ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సినిమాలో చూపించినట్టు.. కాలేజీ జీవితం ఉండదమ్మా..!

సినిమాలో చూపించినట్టు.. కాలేజీ జీవితం ఉండదమ్మా..!

స్కూల్ రోజుల్లో సినిమాలు.. అందులో కాలేజీ వాతావరణం చూసి.. ‘అబ్బ కాలేజీ లైఫ్ ఎంత బాగుంటుందో కదా..!’ అనుకొనేదాన్ని. ఇంకా చెప్పాలంటే.. అసలు కాలేజీకి ఎప్పుడెప్పుడు వెళతానా అని ఎదురుచూసేదాన్ని. ఎందుకంటే హైహీల్స్ వేసుకొని మెల్లగా నడుస్తూ వెళుతుంటే.. చల్లటి గాలికి నుదుటిపై ముంగురులు అలా అలా కదులుతుంటే.. నన్ను చూసి అందరూ వావ్ అనుకొంటే.. ఎంత బాగుంటుందో.. కాలేజీలో అడుగుపెట్టక ముందు నాకున్న ఆలోచన ఇది.

బహుశా మీరు కూడా అలాగే అనుకొని ఉంటారు కదా.. ఎందుకంటే అప్పటి వరకు మనకు కాలేజీ ఎలా ఉంటుందో తెలియదు. సినిమాల్లో కాలేజీని చూసి బయట కూడా ఇలాగే ఉంటుందనే భ్రమలో ఉంటాం. సినిమాల్లో చూపించే college వాతావరణానికి.. నిజజీవితంలో మనం వెళ్లే కళాశాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వాటిల్లో చూపించే కొన్ని విషయాలు అసలు బయట జరగనే జరగవు.

1. ఫ్యాన్సీ కారులో ఎంట్రీ ఇవ్వడం..

చాలా సినిమాల్లో హీరో లేదా హీరోయిన్లు ఫ్యాన్సీ రెడ్ కార్లో కాలేజీకి వస్తుంటారు. నిజజీవితంలో అలా జరుగుతుందా? జరుగుతుంది. కానీ అంత కాస్ట్లీ కార్లో అయితే కాదు. సెకండ్ హ్యాండ్ కార్లో. పైగా దానికి ముందు వెనక దేన్నో గుద్దిన ఆనవాళ్లుంటాయి. మనం కార్లోనే కాదు.. నడిచి వెళ్లినా సరే.. మన స్నేహితులు మనల్ని ఇష్టపడతారు. మన తోడుంటారు.

ADVERTISEMENT

2. కాలేజీలో అడుగు పెట్టిన రోజే ప్రేమలో పడటం..

reel-college-vs-real-college-chalo

సినిమాల్లో ఇలా కాలేజీలోకి హీరోయిన్ అడుగుపెడుతుందో లేదో.. ఆమెని చూసి వెంటనే మనసు పారేసుకొంటాడు హీరో. ఇలా రీల్ కాలేజీలో జరిగినట్టు రియల్ కాలేజీలో జరగదు.

3. లెక్చరర్‌ని మభ్యపెట్టడం..

ADVERTISEMENT

కాలేజీకి లేట్‌గా వచ్చినా.. బంక్ కొట్టి దొరికిపోయినా.. సినిమాల్లో అయితే.. లెక్చరర్‌కి ఏవో కహానీలు చెప్పి తప్పించుకొంటూ ఉంటారు. కానీ బయట అలా ఉండదు. అసలు మీరు చెప్పే కథలే కాదు.. మీరెవరో కూడా వారు పట్టించుకోరు. రూల్స్ పాటించకపోతే రూళ్ల కర్రతో ఉతికి ఆరేస్తారు.

4. హాట్‌గా ఉండే లెక్చరర్..

అస్సలు ఇది జరగని పని. లెక్చరర్‌ని చూస్తే మనకు గౌరవం కలుగుతుందే కానీ.. ఫ్లర్ట్ చేయాలనే ఆలోచనే రాదు. కానీ సినిమాల్లో మాత్రం దీనికి భిన్నంగా లెక్చరర్‌కి లైనేస్తూ ఉంటారు.

 reel-college-vs-real-college-currentteega

ADVERTISEMENT

4. బ్యాగ్రౌండ్ మ్యూజిక్..

