ADVERTISEMENT
home / వినోదం
రూప‌మే కాదు..  సాయిప‌ల్ల‌వి మ‌న‌సూ అంద‌మైన‌దే..!

రూప‌మే కాదు.. సాయిప‌ల్ల‌వి మ‌న‌సూ అంద‌మైన‌దే..!

అందం.. అంత‌కుమించిన అభిన‌యం ఉన్న ఈత‌రం క‌థానాయిక‌ల జాబితాలో సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) పేరు ముందువ‌రుస‌లోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆమె న‌టించిన “ప్రేమ‌మ్” చిత్రం ద్వారా టాలీవుడ్ (Telugu Film Industry) లో అడుగుపెట్ట‌క ముందే తెలుగు వారి గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసిందీ చిన్న‌ది. అందులో ఆమె ప్ర‌ద‌ర్శించిన అభిన‌య‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఆ త‌ర్వాత తెలుగులో “ఫిదా” చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ భానుమ‌తిగా ప్రేక్ష‌కుల‌ను ఎంత ప్ర‌భావితం చేసిందంటే ఇప్ప‌టికీ ఆమె డైలాగ్స్‌ను అనుకరించేంత‌గా!! ఇంకేముంది.. అప్ప‌టివ‌ర‌కు వేలలో ఉన్న ఆమె అభిమానుల సంఖ్య కాస్త ల‌క్ష‌ల్లోకి వెళ్లిపోయింది. అంతేనా.. సాయిప‌ల్ల‌వి సినిమా విడుద‌ల‌వుతుందంటే ముందుగానే ప్రేక్ష‌కుల్లో ఆ చిత్రంపై కొన్ని అంచ‌నాలు పెట్టుకునే స్థాయికి ఆమె స్టార్ డమ్ పెరిగింది.

ఆ త‌ర్వాత విడుద‌లైన “ఎంసీఏ” బాక్సాఫీస్ వ‌ద్ద హిట్‌గా నిల‌వ‌గా; క‌ణం మాత్రం ఆశించిన స్థాయిలో వ‌సూళ్లను రాబ‌ట్ట‌లేక‌పోయింది. మ‌రోవైపు తెలుగుతోపాటు త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న సాయి ప‌ల్ల‌వికి “మారి 2″తో మంచి విజ‌యం ల‌భించిన‌ట్లైంది. అయితే ఇది నాణానికి ఒక‌వైపు మాత్ర‌మే!

sai-pallavi-south-indian-actress

ADVERTISEMENT

మ‌రోవైపు ఇటీవలే తెలుగులో విడుద‌లైన ప‌డి ప‌డి లేచే మ‌న‌సు (Padi Padi Leche Manasu) చిత్రం మాత్రం సాయిపల్లవిని కాస్త నిరాశ‌ప‌రిచింది. ఈ సినిమాలో కూడా సాయి ప‌ల్ల‌వి త‌న‌దైన న‌ట‌ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ప్ప‌టికీ ఇది వూహించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. శ‌ర్వానంద్ (Sharwanand), సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) వంటి మంచి న‌టులు, అద్భుత‌మైన క‌థ ఇందులో ఉన్న‌ప్ప‌టికీ.. రెండో భాగంలో ఉన్న చిన్న చిన్న లోపాల కార‌ణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

ఈ ప‌రిణామంతో త‌న‌కు నిర్మాత నుంచి రావాల్సిన రెమ్యున‌రేష‌న్ (Remuneration)ను సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట ఈ భామ‌. సినిమా ఒప్పందం కుదుర్చుకున్న వెంట‌నే రెమ్యున‌రేష‌న్‌లో భాగంగా కొంత మొత్తాన్ని తీసుకున్న సాయిప‌ల్ల‌వి ఆ త‌ర్వాత మిగ‌తా మొత్తాన్ని సినిమా విడుద‌ల‌య్యాక తీసుకోవాల్సి ఉంది. కానీ నిర్మాత త‌న‌కు ఇవ్వాల్సిన మిగ‌తా సొమ్ము ఇచ్చేందుకు ముందుకు రాగా.. ఆమె దానిని తీసుకునేందుకు ‘NO’ చెప్పిందట! ఫిలింన‌గ‌ర్‌లో ప్ర‌స్తుతం ఈ వార్త బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

సినిమా (Cinema) ఊహించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో రెమ్యునరేషన్ పరంగా నిర్మాతకి తన వంతుగా సహాయ పడాలని సాయిప‌ల్ల‌వి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. సాధారణంగా నిర్మాత‌ల‌కు స‌హాయ‌ప‌డేందుకు త‌మ రెమ్యున‌రేష‌న్‌ను వెన‌క్కి ఇచ్చేసిన న‌టీన‌టులు చాలామందే ఉన్నారు. గ‌తంలో “అత్తారింటికి దారేదీ” చిత్రం పైర‌సీకి గురైన‌ప్పుడు స‌మంత కూడా త‌న రెమ్యున‌రేష‌న్‌ను నిర్మాత‌కు తిరిగి ఇచ్చేసింది. ఇప్ప‌డు సాయిప‌ల్ల‌వి కూడా అదేబాట‌లో అడుగులు వేసింది. త‌న‌కు రావాల్సిన మిగిలిన రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా నిర్మాత‌కు ఆర్థికంగా స‌హాయ‌ప‌డింది.

అయితే ఈ పరిణామాన్ని గ‌మ‌నించిన కొంద‌రు విశ్లేష‌కులు రెండు జ‌ట్లుగా విడిపోయి భిన్న‌మైన అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. న‌టీన‌టుల‌కు సినిమా జ‌యాప‌జ‌యాల్లో భాగం ఇవ్వ‌డం మంచిదే అని కొంద‌రు అంటే; ఇలా రెమ్యున‌రేష‌న్ తిరిగి ఇవ్వ‌డం అన్నిసార్లు మంచిది కాద‌ని, దీనిని కొంద‌రు నిర్మాత‌లు త‌మ‌కు అనుగుణంగా మార్చుకునే అవ‌కాశాలు లేక‌పోలేవ‌ని ఇంకొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ప్ర‌స్తుతం సాయిప‌ల్లవి చేసిన ఈ ప‌నికి మాత్రం టాలీవుడ్‌లో ఎక్కువ‌గా అభినంద‌న‌లే వ‌స్తున్నాయి. చిత్ర ప‌రిశ్ర‌మ క‌ల‌కాలం నిల‌బ‌డాలంటే అందుకు నిర్మాత‌లే కీల‌కం. అలాంటి నిర్మాత‌ల‌కు వెన్నుద‌న్నుగా నిలిచేందుకు న‌టీన‌టులు ఇలా ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణామం అంటున్నారు.

ADVERTISEMENT

ప్ర‌స్తుతం త‌మిళం, మ‌ల‌యాళంలో (Malayalam) చెరొక సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్న సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) ప్రస్తుతం వేణు ఉడుగుల (Venu Udugula) దర్శకత్వంలో విరాట పర్వం అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో రానా (Rana) హీరోగా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

“పడి పడి లేచే మనసు” అంటూ.. ఓ సరికొత్త పాత్రలో కనువిందు చేస్తున్న సాయి పల్లవి

“పడి పడి లేచే మనసు” మనల్ని కూడా ప్రేమలో పడేస్తుందా..?

ADVERTISEMENT

2018 తెలుగు సినిమా ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే..!

08 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT