బ్యాక్లెస్ డ్రస్ ధరించినప్పుడు.. స్టిక్కీ బ్రా వేసుకోవడమే మంచిది..!

బ్యాక్లెస్ డ్రస్ ధరించినప్పుడు.. స్టిక్కీ బ్రా వేసుకోవడమే మంచిది..!

మనం ధరించే దుస్తులకు తగిన విధంగా మనం ధరించే లోదుస్తులు ఉండాలని మనకు తెలిసిందే. అయితే మనం వేసుకొనే డ్రస్‌కి తగిన బ్రాను ఎంపిక చేసుకోవడం కూడా కష్టమైనదేనని కూడా తెలుసు. అందులోనూ హాల్టర్ టాప్స్, బ్యాక్ లెస్ డ్రసెస్, లోనెక్ బ్లౌజులు వేసుకొన్నప్పుడు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఆ సమయంలో ఎలాంటి బ్రా లేదా లోదుస్తులు వేసుకోవాలో తెలియదు. డోంట్ వర్రీ, ఇప్పుడు స్టిక్కీ బ్రాతో ఆ సమస్యను అధిగమించవచ్చు.


స్టిక్కీ బ్రా అంటే ఏంటి?


సాధారణంగా మనం బ్రాలను ఎందుకు వేసుకొంటాం? అవి మన వక్షోజాలకు సపోర్ట్ ఇవ్వడంతో పాటు.. అవి సాగిపోకుండా ఉండేలా చేస్తాయి. అంతేకాదు.. మన శరీరం పర్ఫెక్ట్ షేప్‌లో ఉండేలా బ్రా తోడ్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం ధరించిన దుస్తులకు తగినట్లుగా బ్రా ధరించకపోతే.. అది బయటకు కనిపించి మన లుక్ మొత్తం పోతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో స్టికీ బ్రా (Sticky bra) ఉఫయోగిస్తే.. బాగుంటుంది. దీన్నే స్టిక్ ఆన్ బ్రా(stick on bra) లేదా అదెసివ్ బ్రా (adhesive bra) అని కూడా పిలుస్తారు.


సాధారణంగా వీటిని సిలికాన్, పాలీయురేథేన్ వంటి మెటీరియల్‌తో తయారుచేస్తారు. ఇవి బ్యాక్లెస్, స్ట్రాప్ లెస్, ఆఫ్ షోల్డర్ లేదా మీ వీపు భాగం ఎక్కువగా రివీల్ అయ్యే దుస్తులు ధరించినప్పుడు స్టిక్కీ బ్రా ధరించవచ్చు. ఇది మనం రోజూ ధరించే సాధారణమైన బ్రా మాదిరిగానే వక్షోజాలకు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాదు.. మీకు పర్ఫెక్ట్ షేప్ ఇస్తుంది. అయితే దీని పనితీరు ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది. కానీ ఇది కచ్చితంగా వర్కవుట్ అవుతుంది.


రెగ్యులర్ బ్రా కంటే స్టిక్కీ బ్రా ఎలా మెరుగైంది?


మనం రెగ్యులర్‌గా ధరించే బ్రా మనకు బ్రెస్ట్స్‌కి కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో దాని వల్ల అసౌకర్యంగా అనిపిస్తుందనేది మాత్రం వాస్తవం. వీటి కారణంగానే.. కొన్ని సందర్భాల్లో మనం కొన్నిరకాల దుస్తులకే పరిమితమవ్వాల్సి వస్తుంది. ‘ఈ డ్రస్ కొంటే.. మన లోదుస్తులు బయటకు కనిపిస్తాయేమో’ అనే భయంతో.. బాగా నచ్చిన ఫ్యాషనబుల్ దుస్తులను సైతం పక్కన పెట్టేసేవారే ఎక్కువ మంది ఉంటారు. అంతేకాదు.. కొన్నిసార్లు బ్రా స్ట్రాప్స్ మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఎంత సర్దుకొన్నా.. అవి మళ్లీ మళ్లీ బయటకు వచ్చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఈ స్ట్రాప్స్ వల్ల ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. అంతేకాదు.. రెగ్యులర్ బ్రా హుక్స్ వల్ల కూడా కొన్నిసార్లు గాయాలయ్యే అవకాశం ఉంటుంది.


స్టిక్ ఆన్ బ్రా వల్ల ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పైగా ఎన్నో ప్రయోజనాలున్నాయి.


 • రాంగ్ సైజ్ బ్రా ధరించడం వల్ల మనకు బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. కానీ స్టిక్ ఆన్ బ్రా ధరిస్తే ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఎందుకంటే.. ఇవి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పైగా ఇవి మనం అతికించుకొన్న చోటే ఉండటం మాత్రమే కాదు.. చాలా సౌకర్యవంతంగానూ ఉంటాయి. మనం రోజూ ధరించే బ్రా కాస్త టైట్‌గా ఉంటే.. బ్రెస్ట్ కింది భాగంలో కూడా ర్యాషెస్ ఏర్పడతాయి. కానీ స్టిక్కీ బ్రాతో ఆ సమస్యే ఉండదు


 


 • వక్షోజాల పరిమాణం ఎక్కువగా ఉన్నవారు తమకు నడుము నొప్పి వస్తుందని తరచూ చెబుతుంటారు. దీనికి వక్షోజాల పరిమాణం కారణం కాదు. మనం ధరించే బ్రా కారణం కావచ్చు. భుజాలపై బ్రా స్ట్రాప్స్ నిరంతరం కలిగించే ఒత్తిడి కారణంగా నడుమునొప్పి వచ్చే అవకాశాలున్నాయి. అందుకే రెగ్యులర్ బ్రాకి బదులుగా.. అదెసివ్ బ్రా ఉపయోగిస్తే.. వక్షోజాలకు మంచి సపోర్టు లభించడంతో పాటు మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది.


 


 • సాధారణంగా బ్రాలు వక్షోజాలను పైకి వచ్చేలా డిజైన్ చేస్తారు. అయితే దీనివల్ల అవి స్టిఫ్‌గా ఉండేలా చేసే కండరం సహజమైన పనితీరు దెబ్బతింటుంది. స్టిక్కీ బ్రాతో ఇలాంటి సమస్యే ఉండదు. ఇవి వక్షోజాలను సాగిపోకుండా చూడటంతో పాటు.. వాటి కండరాల సహజపనితీరును దెబ్బ తీయవు.


 


 • సాధారణ బ్రాల వల్ల ఎదురయ్యే మరో ఆరోగ్య సమస్య లింఫ్ నోడ్ బ్లాకింగ్. బిగుతుగా ఉన్న బ్రా వేసుకోవడం వల్ల వక్షోజాలనుంచి లింఫాటిక్ ఫ్లూయిడ్ బయటకు వెళ్లదు. దీని కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అదే స్టిక్ ఆన్ బ్రా వేసుకోవడం వల్ల ఈ సమస్య అసలు ఎదురవదు.


 


 • మనం ధరించే సాధారణ బ్రా వల్ల కలిగే మరో ఇబ్బంది.. నిటారుగా కూర్చోలేకపోవడం. ఈ రెండింటికీ మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు కదా. కానీ ఇది నిజం. ఎందుకంటే మనం ధరించే బ్రాల కారణంగా.. వక్షోజాల భారం భుజాలపై పడుతుంది. దీనివల్లే మనం ముందుకు వంగిపోయినట్లుగా కూర్చుంటాం. స్టిక్కీ బ్రాతో ఈ సమస్య ఎదురవదు. అయితే ఈ బ్రా ధరించగానే ఒక్కసారిగా మన శరీరంలో మార్పు వచ్చేయదు. ఎందుకంటే.. కొన్ని సంవత్సరాలుగా వంగి కూర్చోవడానికి అలవాటు పడ్డాం కాబట్టి. దానిలో మార్పు వచ్చి నిటారుగా కూర్చోవడానికి కొంత కాలం పడుతుంది.


మనదేశంలో లభించే బెస్ట్ స్టిక్ ఆన్ బ్రాల వివరాలు


ఎన్-గాల్ న్యూడ్ లైట్లీ ప్యాడెడ్ స్టిక్-ఆన్ పుషప్ బ్రా


1-sticky-bra-n-gal


ఈ న్యూడ్ పుషప్ బ్రా కచ్చితంగా మీ వార్డ్ రోబ్‌లో ఉండాల్సిందే. రాబోయే వేసవి కాలంలో మనం ధరించే సమ్మర్ డ్రసెస్ పై ధరించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.


ధర: రూ 1099


డిస్కౌంట్ ధర: రూ 659


ఇక్కడ కొనండి.


క్వుట్టోస్ బ్లాక్ సాలిడ్ నాన్-వైర్డ్ లైట్లీ ప్యాడెడ్ స్టిక్-ఆన్ బ్రా


2-sticky-bra-quottos-black


ఈ స్టిక్ ఆన్ బ్రా 40% కాటన్, 60% పాలియెస్టర్‌తో తయారైంది. ప్లంజింగ్ నెక్ లైన్ టాప్స్, డ్రెసెస్ వేసుకొన్నప్పుడు దీన్ని ధరించడానికి అనువుగా ఉంటుంది. దీన్ని బాడీ ఫిట్ డ్రస్ వేసుకొన్నప్పుడు సైతం దీన్ని ధరించవచ్చు.


ధర: రూ 849


డిస్కౌంట్ ధర: రూ 524


ఇక్కడ కొనండి.


ప్రెట్టీ క్యాట్ బీగీ సాలిడ్ నాన్-వైర్డ్ లైట్లీ ప్యాడెడ్ స్టిక్ ఆన్-బ్రా


3-sticky-bra-pretty-cat


సెక్సీ క్లీవేజ్ లుక్ కోసం.. ఈ స్టిక్ ఆన్ బ్రాని ఉపయోగించవచ్చు. పైగా ఈ బ్రా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పార్టీవేర్ దుస్తుల కింద దీన్ని ధరించవచ్చు.


Pro Tip: తెలుపు రంగులో ఉన్న బ్రాల కంటే.. న్యూడ్ కలర్స్‌లో ఉన్న బ్రాలను కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే.. మనం ఎంత డార్క్ కలర్ దుస్తులు వేసుకొన్నా.. వైట్ కలర్ బ్రా కనిపిస్తుంటుంది. అదే న్యూడ్ కలర్ బ్రా అయితే మన శరీరం రంగులో కలిసిపోతుంది.


ధర: రూ 1499


డిస్కౌంట్ ధర: రూ 524


ఇక్కడ కొనండి.


ఎన్-గాల్ పింక్ లైట్లీ ప్యాడెడ్ స్టిక్-ఆన్ పుష్-అప్ బ్రా


4-sticky-bra-n-gal-pink


స్టిక్ ఆన్ బ్రాలు ఎప్పుడూ న్యూడ్ కలర్ లేదా బ్లాక్‌లోనే ఉండాలా? ఫ్యాన్సీగా ఉండకూడదని ఎవరన్నారు? తెలుపు, పింక్ రంగు కాంబినేషన్లో ఉన్న ఈ లేసీ స్టిక్ ఆన్ బ్రా చాలా ఫ్యాన్సీగా ఉంది కదా.


ధర: రూ 999


డిస్కౌంట్ ధర: రూ 799


ఇక్కడ కొనండి.


హంక్మోల్లర్ స్టిక్ ఆన్ బ్రా


4-sticky-bra-hunkemoller


సాఫ్ట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఈ బ్రా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.


ధర: రూ 2,195


ఇక్కడ కొనండి.


స్టిక్కీ బ్రాలను శుభ్రం చేసుకోవడం ఎలా?


మీ అదెసివ్ బ్రాను శుభ్రంగా ఉండటంతో పాటు.. అవి ఎక్కువ కాలం మన్నాలంటే.. ఈ చిట్కాలను పాటించండి.


 • బ్రాను ఉపయోగించిన ప్రతిసారి వేడి నీటితో హ్యాండ్ వాష్ వేసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల బ్రాపై చేరిన చెమట, మురికి., జిడ్డు వదలిపోతాయి.

 • బ్రాలో చేరిన మురికిని ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అవి ఎక్కువ కాలం మన్నేలా చేసుకోవచ్చు. సాధారణంగా ఇవి సిలికాన్ తో తయారవుతాయి కాబట్టి.. వాటిని శుభ్రం చేయడం చాలా సులభం.

 • స్టిక్కీ బ్రాను సమతలంగా ఉన్న చోట ఆరేయాల్సి ఉంటుంది. లేదంటే అవి షేపవుట్ అయిపోతాయి. టేబుల్ మీద లేదా కౌంటర్ టాప్ పై ఆరేయాలి. బ్రా స్టిక్కీ సైడ్ పై వైపు ఉండేలా ఆరబెట్టాలి. అలాగే వాటిని పిండడం, బాగా రుద్దడం వంటివి చేయకూడదు.


Also Read: ఈ 9 రకాల బ్లాక్ ఫ్యాషన్ ఐటమ్స్.. ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే..


స్టిక్ ఆన్ బ్రాను ఎంతకాలం వరకు ఉపయోగించవచ్చు?


మనం ధరించే దుస్తుల మాదిరిగానే.. స్టిక్ ఆన్ బ్రా కూడా కొంతకాలం ఉపయోగించిన తర్వాత పాడైపోతుంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, ఆరబెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దాన్ని భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం మంచిది.


ముఖ్యంగా బ్రాకు వీటిని అతికించుకొనే వైపున ఎలాంటి దుమ్ము, మురికి చేరకుండా చూసుకోవాలి. దీనికోసం బ్రా కొనే సమయంలోనే ఇచ్చిన షీట్ ఉపయోగించాల్సి ఉంటుంది. వేడి, ఎండ వంటివి ఈ బ్రాకు తగలకుండా చూసుకోవాలి. వేడి తగలడం వల్ల సిలికాన్ పాడైపోతుంది. ఫలితంగా ఈ బ్రా ధరించడానికి వీల్లేకుండా అయిపోతుంది.


వక్షోజాల పరిమాణం ఎక్కువగా ఉన్నవారు వీటిని ధరించవచ్చా?


స్టిక్కీ బ్రాల గురించి మీరు తెలుసుకోగానే.. మీ మదిలో మెదిలే ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి. వీరికి సరిగ్గా నప్పే బ్రాను ఎంపిక చేసుకోవడం కష్టం. అలాగని.. వీరికి సరిపోయే స్టిక్కీ బ్రా అసలు దొరకదని కాదు. వీరికి సరిపోయేవి దొరకడం అంత సులభం కాదు. సాధారణంగా వక్షోజాల పరిమాణం ఎక్కువగా ఉన్నవారికి స్ట్రాప్స్ వెడల్పుగా ఉన్నవి, మందపాటి బాండ్స్ ఉన్నవి, కప్ స్టైల్లో ఉండే బ్రాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవేమీ అదెసివ్ బ్రాలో ఉండవు.


కానీ.. ఇవి మీ వక్షోజాలకు అవసరమైన సపోర్ట్ ఇస్తాయి. వీటిని ధరించడం వల్ల స్ట్రాప్ బయటకు కనిపిస్తుందేమోననే భయం ఉండదు. అలాగే మీకు నచ్చిన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించవచ్చు. అయితే ఇవి దొరుకుతాయా? అనే సందేహం వద్దు. ఎందుకంటే.. Hunkemoller, Zivame వంటి బ్రాండ్స్  A నుంచి DD సైజ్ వరకు అందిస్తున్నాయి.


ఎలాంటి దుస్తులు ధరించినప్పుడు స్టిక్కీ బ్రా వేసుకోవాలి?


హాల్టర్ డ్రస్


5-sticky-bra-halterbra


Image Source: Instagram


హాల్టర్ డ్రస్ బ్యాక్ డీప్‌గా ఉండి.. రెగ్యులర్ బ్రా వేసుకొన్నప్పుడు బ్యాక్ స్ట్రాప్ కూడా బయటకు కనిపిస్తుందనుకొంటే.. స్టిక్ ఆన్ బ్రా ధరించవచ్చు.


బ్యాక్ కట్ అవుట్ డ్రస్/రాంపర్


6-sticky-bra-romper


Image Source: Instagram


బ్యాక్ కట్ అవుట్ డ్రస్ వేసుకొన్నప్పుడు మీ వీపు భాగం కనిపిస్తుంది. ఇలాంటప్పుడు రెగ్యులర్‌గా మనం ధరించే బ్రా వేసుకొంటే.. చూడటానికి అంత బాగోదు. అందుకే ఇలాంటి సమయాల్లో స్టిక్ ఆన్ బ్రా వేసుకోవడం మంచిది.


ప్లంజింగ్ నెక్ లైన్


7-sticky-bra-plunging-neckline


Image Source: Instagram


ఇలాంటి టాప్ లేదా డ్రస్ వేసుకొన్నప్పుడు ప్లంజింగ్ స్టిక్కీ బ్రా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్లంజింగ్ నెక్ లైన్ బాగా డీప్‌గా ఉంటుంది కాబట్టి.. కొన్ని సార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవచ్చు.అందుకే ప్లంజింగ్ బ్రా వేసుకోవాల్సి ఉంటుంది.


నేక్డ్ డ్రస్


8-sticky-bra-nacked-dress-khushi-kapoor


Image Source: Instagram


నేక్డ్ డ్రస్ వేసుకోవాలంటే.. కాస్త ఇబ్బందే. ఎందుకంటే.. సరైన బ్రా వేసుకోకపోతే.. చూడటానికి అంత బాగోదు. మనం వేసుకొన్న బ్రా స్ట్రాప్స్ బయటకు కనిపిస్తే.. ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే ఇలాంటి డ్రస్ ధరించినప్పుడు స్టిక్ ఆన్ బ్రా వేసుకోవడం మంచిది. దీనికోసం సీమ్లెస్ స్కిన్ కలర్ బ్రా ఎంచుకోవాల్సి ఉంటుంది.


ఆఫ్-షోల్డర్ టాప్


9-sticky-bra-croptop


Image Source: Instagram


ఆఫ్ షోల్డర్ టాప్, బ్లౌజ్‌లు లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి ధరించినప్పుడు స్ట్రాప్ లెస్ బ్రా వేసుకోవచ్చు. కానీ దీనివల్ల  చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు దీనివల్ల చర్మంపై ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే దాని బదులుగా స్టిక్ ఆన్ బ్రా వేసుకోవడం మంచిది.


Also Read: బాలీవుడ్ భామలు ధరించిన.. ఈ బ్లౌజ్ డిజైన్లు మనకూ బాగుంటాయి


బ్యాక్ లెస్ టాప్


10-sticky-bra-backess-top


Image Source: India.com


బ్యాక్ లెస్ టాప్ వేసుకొన్నప్పుడు ధరించడానికి వీలుగా ఉండే ఒకే ఒక్క బ్రా స్టిక్కీ బ్రా. అవి మీ వక్షోజాలకు సపోర్ట్ ఇవ్వడంతో పాటు వాటిని కవర్ చేస్తుంది.


స్టిక్కీ బ్రా ధరించేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి


 • స్టిక్కీ బ్రా ధరించే ముందు మీ బ్రెస్ట్స్ పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. అప్పుడే అది సరైన స్థానంలో నిలిచి ఉంటుంది.


 


 • ఈ బ్రా మీ చర్మతత్వానికి సరిపోతుందో లేదో ఓసారి చెక్ చేసుకోండి. సాధారణంగా ఈ విషయం వాటి బాక్స్ పై ఉంటుంది. కాబట్టి ముందుగానే పరిశీలించి తీసుకోండి. లేదంటే.. స్టిక్కీ బ్రా మధ్యలోనే ఊడిపోయే అవకాశం ఉంది.


 


 • బాడీ లోషన్ రాసిన తర్వాత స్టిక్కీబ్రాను ధరించకూడదు. ఎందుకంటే.. దీనివల్ల బ్రా స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది.


 


 • స్టిక్కీ బ్రాను సరిగ్గా అమర్చుకోవాలి. ఎందుకంటే.. అది మీ బ్రెస్ట్స్, బాడీ షేప్ ను సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీనికోసం ముందుగా బ్రా క్లాస్ప్ ను విడదీయాలి.  బ్రా కప్ ను వక్షోజాలకు అతికించేటప్పుడు ఒకేసారి స్టిక్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ మళ్లీ తీసి పెడితే సరిగ్గా స్టిక్ అవ్వకపోవచ్చు.


 


 • ఒక కప్ ను అతికించిన తర్వాత రెండో కప్ అతికించాల్సి ఉంటుంది. ఇలా చేసేటప్పుడు అవి సరైన స్థానంలో ఉండేలా చూసుకోవాలి. లేదంటే.. ఈ స్టిక్ బ్రా మీ వక్షోజాలకు అవసరమైన సపోర్ట్ ఇవ్వలేదు. దీనివల్ల అవి సాగినట్లుగా కనిపిస్తాయి. కప్స్ ను స్టిక్ చేసిన తర్వాత రెండింటికీ కలిపి క్లాస్ప్ పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల బ్రెస్ట్స్ కి అవసరమైన సపోర్ట్ లభిస్తుంది.


 


 • బ్రా ధరించిన తర్వాత అది సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.


 


 • బ్రాను తీసేటప్పుడు నెమ్మదిగా తీయడానికి ప్రయత్నించండి. ఒక్కసారిగా లాగేస్తే దానికున్న జిగురు పోయే అవకాశం ఉంది.


స్టిక్కీ బ్రాను ధరించడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన సమస్యలు


స్టిక్కీ బ్రాను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ దానివల్ల కూడా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


 • స్కిన్ ఇరిటేషన్: కొన్నిసార్లు సిలికాన్ కప్స్ నాసిరకం మెటీరియల్ తో తయారవుతాయి. వీటివల్ల చర్మంపై ర్యాషెస్, దురద వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్రాకు ఉన్న జిగురు వల్ల కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.


 


 • శ్వాసక్రియ మందగించడం: సిలికాన్ వల్ల శ్వాసక్రియ మందంగా జరుగుతుంది. తరచూ దీన్ని ధరించడం వల్ల శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.


 


 • చెమట, మురికి కారణంగా.. బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. స్టిక్కీ బ్రా తీసిన వెంటనే శుభ్రం చేసుకోవడం మంచిది.


కాబట్టి అమ్మాయిలు.. తగిన జాగ్రత్తలు తీసుకొని స్టిక్కీ బ్రాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ధరించండి.


Also Read: మీరు మెచ్చే మీకు నచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు మీకోసం


తరచూ అడిగే ప్రశ్నలు


వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చా?


కొన్నిసార్లు ఉపయోగించిన తర్వాత స్టిక్కీ బ్రాకున్న జిగురు పోయే అవకాశం ఉంటుంది. అయితే వాటిని శుభ్రం చేసే విషయంలో, భద్రపరిచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు.


ఈ బ్రాను ఎలా ధరించాలి?


బ్రా లోపలి వైపు అదెసివ్ గ్లూ ఉంటుంది. దీని వల్లే బ్రా కప్స్ వక్షోజాలకు అతుక్కొని ఉంటుంది. అవసరమైతే దీన్ని మీరు టైట్ కూడా చేసుకోవచ్చు.


ఇవి పుషప్ బ్రా మాదిరిగా పనిచేస్తాయా?


స్టిక్ ఆన్ బ్రా పుషప్ బ్రా మాదిరిగా పనిచేయదు. ఎందుకంటే దీనికి స్ట్రాప్స్ ఉండవు. బ్యాక్లెస్‌గా ఉంటుంది. అయితే వీటిలో లైట్లీ ప్యాడెడ్ బ్రాలు మనకు లభ్యమవుతాయి. వీటిని మీరు సరిగ్గా వేసుకొన్నట్లయితే.. మీ బ్రెస్ట్స్‌ను కొద్దిగా పైకి పుష్ చేస్తాయి.


Featured Image: Shutterstock