రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో 1990లో తెరకెక్కిన చిత్రం “క్షణక్షణం” (Kshanam Kshanam). వెంకటేష్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో “జాము రాతిరి జాబిలమ్మ” పాట.. ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో మనకు తెలియంది కాదు. కీరవాణి స్వరాలు సమ కూర్చిన ఈ పాట.. అలాగే “క్షణక్షణం” చిత్రం ఈ రోజుతో 29 ఏళ్లు పూర్తి చేసుకొని.. 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. యువతరం గాయనీ గాయకులు అందరూ ఒక ట్రిబ్యూట్ రూపంలో.. అదే పాటను కొత్తగా ఆలపించి.. అందరి మనసులను దోచుకున్నారు.
అంతే కాదు.. కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌లో చిత్రీకరించిన విజువల్స్‌తో.. వేల్ రికార్డ్స్ ద్వారా పాటను రీమిక్స్ చేశారు. ఒకప్పుడు ఎస్పీ బాలు, చిత్రలు ఆలపించిన అదే పాట కొత్త వెర్షన్‌ను హేమచంద్ర, కాలభైరవ, మనీష, దీపు, దామిని, మౌనిమ, శ్రుతి, నోయల్ సీన్, పృథ్వీ చంద్రలు ఆలపిచడం విశేషం. ఈ సింగర్స్ అందరూ కూడా ప్రస్తుతం కీరవాణి టీంలో పనిచేస్తుండడం విశేషం.
నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే..!
ఆ పాట పూర్తి లిరిక్స్ మీకోసం
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరోలోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ నిదరతో నిషారాణి నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన.. ఆహా
స్వరాల ఊయలూగు వేళ..
పాట పాడి సర్‌ప్రైజ్ చేశాడు.. నెచ్చెలి మనసు దోచేశాడు..!
ఒక రకంగా చెప్పాలంటే ఈ సాంగ్ క్రెడిట్ కీరవాణికి (Keeravani) దక్కినా.. అంత అద్భుతమైన లిరిక్స్‌ను అందించిన.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముఖ్యంగా పదాల కూర్పు.. అందులోని భావుకత ఆయనకు ఆయనే సాటి అని మరోసారి నిరూపించాయి.
“క్షణక్షణం” చిత్రానికి స్వరాలు సమకూర్చిన కీరవాణి కూడా.. ఆ సినిమాకి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. కీరవాణికి “క్షణక్షణం” చిత్రం తర్వాత హిందీలో కూడా లెక్కలేనన్ని అవకాశాలు దక్కాయి.
ఎం.ఎం.క్రీమ్‌గా బాలీవుడ్‌కి పరిచయమైన కీరవాణి అక్కడ కూడా తిరుగులేని హిట్స్ ఇచ్చారు. జక్మ్, జిస్మ్, సుర్, క్రిమినల్, రోగ్, పహేలీ లాంటి చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందించారు.
చక్కటి చెలిమి సంతకం..ఈ మహర్షి మొదటి పాట..ఛోటీ ఛోటీ బాతే..!
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.