ADVERTISEMENT
home / Health
ఓ బాటిల్ నీరు.. మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుందంటే నమ్ముతారా? (Benefits Of Drinking Water)

ఓ బాటిల్ నీరు.. మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుందంటే నమ్ముతారా? (Benefits Of Drinking Water)

శరీర అవసరాలకు సరిపడినంత నీరు మనం రోజూ తాగుతూ ఉండాలి. ఇది తరచూ వినే విషయమే. ఈ రోజుల్లో అయితే నీరు ఏ సమయంలో, ఎంత తాగాలో గుర్తు చేసేందుకు ప్రత్యేకమైన యాప్ లు కూడా ఉన్నాయి.

వాటి అవసరం మనకు ఉందా? అసలు మంచినీరు తాగడం వల్ల ఉపయోగం ఏంటి? అది అంత ముఖ్యమైనదా? శరీరానికున్న నీటి అవసరాన్ని ఎందుకు విస్మరించకూడదు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను కూలంకషంగా చర్చించుకొందాం.

నీరు తాగడం ఎందుకు ముఖ్యం? (Why Drinking Water Is Important)

పాఠశాలలో చదువుకొనేటప్పుడు సైన్స్ తరగతిలో నీరు ప్రాధాన్యం గురించి మనం తెలుసుకొన్నాం. మన శరీరం 60శాతం నీటితోనే తయారవుతుందని ఉపాధ్యాయులు మనకు నేర్పించారు. అంతేకాదు మన శరీరంలోని అతి ముఖ్యమైన పనులన్నీ నీటి వల్లనే జరుగుతాయని కూడా మనం నేర్చుకొన్నాం. వాటిలో జీర్ణక్రియ, రక్త సరఫరా, శరీర ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండేలా చూడటం, శోషణ వంటి ముఖ్యమైన జీవక్రియలు సక్రమంగా జరిగేలా నీరు చూసుకుంటుంది.

అందుకే అమ్మ అస్తమానూ ‘కాసిని మంచినీళ్లు తాగమ్మాయ్..!’ అని చెబుతూ ఉంటుంది. శరీరం అవసరాలకు సరిపడినంత నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. ఈ డీహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమో తెలుసా? దీని వల్ల నీరసంగా అనిపించడం, వికారం, గొంతు ఎండిపోవడం మాత్రమే కాదు.. కొన్నిసార్లు అది మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మతిమరుపు, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. డీహైడ్రేషన్ మరింత తీవ్రంగా ఉన్నట్లయితే అది లో బ్లడ్ ప్రెజర్ కు దారి తీస్తుంది.  

ADVERTISEMENT

రోజూ ఎంత నీటిని తాగాలి? (How Much Water You Should Drink Daily)

మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే.. మనకు దాహం వేసినా వేయకపోయినా రోజంతా నీరు తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం 8X8 రూల్ అనుసరించమంటున్నారు. అంటే రోజుకి ఎనిమిది సార్లు ఎనిమిది ఔన్సుల నీటిని తాాగాలి. అంటే మన లెక్కల ప్రకారం సుమారుగా రెండు లీటర్లు. ఇది రోజుకు తాగాల్సిన కనీస నీటి పరిమాణం. మీరుండే వాతావరణ పరిస్థితి, మీ శరీరతత్వం ఆధారంగా ఇంకా ఎక్కువ నీటినే తాగాల్సిన అవసరం రావచ్చు. ఉదాహరణకు మీరున్న చోట వేడిగా ఉండి శరీరానికి ఎక్కువ చెమట పడుతున్నట్లయితే రెండు లీటర్ల కంటే ఎక్కువే నీరు తాగాలి. అప్పుడే మన ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. 

నీరు తాగడానికి మంచి సమయం ఏది? (Best Time To Drink Water)

01 benefits of drinking water-man drinking water

ఇటీవలే ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జరిపిన అధ్యయనంలో నీటిని ఏ సమయంలో తాగాలనే దానిపై ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. దాని గురించి అధ్యయన సహ రచయిత మిషెల్ ఫారెల్ వివరించారు. మనకు దాహం వేసినప్పుడే నీరు తాగడం మంచిదట. దాహం వేయని సందర్భాల్లోనూ నీటిని తాగడం వల్ల మెదడు ఆ లక్షణాన్ని గుర్తించడం మానేస్తుందట. కాబట్టి మీరు దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాల్సి ఉంటుంది.

నిద్ర లేచిన వెంటనే నాలుగు గ్లాసులు నీరు తాగడం వల్ల రోజంతా ఆరోగ్యంగా,ఉత్సాహంగా ఉంటామని జపనీయులు నమ్ముతారు. అలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జపనీయులు రోజూ ఇలా చేయడానికి కారణం.. బరువు తగ్గించుకోవడం. బరువు తక్కువగా ఉన్నట్లయితే మెటబాలిజం ప్రక్రియ చురుగ్గా ఉంటుంది. మీరు కూడా జపనీయుల మాదిరిగా చేయాలనుకొంటున్నారా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నాలుగు గ్లాసుల నీరు తాగిన 45 నిమిషాల వరకు ఆహారం తీసుకోకూడదు.

ADVERTISEMENT

పై రెండు విషయాలను చదివిన తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. నిద్ర లేచిన వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం మంచిది. అంటే రోజు మొత్తంలో మీరు తాగాల్సిన నీటిలో దాదాపు సగం వంతుని ఉదయాన్నే తాగాలి. మిగిలిన సగభాగాన్ని శరీర అవసరాలకు అనుగుణంగా రోజంతా తాగాల్సి ఉంటుంది. అప్పుడే శరీరం,చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. పైగా డీహైడ్రేషన్ సమస్య రాదు.

వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? (Benefits Of Drinking Hot Water)

నిద్ర లేచిన వెంటనే లేదా నిద్రకుపక్రమించే ముందు ఒక గ్లాసు వేడినీరు తాగే అలవాటు కొందరిలో ఉంటుంది. ఉదయాన్నే వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడంతో మరికొందరి దినచర్య ప్రారంభమవుతుంది. అసలు వేడినీరు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉంది?

02 benefits of drinking water-steaming cup of water

జలుబుకి చక్కటి ఉపశమనం (Relief From Cold)

జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోయినట్లుగా అయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సందర్భంలో పొగలు కక్కే వేడి నీటిని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు శ్వాసనాళంలో పేరుకుపోయిన మ్యూకస్ ను కరిగించి ఇన్స్టంట్ రిలీఫ్ దొరుకుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి జింజర్, లెమన్ టీ వంటివి కూడా ఉపయోగపడతాయి.

ADVERTISEMENT

ఆహారం జీర్ణమవ్వడానికి (Digest Food)

జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకొనే ముందు వేడి నీరు తాగడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. పైగా శరీరరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా ఒక గ్లాసు వేడినీరు తాగడం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది.

మలబద్ధకం నివారిస్తుంది (Avoid Constipation)

వేడి నీరు తాగడం వల్ల పేగుల్లో అక్కడక్కడా  పేరుకుపోయిన ఆహారాన్ని అడ్డు తొలగిస్తుంది. అంటే మీ పొట్టని శుభ్రం చేస్తుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారికి వేడి నీరు మంచి ఔషధంలా పనిచేస్తుంది. కావాలంటే మీరు వేడినీటిలో నిమ్మరసం కలుపుకొని లేదా గ్రీన్ టీ వేసుకొని తాగొచ్చు.

నరమండలాన్ని శాంతిపజేస్తుంది (Calms Your Mind)

రోజూ వేడినీటిని తాగడం వల్ల మీ నరమండలాన్ని శాంతిపచేసుకోవచ్చు. అదెలాగనుకొంటున్నారా? మీకెప్పుడైనా కండరాలు నొప్పిగా ఉన్నా.. ఒత్తిడిగా అనిపిస్తున్నా కాస్త వేన్నీళ్లు తాగితే చాలా ఫ్రీగా అనిపిస్తుంది. 

చల్లని నీటిని ఎప్పుడు తాగాలి? (When You Should Drink Cold Water)

వేడి నీరు తాగడం వల్ల కలిగినన్ని లాభాలు.. చల్లటి నీరు తాగడం వల్ల ఉండకపోయినా.. కొంత ప్రయోజనం ఉంది. వర్కవుట్ చేసిన తర్వాత చల్లటి నీరు తాగడం మంచిది. ముఖ్యంగా హై ఇంటెన్సిటీ వర్కవుట్లు చేసిన తర్వాత పెరిగిన శరీర ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకొంటుంది.

ADVERTISEMENT

చల్లటి నీరు తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చల్లటి నీటిని వెంట తీసుకెళ్లండి.

నీరు తాగడం వల్ల ఎలాంటి మేలు చేకూరుతుంది? (Benefits Of Drinking Water) 

వేడి నీరు తాగినా చల్లటి నీరు తాగినా అది మీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. ఇవి మాత్రమే కాదు గ్లాసు నీరు తాగడం వల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయి.

టాక్సిన్లను తొలగిస్తుంది (Removes Toxins)

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే గ్రీన్ టీ గురించి  ఆలోచిస్తాం. కానీ శరీర అవసరాలకు సరిపడినంత నీటిని తీసుకొన్నప్పుడు మాత్రమే కిడ్నీలు సమర్థంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది (Keeps The Skin Healthy)

తగినంత నీటిని తాగకపోయినట్లయితే చర్మం నిర్జీవంగా, కాంతిహీనంగా, పొడిబారినట్లుగా అయిపోతుంది. కాబట్టి చర్మాన్ని తాజాగా ఉంచుకోవాలంటే రోజూ రెండు లీటర్ల నీరు తాగాల్సిందే. ఎందుకంటే మనం తాగే నీరు మిగిలిన అన్ని భాగాలకు చేరుకొన్న తర్వాత అంటే ఆఖరున చర్మానికి చేరుతుంది. కాబట్టి మీ స్కిన్ ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే నీరు తాగడం ఒక్కటే మార్గం.

ADVERTISEMENT

జీర్టవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది (Keeps The Digestive System Healthy)

ఆహారం జీర్ణమవ్వడానికి దోహదపడే ఎంజైమ్ ల పనితీరు మెరుగుపడడానికి నీరు దోహదం చేస్తుంది. ఎప్పుడైనా మోతాదును మించి ఆహారం తీసుకొన్నట్లయితే.. ఆ సమయంలో గ్లాసు వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సమర్థంగా జరిగేలా చూసుకోవచ్చు.

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది (Improves Immune System)

మన శరీరం 60 శాతం నీటితోనే నిండి ఉంది. అది శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.  అందువల్ల మన అవయవాలు ఆరోగ్యంగా ఉండి సక్రమంగా పనిచేస్తాయి. అంతేకాదు సరిపడినంత నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా మన వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

తలనొప్పి ఇక రాదు (Reduces Headaches)

05 benefits of drinking water-zeldaya drinking water

మైగ్రెయిన్ వంటి తలనొప్పులు రావడానికి కారణం డీహైడ్రేషన్. తరచూ తలనొప్పితో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతి రోజూ నిర్ణీత వ్యవధిలో తగినంత నీటిని తాగుతూ ఉండాలి.

ADVERTISEMENT

కాళ్ల నొప్పులు తగ్గుతాయి (Reduces The Pain)

కాళ్ల నొప్పులు రావడానికి గల కారణాల్లో డీహైడ్రేషన్ కూడా ఒకటి. కాబట్టి రోజూ నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందచ్చు. కాఫీ, ఆల్కహాల్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించడం ద్వారా డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు కూడా వీటిని సేవించకుండా ఉండటమే మంచిది.

నడుం నొప్పికి మందు (reduces Back Pain)

డెస్క్ ఉద్యోగాలు చేసేవారందరూ ఎదుర్కొంటున్న సమస్య నడుం నొప్పి. నీరు శరీరంలో లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే.. వెన్నెముక డిస్క్ ల మధ్య ఉండాల్సిన ద్రవంలో హెచ్చుతగ్గులు లేకుండా కాపాడుతుంది. కాబట్టి నడుం నొప్పి తగ్గుముఖం పడుతుంది. అలాగే ఇన్ ఫ్లమేషన్ వల్ల కూడా నడుం నొప్పి రావచ్చు. దీనికి కారణమైన లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది.

కాబట్టి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. తరచూ వాష్ రూంకి వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలామంది నీరు చాలా తక్కువ తాగుతారు. మీరు మూత్రానికి వెళుతున్నారంటే మీ శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తున్నారని అర్థం. కాబట్టి అనవసరమైన అనుమానాలను పక్కన పెట్టి సరిపడినంత నీటిని తాగండి.

శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది (Controls Body Temperature)

మానవ శరీరం నీటిని వివిధ రకాలుగా ఉపయోగించుకొంటుంది. శ్రమ చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాన్ని తగ్గించడానికి మనకు చెమట పడుతుంది. కాబట్టి చెమట రూపంలో మనం కోల్పోయిన నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాల్సిన బాధ్యత మనదే.

ADVERTISEMENT

నోటి దుర్వాసనకి చెక్ (Reduces Mouth Odor)

నోటి దుర్వాసన రావడానికున్న ప్రధాన కారణాల్లో ఒకటి నోరు పొడిగా మారిపోవడం. నీరు తాగడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దుర్వాసన పోవడానికి మరో కారణం ఏంటంటే.. ఆహారం తిన్న తర్వాత నోటిలో మిగిలి పోయిన ఆహార పదార్థాలు, బ్యాక్టీరియా వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. వేడి నీటితో నోటిని పుక్కిలించడం.. ఆ తర్వాత నీటిని తాగడం వల్ల ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

హ్యాంగోవర్ నుంచి బయట పడేస్తుంది (Prevents Hangover)

ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. మరుసటి రోజు హ్యాంగోవర్ లో ఉండటానికి కారణమిదే. కాబట్టి రాత్రి పడుకొనే ముందు.. ఉదయం నిద్ర లేచిన తర్వాత తగు మొత్తంలో నీటిని తాగాల్సి ఉంటుంది. ఫలితంగా డీహైడ్రేషన్ కి గురవ్వరు. అలాగే హ్యాంగోవర్ లో కూడా ఉండరు.

నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల కలిగే లాభం ఏంటి? (Benefits Drinking Water Before Sleeping)

నిద్రలేమితో బాధపడేవారు పడుకోవడానికి ముందు నీటిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే మధ్యలో మేల్కొని వాష్ రూంకి వెళ్లాల్సి రావడం వల్ల నిద్రాభంగం అయ్యే అవకాశం ఉంది. అందుకే పడుకోవడానికి  అరగంట ముందే నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఫలితంగా మరుసటి రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీటిని తాగొచ్చా? (Drinking Water After Waking Up)

07 benefits of drinking water-rihanna drinking water

ADVERTISEMENT

నిద్ర లేచిన వెంటనే నాలుగు గ్లాసుల నీటిని తాగడం జపనీయులకున్న అలవాటు. ఇది నిజంగానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. మెటబాలిజం ప్రక్రియ చురుగ్గా ఉంటుంది. చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. జపనీయులు నీటిని తాగిన 45 నిమిషాల వరకు ఏమీ తినరు. రుతు సంబంధ సమస్యలతో బాధపడేవారు, కంటి సమస్యలున్నవారు, మెటబాలిజం సంబంధిత సమస్యలున్నవారు ఈ పద్ధతిని పాటించడం ద్వారా వాటి నుంచి విముక్తి పొందుతారు.

మంచి ఆరోగ్యానికి వేడినీరు మంచిదా? చల్లటి నీరు మంచిదా? (Is Cold Water Good For Us)

పైన మనం చర్చించుకున్నట్లుగా వేడి నీరైనా.. చల్లటి నీరైనా మనకు మంచే చేస్తుంది. అయితే మీ అవసరాలకనుగుణంగా ఏ నీటిని తాగాలో మీరే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజు చల్లటి నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలు కూడా అదపులో ఉంటాయి. ఆహారం తీసుకొనే ముందైతే వేడి నీరు తాగడం మంచిది. 

బరువు తగ్గే విషయంలో నీరు తాగడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది? (Does Water Helps In Reducing Weight)

బరువు తగ్గాలంటే శరీరంలోని క్యాలరీలను కరిగించాల్సిందే. రోజూ తాగాల్సిన మొత్తం కన్నా లీటరు నీటిని ఎక్కువ తాగడం ద్వారా కొన్ని నెలల్లోనే బరువు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులోనూ ఐస్ కోల్డ్ వాటర్ తాగడం వల్ల మరిన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. పైగా మెటబాలిజం మెరుగవుతుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి కాబట్టి ఆరోగ్యంగానూ తయారవుతారు.

రాత్రి వేళల్లో దాహం వేయడం మధుమేహానికి సూచనగా భావించవచ్చా? (Can Thirsty At Night Be Considered A Sign Of Diabetes)

అధికంగా దాహం వేయడాన్ని డయాబెటిస్ కు సూచనగానే భావించవచ్చు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కూడా మధుమేహానికి సూచన. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్ కి గురై దాహంగా అనిపిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ అధికంగా దాహం వేయడం చక్కెర వ్యాధి లక్షణం కాకపోవచ్చు. మీకు అలాంటి అనుమానం ఏదైనా వస్తే ముందుగా వైద్యున్ని సంప్రదించండి.

ADVERTISEMENT

రోజులో ఎంత మొత్తంలో నీటిని తాగాలి? (How Much Water You Should Drink In A Day)

08 benefits of drinking water-mean girls-water on girls

రోజుకి కనీసం రెండు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. కానీ ముందుగానే మనం చర్చించుకన్నట్టుగా ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు నీరు తీసుకోవడం మంచిది. రెండు లీటర్ల పరిమితి దాటిన తర్వాత కూడా మీకు నీటి అవసరం ఉందనిపిస్తే మీ శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉందని గుర్తించాలి.

అలాగే మీరు బరువు తగ్గించుకోవాలని భావిస్తే అదనంగా మరో లీటరు నీటిని తాగాల్సి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరు, మెటబాలిజం ప్రక్రియలను మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

పట్టులాంటి కురులు.. మృదువైన‌ చర్మం.. “రోజ్ మేరీ ఆయిల్”తోనే సాధ్యం..!

అంద‌మైన‌, మెరిసే చ‌ర్మం కోసం నలుగు పిండిని ఇలా ఉప‌యోగించండి..!

చామంతి పువ్వా… పువ్వా… నీతో నోరూరించే ఛాయ్ పెట్టనా..!

06 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT