దీప్ వీర్, ప్రియాంక జోనస్- పెళ్లి రిసెప్షన్స్‌లో ఇద్దరూ ఇద్దరే

దీప్ వీర్, ప్రియాంక జోనస్- పెళ్లి రిసెప్షన్స్‌లో ఇద్దరూ ఇద్దరే

బాలీవుడ్‌లో ఒకరకంగా ఈ సంవత్సరం వివాహాలకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది అని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం- బాలీవుడ్ నటీమణులైన సోనమ్ కపూర్ (Sonam Kapoor), దీపిక పదుకొనే (Deepika Padukone) మరియు ప్రియాంక చోప్రాలు (Priyanka Chopra) ఒకింటివారయ్యారు. అయితే వీరి పెళ్ళిళ్ళు.. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన పెళ్ళిళ్ళుగా రికార్డులలోకి ఎక్కాయి. వీరిలో ఒకరు ముంబైలో పెళ్లి చేసుకోగా.. మరొకరు ఇటలీలో.. ఇంకొకరు ఉదయపూర్ ప్యాలెస్‌లో వివాహం చేసుకోవడం గమనార్హం.


అయితే ఈ సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రమే కాదు... వారు అతిధులకు, పలువురు మిత్రులకు ఇచ్చే రెసెప్షన్స్ కూడా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఒక్కో జంట దాదాపు రెండు నుండి మూడు సార్లు వివిధ ప్రదేశాల్లో రెసెప్షన్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా దీప్ వీర్ (దీపికా పదుకునే-రణ్ వీర్ సింగ్) జంట ఇటలీలో పరిణయమాడగా ఆ తరువాత దీపికా స్వస్థలమైన బెంగళూరులో.. ఆ తరువాత  సినీ పరిశ్రమ వారికోసం ముంబైలో పెళ్ళి రెసెప్షన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేడుకలకి యావత్ బాలీవుడ్ హాజరవగా.. ఆ రెసెప్షన్‌లో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది.


దీప్ వీర్, విరుష్కల వివాహాల మధ్య తేడాను తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి


ఇప్పుడు ప్రియాంక  చోప్రా కూడా దాదాపు ఇదే పద్దతిని అనుసరించారని మనం అనుకోవచ్చు. ఉదయ్ పూర్‌లో వివాహం చేసుకున్న ప్రియాంక జోనస్ (ప్రియాంక చోప్రా -నిక్ జోనస్‌) నిన్న ముంబైలోని  ఒక అయిదు నక్షత్రాల హోటల్‌లో కుటుంబసభ్యులు, తమకు అత్యంత సన్నిహితులైన ఒక 20 మంది పాత్రికేయ మిత్రులకి ఈ రెసెప్షన్‌‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందుని ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్వయంగా ఏర్పాటు చేయడం జరిగింది.


దీపికా, రణ్ వీర్ వివాహ రిసెప్షన్ పై ప్రత్యేక కథనాన్ని ఇక్కడ చదవండి


ఇక ఈ విందులో  ప్రియాంక తన భర్త నిక్ జోనస్‌ని తన కుటుంబసభ్యులకు, పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఈ సందర్బంగా తన తండ్రి  లేని లోటు కనిపిస్తుందని.. అయితే ఆయన ఎల్లప్పుడు తన చుట్టూనే ఉంటారని చెబుతూ ప్రియాంక భావోద్వేగానికి గురవడం పలువురిని కలచివేసింది. ఆ వెంటనే మైక్ అందుకున్న నిక్  తనని  ఎంతగానో ఆదరిస్తున్న ప్రియాంక కుటుంబసభ్యులకి, ఇక్కడి మీడియాకి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. ఆ హోటల్‌లోనే ప్రియాంక తల్లి మధు చోప్రాని పెళ్లి కోసం అనుమతి అడిగినట్లు తెలుపుతూ.. ఆ విషయాలను గుర్తు తెచ్చుకున్నాడు. అలాగే ఈ క్షణం తనకెంతో  ప్రత్యేకం అని కూడా జోనస్ చెప్పడం గమనార్హం.


దీపికా, రణ్ వీర్ వివాహంపై ప్రముఖుల కామెంట్లను ఇక్కడ చదవండి


అయితే నిన్న ఏర్పాటు చేసిన విందు కేవలం కుటుంబసభ్యులకే  కావడంతో ఈరోజు ప్రియాంక చోప్రా తన బాలీవుడ్ సన్నిహితులకు మరో ప్రత్యేకమైన విందు ఇవ్వనున్నారు. దీనికి సంబందించిన ఆహ్వానపత్రికలు ఇప్పటికే అందరికి చేరగా ఈరోజు జరిగే విందులో బాలీవుడ్ మొత్తం ప్రియాంకకి దర్శనమివ్వనుంది.


మొత్తానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు వాళ్ళ చిత్రాలతోనే కాకుండా.. వారి పెళ్లి రెసెప్షన్స్ ఇవ్వడంలో సైతం పోటీపడుతున్నట్టుగా ఉంది. అయితే ఈ ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే.