ADVERTISEMENT
home / సౌందర్యం
టీనేజ్ అమ్మాయిలను ఫిదా చేస్తున్నా.. దీపిక  స్టైల్ “స్మోకీ ఐ మేకప్”

టీనేజ్ అమ్మాయిలను ఫిదా చేస్తున్నా.. దీపిక స్టైల్ “స్మోకీ ఐ మేకప్”

రివర్స్ స్మోకీ ఐస్(reverse smokey eyes) నుంచి వింగ్డ్ ఐ లైనర్ (winged eyeliner) వరకు పర్ఫెక్ట్ ఐ మేకప్ కావాలంటే బాలీవుడ్ దివా దీపికా పదుకొణేను ఫాలో అవ్వాల్సిందే. ఇటీవలే దీపిక న్యూయార్క్ వెళ్లినప్పుటి ఫోటోలను కొన్నింటిని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

అలల్లాంటి ఆమె కురులు, న్యూడ్ మేకప్, బ్రాంజర్ ఆమెను మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి. అన్నింటికీ మించి స్మోకీ ఐ మేకప్ ఆమెకు అదిరిపోయే లుక్ ఇచ్చింది. ఆమె ఐ మేకప్ మాకే కాదు.. మీక్కూడా నచ్చిందనే మేం భావిస్తున్నాం. మరి దీపికలా స్మోకీ ఐ మేకప్ లుక్ కోసం ఏం చేయాలో తెలుసుకొందాం.

స్మోకీ ఐ మేకప్ వేసుకోవడానికి బ్లాక్ పెన్సిల్ ఐ లైనర్, మీడియం సైజ్ ఐ షాడో బ్రష్ ఉంటే సరిపోతుంది.

2-deepika-padukone-smokey-eye-makeup

ADVERTISEMENT

ముందుగా పై కనురెప్పలకు పెన్సిల్తో సన్నగా ఐలైనర్ వేసుకోవాలి. స్మోకీ లుక్ కోసం బ్రష్ సాయంతో ఐలైనర్ గీతను కాస్త అలముకొనేలా చేయాలి. ఇలా చేసేటప్పుడు కనురెప్పల చివరి భాగంలో లైనర్ కాస్త ఎక్కువగా పరుచుకొనేలా చేయాలి. అప్పుడే దీపికా పదుకొణె మాదిరిగా స్మోకీ ఐలుక్ వస్తుంది.

బ్రష్‌తో ఇలా చేయడం కుదరకపోతే.. మీ చేతివేలిని బ్రష్‌కి బదులుగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు కింది కనురెప్పలకు కూడా ఇదే పద్దతిలో ఐ లైనర్ అప్లై చేయాలి. చివరిగా ఐ లైనర్‌ను కాటుకలా పెట్టుకొని.. కనురెప్పలకు మస్కారా అప్లై చేసుకొంటే సరిపోతుంది. అంతే.. చాలా సింపుల్‌గా దీపికలా స్మోకీ ఐ లుక్ తెచ్చుకోవచ్చు.

1-deepika-padukone-smokey-eye-makeup

సింపుల్‌గా ఉన్నప్పటికీ ఆకట్టుకొనేలా ఉన్న మేకప్‌ను వియత్నామీస్ అమెరికన్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ Hung Vanngo వేశారు. ఆయన అంతర్జాతీయ తారలైన కేటీ పెర్రీ, సోఫీ టర్నర్, బెల్లా హదీద్ వంటి వారికి మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. హ్యారీ జోష్ దీపిక జుట్టును స్టైల్ చేశారు. వీరిద్దరూ దీపిక ఫొటోలను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. 

ADVERTISEMENT

ఇక సినిమాల విషయానికొస్తే మేఘనా గుల్జార్ సినిమా చపాక్ (Chhappak) లో యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ గా నటించనుంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా? దీపికే.

Images: Deepika Padukone on Instagram

ఇవి కూడా చదవండి

అదిరేటి లుక్ కావాలంటే.. ఆరెంజ్ బ్లష్ అప్లై చేయాల్సిందే..

ADVERTISEMENT

పసుపు వాడేద్దాం.. ఈ ప్రయోజనాలు పొందేద్దాం..!

సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..

21 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT