ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే బాటలోనే.. అమీ జాక్సన్!

ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే  బాటలోనే.. అమీ జాక్సన్!

ఈ టైటిల్ చూసి  ప్రియాంక చోప్రా (Priyanka Chopra) & దీపికా పదుకొనే (Deepika Padukone)ల తరహాలో అమీ  జాక్సన్ కూడా హాలీవుడ్‌కి వెళ్ళనుందా అని అనుకునేరు. ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే.. పోయిన ఏడాది  ప్రియాంక, దీపికలు వివాహాలు  చేసుకుని.. కళ్యాణ బంధంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు అమీ జాక్సన్ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమైంది. ఈ సంవత్సరం ఆమె పెళ్లి చేసుకోనుందని వార్తలు రావడంలో.. ఈ విషయంపై కూడా ఆమె అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. 


నటి అమీ జాక్సన్ (Amy Jackson) కూడా ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తనకి నిశ్చితార్ధమైన సంగతి గురించి తన అభిమానులందరితోనూ పంచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, 2015 సంవత్సరం నుండి  జార్జ్ (George Panayiotou) అనే ఒక విదేశీ వ్యాపారవేత్తతో అమీ జాక్సన్ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ వార్తకి బలాన్ని చేకూర్చే విధంగా.. అప్పుడప్పుడు వీరిరువురికి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో హల్చల్ చేసేవి. అయితే గత ఏడాది ప్రేమికుల రోజు (Valentines Day) సందర్భంగా జార్జ్‌తో కలిసి దిగిన ఒక ఫోటోని  అమీ జాక్సన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. వీరి మధ్య ఉన్న బంధం ఏమిటో అందరికీ బహిర్గతమైంది.


ఇటీవలే జనవరి 1 తేదిన, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని వీరిరువురు కలిసి దిగిన ఫోటోలని అమీ జాక్సన్ పోస్టు చేస్తూ "నన్ను ఇంత సంతోషంగా ఉంచుతున్న నీకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు" అని తెలిపింది. ఆ ఫోటోలలో అమీ జాక్సన్ చేతికి డైమండ్ ఉంగరం ఉంది. ఈ విధంగా ఆమె తన నిశ్చితార్ధం జరిగినట్టుగా చెప్పకనే చెప్పిందని తెలుసుకోవచ్చు. ఈ జంట తాజాగా కొత్త సంవత్సరాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడానికి, అలాగే హాయిగా గడపడానికి జాంబియాకి వెళ్లడం జరిగింది.

 


అమీ బాయ్ ఫ్రెండ్ జార్జ్ విషయానికి వస్తే, వారి కుటుంబం హోటల్స్ బిజినెస్‌లో ఉంది. జార్జ్ తండ్రి ఆండ్రియాస్ బ్రిటిష్ ప్రాపర్టీస్ సంస్థ ఎబిలిటీ గ్రూప్స్‌కి చైర్ పర్సన్. త్వరలోనే జార్జ్ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడని సమాచారం. అమీ జాక్సన్ నిశ్చితార్ధం విషయం తెలియగానే ఆమె పెళ్లి  ఎప్పుడు? ఎక్కడ? ఎంత వైభవంగా  జరగబోతోంది? ఇలా అనేక ప్రశ్నలను అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో కురిపించేస్తున్నారు. అయితే వీటన్నిటి పైన అమీ జాక్సన్ ఇంకా స్పందించాల్సి ఉంది.


ఇక అమీ జాక్సన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే, నెల రోజుల క్రితమే ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) సరసన నటించిన 2.0 చిత్రం విడుదలవడం గమనార్హం. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఆమె మరే ఇతర చిత్రాలకి పచ్చ జెండా ఊపలేదు. దీనితో ఆమె పెళ్లి చేసుకున్నాక.. సినిమా కెరీర్‌కి స్వస్తి పలుకుతుంది అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. 2010లో తమిళంలో మద్రాసుపట్టణం చిత్రంతో అమీ జాక్సన్ నటిగా తన కెరీర్‌ని ఆరంభించి.. ఇప్పటివరకు సుమారు 16 సినిమాల్లో  హీరోయిన్‌గా తమిళ & హిందీ భాషల్లో నటించి అభిమానుల ప్రేమని పొందగలిగింది.


చివరగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. అమీ జాక్సన్ తన సినిమా కెరీర్ & పెళ్ళికి సంబంధించిన విషయాలపై తానే స్వయంగా స్పందిస్తే తప్ప.. అందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.  చిత్రమేమిటంటే.. ఇప్పుడిప్పుడే  సోనమ్ కపూర్, దీపిక పదుకొనే & ప్రియాంక చోప్రాలు తమ వివాహాలు జరిగాక.. ఆ హ్యాంగోవర్ నుండి బయటకి వస్తున్నారు. ఈ సమయంలో.. సినీ అభిమానులకి మరో హీరోయిన్ పెళ్లి వార్త.. మరోసారి పెళ్లి సీజన్‌లోకి తీసుకెళ్లే అవకాశముంది.


ఇవి కూడా చదవండి


అమీ జాక్సన్ నిశ్చితార్థానికి సంబంధించిన వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


రోబో 2.0లో అమీ జాక్సన్ లుక్ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


సెలబ్రిటీ వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు


అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.