెద్ద సైజు స్తనాలను ఇష్టపడరు. వాటి వల్ల కలిగే సమస్యల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కేవలం సి సైజ్ లేదా పెద్ద సైజ్ స్తనాలున్నవారికి మాత్రమే అర్థమయ్యే ఈ సమస్యల గురించి ఓసారి తెలుసుకోండి.

giphy

ADVERTISEMENT

1. రొమ్ముల సైజ్ కాస్త పెద్దగా ఉండడమేమో కానీ.. అన్నీ ప్లస్ సైజ్ దుస్తులే తీసుకోవాలి. నచ్చిన ఫ్యాషన్స్‌లో అస్సలు టాప్స్ దొరకవు. ఇక స్లీవ్ లెస్, స్ట్రాప్ లెస్ లాంటివి అస్సలు వేసుకోలేం. ఎప్పుడూ నిండుగా కప్పుకునే దుస్తులే తీసుకోవాలి.

2. మాకు నచ్చిన మోడల్ బ్రాలు.. మా సైజ్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండవు. వాటిని వెతకడం అంటే సముద్రంలో ముత్యాన్ని వెతికినట్లే. చిన్న సైజ్‌లో చూస్తే ఎన్నో చక్కటి క్యూట్ బ్రాలు కనిపిస్తాయి. అవన్నీ చూసినప్పుడు ఎందుకిలా పుట్టామా? అనిపిస్తుంది.

3. పొట్టపై పడుకోవడం అంటే ఏంటో మీకు తెలుసా? మాకు తెలీదు. ఎందుకంటే అలా పడుకుంటే రొమ్ములు నొప్పి పుడతాయి.. అలాగే  అసౌకర్యంగా అనిపిస్తుంది కాబట్టి.. అలా పడుకోలేం.

నగ్నంగా నిద్ర పోతే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా?

ADVERTISEMENT

Giphy

4. మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా నెమ్మదిగా వెళ్లాల్సిందే. లేదంటే ఛాతి భాగాన్ని పట్టుకొని మరీ పరిగెత్తాల్సి ఉంటుంది. రొమ్ములు అంతలా ఊగుతాయి మరి.

5. ఇతరులు వేసుకున్నప్పుడు అది సాధారణ నెక్ లైన్‌గానే కనిపిస్తుంది. అదే మనం వేసుకుంటే మాత్రం చాలా సెక్సీగా, అందాల ఆరబోతలా కనిపిస్తుంది.

ADVERTISEMENT

6. బటన్లతో కూడిన షర్ట్స్ వేసుకోవడం కూడా కష్టమే. అవి నడుము దగ్గర లూజ్‌గా ఉన్నా.. ఛాతి భాగానికి వచ్చేసరికి వక్షోజాలు పెద్దగా ఉండడం వల్ల షర్ట్ టైట్‌గా మారుతుంది. ఇలాంటప్పుడు నడుము దగ్గర మీడియం, ఛాతి దగ్గర లార్జ్ సైజ్ ఉన్న షర్ట్స్ కొనాలనుపిస్తుంది. కానీ అలాంటివి దొరకవు కదా..

Giphy

7. పెద్ద వక్షోజాలు ఉన్నవారిలో చాలామంది ఇప్పటికి బ్రాతో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక్కోసారి బ్రా స్ట్రాప్ తెగిపోతే మరికొన్నిసార్లు మాత్రం అండర్ వేర్ గుచ్చుకుంటూ ఉంటుంది.

ADVERTISEMENT

8. పుషప్ బ్రాలు, స్ట్రాప్‌లెస్ బ్రాలు వేసుకోవడం అంటే ఏంటో కూడా మాకు తెలీదు. వక్షోజాలు పెద్దగా ఉండడం వల్ల.. ఇలాంటి వేసుకోవడం వల్ల ఎక్కడ ఊడిపోతాయో లేక ఎవరైనా వింతగా చూస్తారేమోనన్న అనుమానం వెంటాడుతుంది.

9. వ్యాయామం చేయడానికి వెళ్లాలంటే చాలా భయం వేస్తుంది. ఒక్కోసారి ఒకటికి బదులు రెండు స్పోర్ట్స్ బ్రా వేసుకున్నా సపోర్ట్ లేక వూగుతూనే ఉంటాయి.

10. పెద్ద నెక్లెస్‌లు, లాంగ్ చైన్లు, సీట్ బెల్ట్స్ రెండు వక్షోజాల మధ్య ఉండిపోతాయి. అది చూసేవాళ్లకే కాదు.. మాక్కూడా ఇబ్బందిని కలిగిస్తుంది.

ADVERTISEMENT

Giphy

బ్యాక్లెస్ డ్రస్ ధరించినప్పుడు.. స్టిక్కీ బ్రా వేసుకోవడమే మంచిది..!

11. బ్రా లేకుండా గడపడం అంటే ఏంటో కూడా మాకు తెలీదు. కేవలం బాత్రూంలో తప్ప.. ఇంకెక్కడా బ్రా లేకుండా ఉన్నట్లు మాకు గుర్తుండదు.

12. చెమట.. సాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే.. కానీ వక్షోజాలు పెద్దగా ఉండడం వల్ల వాటి కింద భాగంలో చెమట ఎక్కువగా పట్టి నల్లగా మారుతుంది. ఈ సమస్య కేవలం వేసవిలోనే కాదు.. చలికాలంలో కూడా ఉంటుంది తెలుసా?

ADVERTISEMENT

13. డబుల్ బ్రెస్ట్.. ఈ పదం అంటే మాకెంత చిరాకో.. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలని ఎప్పటికప్పుడు కొత్త బ్రాలు కొంటున్నా సరే. వేసుకున్న కొంత సమయానికి అందులోంచి కూడా సగం బయటపడేందుకు మా స్తనాలు ప్రయత్నిస్తుంటాయి. సగం బయట సగం లోపల ఉండి డబుల్ బ్రెస్ట్ లా కనిపిస్తుంది. ఇక టీషర్ట్ వంటివి వేసుకుంటే ఇవి అందరికీ కనిపిస్తాయి కూడా.

14. అవి మన ఐడెంటిటీలో భాగం అయిపోతాయి. పెద్ద రొమ్ములు ఉండేవాళ్లను ఎవరినైనా చూస్తే మన స్నేహితులకు మనమే గుర్తొస్తాం మరి..

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT

బ్రా గురించి ఈ అపోహ‌లు మీకూ ఉన్నాయా? అయితే అస‌లు నిజాలు తెలుసుకోండి..

29 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT