2019 సంవత్సరంలో పెళ్లి పీటలెక్కనున్న హీరో-హీరోయిన్స్ వీరేనా!

2019 సంవత్సరంలో  పెళ్లి పీటలెక్కనున్న హీరో-హీరోయిన్స్  వీరేనా!

గ‌త ఏడాది సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టుల వృత్తిప‌ర‌మైన విశేషాల కంటే వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన వార్త‌లే ఎక్కువ‌గా ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా అభిమాన న‌టీన‌టులు సోనమ్ కపూర్, దీపికా పదుకొణె & ప్రియాంక చోప్రాల వివాహాలు అయితే యావత్ దేశం దృష్టినే ఆకర్షించాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఈ క్ర‌మంలోనే 2019 సంవ‌త్స‌రంలో ఇంకొంద‌రు న‌టీన‌టులు కూడా పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో అంద‌రి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది టాలీవుడ్ (Tollywood) ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ్ గురించి... మిరపకాయ్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఈ అమ్మడు కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే రొటీన్‌కి భిన్నంగా త‌న కెరీర్‌ని పక్కన పెట్టి చదువుకోవడానికి అమెరికా వెళ్ళిపోయింది. అలా వెళ్లిన రిచా చదువుకుంటూనే తన సహధ్యాయితో ప్రేమలో పడిందట‌! అది కాస్తా పరిణయం దాకా దారితీసింది. ఈ విషయం తానే స్వయంగా సోషల్ మీడియా (Social media) ద్వారా అందరితోనూ పంచుకుంది.మ‌రోవైపు ప్ర‌ముఖ హీరో విశాల్ (Vishal) సైతం తన పెళ్లికి సంబంధించి ఇటీవ‌లే ఒక అధికారిక ప్రకటనను వెలువరించారు. దాని ప్రకారం ఆయన త్వరలోనే హైదరాబాద్‌కి చెందిన అనీషా ఆళ్ల (Anisha Alla) ను పెళ్లాడ‌నున్నార‌ట‌! అనీషా ఆళ్ల 2017లో విడుద‌లైన అర్జున్ రెడ్డి చిత్రంలో క‌థానాయ‌కుడి స్నేహితురాలి పాత్ర‌లో న‌టించిన విష‌యం విదిత‌మే! ద‌క్షిణాదిలో వీరితోపాటు ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందుతున్న అనుష్కా శెట్టి & కాజల్ అగర్వాల్‌లు కూడా ఈ ఏడాది ప‌రిణ‌య‌మాడ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో వీరి వివాహాల గురించి కూడా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.
 

 

 


View this post on Instagram


#duggadugga ❤️


A post shared by Sushmita Sen (@sushmitasen47) on
ఇక హిందీ చిత్రపరిశ్రమ పై ఓ లుక్కేస్తే .. అక్కడ కూడా ఈ సంవత్సరం పెళ్లి పీటలు ఎక్కేందుకు పలువురు క‌థానాయిక‌లు సిద్ధంగా ఉన్నార‌ట‌! ఈ హీరోయిన్స్ జాబితాలో మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ ముందు వ‌రుస‌లో ఉండగా ఆ తరువాత స్థానాల్లో అలియా భట్‌తో పాటు అమీ జాక్సన్ కూడా ఉంది. వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు బాలీవుడ్‌లో ఇప్ప‌టికే హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఏడాది బాలీవుడ్‌లో కేవ‌లం హీరోయిన్స్ మాత్ర‌మే కాదు.. ఇంకొంద‌రు హీరోలు కూడా పెళ్లితో తమ జీవితంలో నూతనాధ్యాయానికి తెరతీసేందుకు సిద్ధ‌మవుతుండ‌డం విశేషం. వారిలో ఎక్కువ‌గా హీరో అర్జున్ కపూర్  పేరు వినిపిస్తుండగా ఆ తరువాత రణ్‌బీర్‌ కపూర్  & హీరో-దర్శకుడు అయిన ఫర్హాన్ అఖ్తర్  పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరంతా తమ తోటి నటీమణులతో ప్రేమలో ఉన్నవారే..! ఈ క్ర‌మంలోనే వీరంతా ఈ సంవత్సరంలోనే వివాహ బంధంలోకి అడుగుపెడతారని అటు మీడియా ఇటు వారి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది పెళ్లితో కొత్త జీవితానికి తెర తీసే హీరోల‌ సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ అయిన
సల్మాన్ ఖాన్, ప్రభాస్  & రానాల పెళ్లి వార్త‌ల కోసం కూడా అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే వారి వృత్తిప‌ర‌మైన క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా ఈ ఏడాది కూడా వీరు పెళ్లి పీట‌లెక్కే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. మ‌రి, వీరు అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఈ ఏడాదే పెళ్లి చేసుకుని అభిమానుల‌కు స్వీట్ షాక్ ఏమైనా ఇస్తారేమో చూడాలి..!


ఒక‌ప్పుడు చాలామంది క‌థానాయిక‌లు పెళ్లి చేసుకుంటే త‌మ సినీ కెరీర్‌కు బ్రేక్ ప‌డుతుంద‌ని భావించేవారు. కానీ అది ఎంత‌మాత్రం వాస్త‌వం కాద‌ని ప్ర‌స్తుత హీరోయిన్స్ విద్యాబాల‌న్‌, రాణీ ముఖ‌ర్జీ, అందాల తార ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌.. త‌దిత‌రులు నిరూపించి చూపించారు. ఈ నేప‌థ్యంలోనే కెరీర్ త‌ర్వాతే పెళ్లి అనే పాత ట్రెండ్‌కు స్వ‌స్తి ప‌లికి, సినిమాల్లో న‌టిస్తుండ‌గానే పెళ్లికి ప‌చ్చ‌జెండా వూపేస్తున్నారు.


ఈ క్ర‌మంలో 2019లో ఇంకెంతమంది ప్రముఖ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెడతారో చూడాలి...!


ఇవి కూడా చ‌ద‌వండి


తన భర్త ఆఫర్ కి 'NO' చెప్పిన దీపిక పదుకొనే ..!


సోష‌ల్ మీడియాలో #10YearChallengeకి సై అంటోన్న సెల‌బ్రిటీలు..!


రూప‌మే కాదు.. సాయిప‌ల్ల‌వి మ‌న‌సూ అంద‌మైన‌దే..!