నైసా దేవగన్ .. ఈ బాలీవుడ్ స్టార్‌కిడ్ గురించి మీరు త‌ప్ప‌క‌ తెలుసుకోవాల్సిందే.. !

నైసా దేవగన్ .. ఈ బాలీవుడ్ స్టార్‌కిడ్ గురించి మీరు త‌ప్ప‌క‌ తెలుసుకోవాల్సిందే.. !

అంద‌మైన లుక్స్‌తో చూడ‌డానికి అచ్చం కొత్త హీరోయిన్‌లా ఉండే నైసా ఎప్పుడూ డిజైన‌ర్ ఫ్యాష‌న‌బుల్ దుస్తుల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఆమె ధ‌రిస్తే సాధార‌ణ దుస్తులు కూడా ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా త‌న దుస్తుల‌తో త‌ల్లిదండ్రుల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది నైసా దేవగన్ (Nysa Devgan). తాజాగా ఈ అమ్మ‌డు ధ‌రించిన స్వెట్‌ష‌ర్ట్ లుక్ కూడా ఎంతోమందిని ఆక‌ర్షించింది. త‌న త‌ల్లిదండ్రుల‌తో కలిసి బాలీవుడ్ (Bollywood) పార్టీలు, ఇత‌ర ఫంక్ష‌న్ల‌లో ద‌ర్శ‌న‌మిచ్చే నైసాకి ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మ‌రి ఈ స్టార్‌కిడ్ గురించి మ‌రిన్ని ముచ్చ‌ట్లు తెలుసుకుందాం రండి.


1. అజ‌య్‌, కాజోల్‌ల గారాల పుత్రిక‌


నైసా బాలీవుడ్ న‌టీన‌టులు కాజోల్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌ల ప్రియ పుత్రిక‌. త‌న తల్లిదండ్రులిద్ద‌రూ మొద‌టిసారిగా 1995లొ హ‌ల్‌చ‌ల్ సినిమా సెట్స్‌లో క‌లిశారు. అయితే ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి మంచి అభిప్రాయం ఉండేది కాద‌ట‌. కాజోల్ చాలా ఎక్కువ‌గా మాట్లాడుతుంది. ఓపెన్ టైప్ అని అజ‌య్ భావిస్తే.. అజ‌య్ చాలా రిజ‌ర్వ్‌డ్ అని కాజోల్ అనుకుంద‌ట‌. అయితే వారిద్ద‌రికీ మంచి స్నేహం కుదిరేందుకు మాత్రం ఈ సినిమా ఉప‌యోగ‌ప‌డింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమించుకొని 1999 ఫిబ్ర‌వ‌రి 24 తేదిన వివాహ‌మాడారు.Image source: Instagram


2. వారి పెళ్లి త‌ర్వాత నాలుగేళ్ల‌కు నైసా పుట్టింది.


వీరిద్ద‌రి వివాహం త‌ర్వాత నాలుగేళ్ల‌కు నైసా జ‌న్మించింది. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ హాస్పిట‌ల్‌లో 2003 ఏప్రిల్ 20న నైసా పుట్టింది. త‌న‌కు యుగ్ దేవ‌గ‌న్ అనే ఓ త‌మ్ముడు కూడా ఉన్నాడు. ఆమెక‌న్నా త‌న త‌మ్ముడు ఏడేళ్లు చిన్నవాడు. యుగ్ 2010 సెప్టెంబ‌ర్ 14న జ‌న్మించాడు.Image source: Instagram


3. పుట్ట‌క‌ముందే త‌న పేరు నిర్ణ‌యించేశారు


నైసా అంటే నూత‌న ఆరంభం అని అర్థం. త‌ల్లిదండ్రులుగా త‌మ జీవితం కొత్త‌గా ప్రారంభం కానుంది కాబ‌ట్టి త‌మ‌కు ఆడ‌పిల్ల పుడితే నైసా అనే పేరు పెట్టాల‌ని అజ‌య్ ముందుగానే నిర్ణ‌యించుకున్నాడ‌ట‌.4. కుటుంబ‌మంతా చిత్ర‌సీమ‌కు చెందిన‌వారే..


నైసా త‌ల్లిదండ్రులకు మాత్ర‌మే కాదు.. ఆమె కుటుంబానికి కూడా బాలీవుడ్‌తో చాలా ముందునుంచే బంధం ఉంది. త‌న కుటుంబంలో చాలామంది న‌టులు కూడా ఉన్నారు. నైసా తాత వీరూ దేవ‌గ‌న్ యాక్ష‌న్ డైర‌క్ట‌ర్‌. నాన‌మ్మ వీనా దేవ‌గ‌న్ ఓ నిర్మాత‌. ఇక నైసా అమ్మ‌మ్మ త‌నూజా ముఖ‌ర్జీ అల‌నాటి బాలీవుడ్ న‌టి. నీల్ అండ్ నిక్కీ సినిమా ఫేం త‌నీషా ఆమె పిన్ని. అంతేకాదు.. న‌టి రాణి ముఖ‌ర్జీ కూడా కాజోల్‌కి క‌జిన్ అవుతుంది. ఈ లెక్క‌న చూసుకుంటే రాణి ముఖ‌ర్జీతో పాటు ఆదిత్య‌ చోప్రా, ఉద‌య్ చోప్రాలు ఆమెకు అంకుల్స్ అవుతారు. ఇలా ఆమె కుటుంబం మొత్తం బాలీవుడ్‌తో ముడిప‌డి ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు.Image source: Instagram5. త‌నకోస‌మే కాజోల్ సినిమాలు త‌గ్గించింది


నైసా పుట్టిన త‌ర్వాత కాజోల్ సినిమాలు చేయ‌డం చాలా త‌గ్గించింది. ఆమె పుట్టిన మూడేళ్ల‌కు 2006లో ఆమిర్ ఖాన్‌తో క‌లిసి ఫ‌నా చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత కూడా చాలా త‌క్కువ సినిమాల్లోనే న‌టించింది కాజోల్‌. త‌న కూతురికి అవ‌స‌రం ఉన్న‌ప్పుడు తాను ఆమె ప‌క్క‌నుండాల‌న్న కోరికే దీనికి కార‌ణ‌మంటుంది కాజోల్‌. నా పిల్ల‌ల కోసమే నేను సినిమాలు చేయ‌డం త‌గ్గించాను. నేను వారి ప‌ట్ల దృష్టి పెట్టాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది. నా స‌మ‌యాన్ని వారి కోస‌మే కేటాయించాల‌నుకుంటున్నా అని ఓ ఇంట‌ర్వ్యూలో కాజోల్ వెల్ల‌డించింది.Image source: Instagram6. సింగ‌పూర్‌లో చ‌దువు కొన‌సాగిస్తోంది..


ఇంత‌కుముందు ముంబ‌యిలోనే చ‌దువుకున్న నైసా ప్ర‌స్తుతం సింగ‌పూర్‌లోని యునైటెడ్ కాలేజీ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో త‌న చ‌దువును కొన‌సాగిస్తోంది. త‌న త‌ల్లి కాజోల్‌లాగే బోర్డింగ్ స్కూల్లో ఉంటూ చ‌దువును కొన‌సాగిస్తోంది నైసా. వీలైన‌ప్పుడ‌ల్లా నైసాను చూసేందుకు సింగ‌పూర్ వెళ్లే ఆమె తల్లిదండ్రులు అక్క‌డ తాము ఉండేందుకు ఓ అపార్ట్‌మెంట్ కూడా కొనుగోలు చేశార‌ట‌.7. బెండ‌కాయంటే ప్రాణం..


సాధార‌ణంగా పిల్ల‌లు చాలార‌కాల ఆహార‌ప‌దార్థాలు ఇష్ట‌ప‌డ‌రు. కొన్ని ర‌కాల కూరల‌ను చూస్తేనే అదోలా మొహం పెట్టుకుంటారు. కానీ నైసా మాత్రం అలా కాదు.. చిన్న‌త‌నం నుంచే అన్ని రకాల కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తినేద‌ట‌. ముఖ్యంగా బెండ‌కాయంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎంత‌గా అంటే రోజూ ఆమె తినే భోజ‌నంలో బెండ‌కాయ కూర ఉంటేనే కానీ భోజ‌నం చేసేది కాద‌ట‌.Image source: Instagram


 


8. ఈత‌లో ప్రావీణ్యురాలు నైసా..


కేవ‌లం చ‌దువులోనే కాదు.. ఇత‌ర అంశాల్లోనూ చ‌క్క‌టి ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తుందీ అమ్మాయి. ప‌దిహేనేళ్ల నైసా ఎప్పుడూ ఖాళీగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌ద‌ట‌. పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, వంట చేయ‌డం వంటివి చేస్తూ ఉంటుంద‌ట‌. ఇక ఈత‌లో అయితే ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంద‌ట‌. ఓసారి త‌న త‌ల్లి పుట్టిన రోజు కేక్ త‌యారుచేసిన నైసా.. కాజోల్‌కిష్ట‌మైన సూషీ కూడా త‌యారుచేస్తూ ఉంటుంద‌ట‌.9. ప‌ద‌కొండేళ్ల‌కే షార్ట్‌ఫిల్మ్


నైసాకి న‌ట‌నంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. 2014లోనే ప‌ద‌కొండేళ్ల వ‌య‌సులో త‌న స్కూల్ ప్రాజెక్ట్ కోసం మొద‌టిసారి కెమెరా ముందు నిలబ‌డింది నైసా. ఆ షార్ట్‌ఫిల్మ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాలా? నైసాకి న‌ట‌నంటే ఎంతో ఇష్ట‌మ‌ని తండ్రి అజ‌య్ కూడా చాలాసార్లు చెప్పుకొచ్చాడు. మ‌రి, చ‌దువులు పూర్తి చేసుకొని ఇత‌ర స్టార్ డాట‌ర్స్‌లా నైసా కూడా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందేమో చూడాలి..10. సెట్స్‌లోనూ త‌ల్లితో గ‌డిపింద‌ట‌..


కాజోల్‌తో సెట్స్‌లో గ‌డిపిన అనుభ‌వం నైసా సొంతం. ఆమెకు నాలుగేళ్ల వ‌య‌సున్న‌ప్పుడే యు, మి అవుర్ హ‌మ్ అనే చిత్రంలో న‌టించింది కాజోల్‌. ఆ చిత్రానికి అజ‌య్ ద‌ర్శ‌కుడు. దీంతో త‌ల్లిదండ్రులిద్ద‌రితో పాటు ఆ సినిమా సెట్స్‌కి వెళ్లేది నైసా. ఆ సినిమా ఎక్కువ భాగం ఓ క్రూజ్‌లో జ‌రిగింది. అయితే జ‌రుగుతోంది షూటింగ్ అని తెలియ‌ని నైసా త‌ల్లిదండ్రులతో పాటు త‌ను పిక్నిక్‌కి వ‌చ్చాన‌ని భావించేద‌ట‌. అయితే ఆ సినిమా సెట్స్‌లో నైసా ఉండ‌డం వ‌ల్ల చాలా స‌మ‌యం పాటు కుటుంబంతో గ‌డిపిన ఫీలింగ్ వ‌చ్చింద‌ని.. ఆ సినిమా షూటింగ్ త‌న‌కెంతో న‌చ్చింద‌ని కాజోల్ ప్ర‌క‌టించింది.11. అభిమానుల‌కు త‌నో ట్రెండ్‌సెట్ట‌ర్‌..


సాధార‌ణంగా ఎప్ప‌డూ క్యాజువ‌ల్ దుస్తుల‌లోనే క‌నిపించే నైసా త‌న డ్ర‌స్సింగ్‌తో అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో సిద్ధ‌హ‌స్తురాలు. డిజైన‌ర్ దుస్తులు ధ‌రించినా.. మోడ్ర‌న్ దుస్తుల్లో మెరిసినా అంద‌రినీ త‌న ఫ్యాష‌న్‌తో ఆక‌ర్షిస్తూ భ‌విష్య‌త్తులో తానే ఇండ‌స్ట్రీ ఫ్యాష‌నిస్టా అని నిరూపిస్తోంది. తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిల‌వ‌డం నైసాకి సాధార‌ణ విష‌యం.12. త‌న ప‌బ్లిసిటీ చూసి కాజోల్ భ‌య‌ప‌డుతోంద‌ట‌


స్టార్‌కిడ్స్ అంద‌రిలోనూ నైసాకి ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు ఉంది. అయితే ఈ గుర్తింపు వ‌ల్ల కాస్త ఆనందంగానే ఉన్నా త‌న కూతురికి ఇత‌ర పిల్ల‌ల్లా స్వేచ్ఛ ఉండ‌డం లేద‌ని కాజోల్ బాధ‌ప‌డుతోంద‌ట‌. ముంబ‌యిలో నైసా ఎక్క‌డికి వెళ్లాల‌న్నా త‌న‌తో పాటు త‌ప్ప‌నిస‌రిగా సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిందే.. ఇత‌ర ప్ర‌దేశాల‌ను ప‌క్క‌న పెడితే ఎయిర్ పోర్ట్ లోప‌లికి వెళ్లాల‌న్నా త‌న‌కు ఇబ్బందే ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంద‌ట‌. ఎక్క‌డికెళ్లినా త‌న‌తో సెల్ఫీ దిగాల‌నుకునేవాళ్ల‌ను చూసి త‌న పేరుప్ర‌ఖ్యాతులే త‌నకు స్వేచ్ఛ లేకుండా చేశాయ‌ని కాజోల్ బాధ‌ప‌డుతూ ఉంటుంద‌ట‌.ఇవీ.. బాలీవుడ్ స్టార్‌కిడ్ నైసా దేవ‌గ‌న్ గురించి కొన్ని విశేషాలు.. ఇప్ప‌టికే త‌న స్ష‌ల్ లుక్స్‌, ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఎంతోమందికి చేరువైంది నైసా. మ‌రి, భ‌విష్య‌త్తులో ఆమె కూడా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడుతుందా? లేక ఇత‌ర రంగాల్లో త‌న ప్ర‌తిభ చాటుకుంటుందా? చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి


శ్రీదేవి బయోపిక్ కోసం బోని కపూర్ చేస్తున్న సాహసం


ఆ యువరాణి పాత్రకి దీపిక పదుకొనే గ్రీన్ సిగ్నల్


"దంగల్" ఫేమ్ ఫాతిమా.. "కింగ్ ఖాన్" స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం కొట్టేసిందా?