సోష‌ల్ మీడియాలో #10YearChallengeకి సై అంటోన్న సెల‌బ్రిటీలు..!

  సోష‌ల్ మీడియాలో #10YearChallengeకి సై అంటోన్న సెల‌బ్రిటీలు..!

సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ఏదో ఒక ఛాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే ప్ర‌పంచం దృష్టిని బాగా ఆక‌ర్షించ‌గ‌లుగుతాయి. ఈ జాబితాలో మొన్న‌టి వ‌ర‌కు కికీ ఛాలెంజ్ ఉండగా; తాజాగా దాని స్థానంలో మ‌రో కొత్త ఛాలెంజ్ వ‌చ్చి చేరింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియానే షేక్ చేస్తోన్న ఆ ఛాలెంజ్‌- #10 Year Challenge .
 

 

 


View this post on Instagram


Here it is - my #10yearchallenge 2009 to 2019 !!! At 23 and 33 ☺️


A post shared by Sagarika (@sagarikaghatge) on
ఈ ఛాలెంజ్‌లో భాగంగా నేటికి, స‌రిగ్గా ప‌ది సంవ‌త్స‌రాల క్రితానికి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని తెలిపే విధంగా ఉండే ప‌లు అంశాలు, చిత్రాలు, ప‌రిణామాల‌ని పంచుకోవాల్సి ఉంటుంది. దీనిని ఎవ‌రు, ఎప్పుడు, ఎక్క‌డ ప్రారంభించార‌నే విష‌యాలు పూర్తిగా తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించ‌డంలో మాత్రం ఈ ఛాలెంజ్ స‌ఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. ఈ ఛాలెంజ్‌లో పాలు పంచుకోవ‌డం ద్వారా ప‌లువురు న‌టీన‌టులు తమ కెరీర్ లో వ‌చ్చిన మార్పుకి ఫొటోల ద్వారా అద్దం ప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటే; క‌్రీడాకారులు  తమ కెరీర్‌లోని తీపి జ్ఞాపకాలను అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ఇక రాజ‌కీయ పార్టీలు అయితే తమ పోరాటాల‌ను గుర్తు చేసుకుంటున్నాయి. సామాన్య ప్ర‌జానీకం సైతం గ‌త ప‌దేళ్ల‌లో త‌మ జీవితాల్లో చోటుచేసుకున్న మార్పుని ఈ ఛాలెంజ్ (Challenge)  ద్వారా ప‌రిశీలించుకుంటూ మ‌రోసారి గుర్తు చేసుకుంటున్నారు.
 

 

 


View this post on Instagram


#10YearChallenge. Some things don't change...like the B/W filter 😬 #IndulgingInTheGram


A post shared by Diana Penty (@dianapenty) on
సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా హుషారుగా వూపందుకున్న ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప‌లువురు సెల‌బ్రిటీలు ఒక‌రినొక‌రు నామినేట్ చేసుకుంటుండ‌గా; ఇంకొంద‌రు స్వ‌యంగా త‌మ ఫొటోల‌ను పంచుకుంటూ ఇందులో భాగ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ బాలీవుడ్ నటీమణులు సోనమ్ కపూర్ (Sonam Kapoor) , బిపాషా బసు (Bipasha Basu), దియా మీర్జా (Dia Mirza) తదితరులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇక ద‌క్షిణాది నుంచి శృతి హాసన్ (Shruti Haasan) & ఛార్మి కౌర్ (Charmme Kaur) వంటి ముద్దుగుమ్మ‌లు సైతం ఈ పోటీలో పాలు పంచుకున్నారు. ఇంకా చాలామంది సెల‌బ్రిటీలు ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నారు.
 

 

 


View this post on Instagram


#10yearchallenge #23to33 from DELHI 6 to ek Ladki Ko Dekha toh AISA Laga.. do you think I got dads genes??? @anilskapoor


A post shared by SonamKAhuja (@sonamkapoor) on


 

 

 


View this post on Instagram


So here it is, my #10YearChallenge! At 27 and 37!


A post shared by Dia Mirza (@diamirzaofficial) on
సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఛాలెంజ్ ప్ర‌భావం ఎంత‌గా ఉందంటే ఫేస్ బుక్  వ్యవస్థాపకుడు అయిన మార్క్ జుకర్ బర్గ్ కూడా పదేళ్ళ ముందు - తరువాత అంటూ పంచుకున్న ఓ ఫొటో సైతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. అంతేకాదు.. క్రికెట్ స్టార్స్  మొదలుకొని ఫుట్ బాల్ స్టార్స్ , బాస్కెట్ బాల్ స్టార్స్ , టెన్నిస్ స్టార్స్  స‌హా ప‌లు క్రీడా సమాఖ్యలు కూడా ఈ ఛాలెంజ్‌లో భాగం అవుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో ఈ స్థాయిలో ఈ ఛాలెంజ్ వైర‌ల్ అయింది కాబ‌ట్టి.. తామెందుకు త‌మ అనుభ‌వాల గురించి పంచుకోకూడ‌దు అనుకున్నారో ఏమో.. ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అనుబంధ సంఘాలు కూడా త‌మ పోరాటాలు ప‌దేళ్ల క్రితం ఎలా జ‌రిగాయి? ఇప్పుడు ఎలా జ‌రుగుతున్నాయి.. అనే అంశాల గురించి అంద‌రికీ తెలిసేలా ఫొటోల ద్వారా తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.


గ‌తంలో కికీ, ఐస్ బ‌కెట్ ఛాలెంజ్‌ల త‌ర‌హాలోనే ఇప్పుడు ఈ #10YearChallenge కూడా దాదాపు అదే స్థాయిలో వైరల్ అయ్యే అవ‌కాశాలున్నాయంటున్నారు సోష‌ల్ మీడియా విశ్లేష‌కులు. దీనికి ప్రధాన కారణం - ఇందులో పాలుపంచుకునే ప్రతిఒక్కరూ తమ జీవితంలో పదేళ్ళు వెనక్కి తిరిగి చూసుకోగ‌ల‌గ‌డం. మామూలుగానే మునుపు మ‌నం ఎలా ఉండేవాళ్లం, ఇప్పుడు ఎలా ఉన్నాం.. అని త‌ర‌చూ ఏదో ఒక సంద‌ర్భంలో ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఆ భేదాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఫొటోలు\ టెక్స్ట్ రూపంలో చూసుకునే అవ‌కాశం వ‌స్తే వ‌దులుకుంటారా చెప్పండి?? అందుకే చాలామంది సామాన్యులు సైతం ఇందులో భాగ‌మ‌య్యేందుకు ఎంత‌గానో ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఛాలెంజ్ కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవ‌కాశం ఉంది.
 

 

 


View this post on Instagram


2009 to 2019, 10 years later, still staring at the sun . #10yearchallenge #staringatthesun #nomakeup #justsunshine


A post shared by Sarah Jane Dias (@sarahjanedias) on
హాలీవుడ్ (Hollywood) స్టార్ అయిన జెన్నిఫర్ లోపెజ్ నుంచి సాధారణ పౌరుల వరకు ఈ ట్రెండ్ వైరల్ అవుతున్న నేపథ్యంలో #10YearChallenge త్వరలోనే సోషల్ మీడియా (Social Media) వేదికపై ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.


మ‌రి, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియానే షేక్ చేస్తోన్న ఈ కొత్త ఛాలెంజ్‌లో ఇంకెంతమంది సెలబ్రిటీలు పాలుపంచుకుంటారో చూడాలి..


ఇవి కూడా చ‌ద‌వండి


టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన... బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ నటిస్తోందా..?


శ్రీదేవి బయోపిక్ కోసం.. బోనీ కపూర్ చేస్తున్న సాహసం ఇదేనా?


"దంగల్" ఫేమ్ ఫాతిమా.. "కింగ్ ఖాన్" స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం కొట్టేసిందా?