హీరోయిన్, హీరో ప్రేమలో పడినప్పుడు లేదా.. హీరోయిన్‌ని హీరో మొదటిసారి చూసినప్పుడు.. చాలా వినసొంపైన మ్యూజిక్ వస్తుంది. కానీ కాలేజీలో నాకో అబ్బాయి నచ్చినప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రాలేదు… శ్రుతి హాసన్‌కి వచ్చిన మ్యూజిక్ నాకెందుకు రాదు? నేను హర్ట్ అయ్యా..

5. మినీ స్కర్ట్స్.. సమస్యే లేదు..

రీల్ కాలేజీకెళ్లే అమ్మాయిలు.. మినీ స్కర్ట్స్, హై హీల్స్ వేసుకొంటారు. కానీ రియల్ లైఫ్‌లో అది కాలేజ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ కానే కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీలో ఉండాలి కాబట్టి.. కాస్త సౌకర్యవంతమైన దుస్తులకే ప్రాధాన్యమిస్తారు.

ADVERTISEMENT

6. క్యాంటీన్ ఎంత నీట్‌గా ఉంటుందో..

reel-college-vs-real-college-ninnukori

అసలు ఏ కాలేజ్‌లో క్యాంటీన్ అయినా ఎలా ఉంటుంది? సాదాసీదాగా ఉంటుంది. విరిగిపోయిన కుర్చీలు, తిరగని ఫ్యాన్లు.. ఈగలు వాలిన ఆహారం.. అబ్బో చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉంటాయి. సినిమాలో మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్‌లో క్యాంటీన్ చూపిస్తారు.

6. క్లాసులో నిద్రపోవడం..

ADVERTISEMENT

లెక్చరర్ పాఠాలు చెబుతున్నప్పుడు.. గుర్రు పెట్టి నిద్రపోయే ధైర్యం మనం చేయగలమా? అసలు మన ఆటలు వారి దగ్గర సాగుతాయా? ఏంటో ఈ సినిమాలో స్టూడెంట్స్.. క్లాసులో కూడా హాయిగా నిద్రపోతారు. ఆ భాగ్యం నాకెప్పుడూ దక్కలేదే?

7. పార్టీ కోసం విపరీతంగా ఖర్చు చేయడం..

మీరు చెప్పండి.. చదువుకొనే రోజుల్లో మీరు పార్టీ ఎలా చేసుకొనేవారు? పానీపూరీ, ఐస్ క్రీం, కూల్ డ్రింక్ ఇవేగా.. ఖర్చు కూడా మన పాకెట్ మనీకి తగ్గట్టుగానే ఉంటుంది. మరి సినిమాల్లో మాత్రం పార్టీ చేసుకోవడానికి హైఫై ప్లేస్‌కి వెళతారు. పైగా ఖర్చంతా వారే భరిస్తారు. ఎలాగబ్బా? సినిమా కదా.. ఏదైనా సాధ్యమే..!

8. మొదటి రోజే శత్రుత్వం..

ADVERTISEMENT

అదేంటో చాలా సినిమాల్లో హీరో లేదా హీరోయిన్‌కి కాలేజీలో అడుగు పెట్టిన రోజే శత్రువు ఎదురవుతారు. పైగా ఆ శత్రుత్వం జీవితాంతం కొనసాగుతుంది. నేను మాత్రం ఒకటి చెప్పగలను. కాలేజీలో అడుగు పెట్టిన రోజు మనకు మిత్రులు పరిచయం కాకపోవచ్చు. కానీ శత్రువులు మాత్రం ఉండరు. అడుగు పెట్టినప్పుడే కాదు.. చివరి రోజు వరకు మరీ అంత శత్రుత్వం పెంచుకోం.

10. ప్రతి వారాంతంలోనూ ఓ ట్రిప్

ఏడాదికోసారి పిక్నిక్‌కి వెళ్లడమే గగనమనుకొంటే.. సినిమాల్లో మాత్రం వారం తిరిగొచ్చేసరికి వీకెండ్ ట్రిప్‌లకు వెళ్లిపోతారు. అదెలా సాధ్యం. కానీ ఏడాదికోసారి క్లాస్ మేట్స్‌తో కలసి ట్రిప్‌కి వెళ్లినప్పుడు కలిగిన ఆనందం, ఆ జ్ఞాప‌కాలు ఎప్పటికీ మధురంగానే నిలిచిపోతాయి.

12. ఎంత పెద్దింట్లో ఉంటారో..

ADVERTISEMENT

reel-college-vs-real-college-srimanthudu

బ్యాచిలర్‌కి అద్దె ఇల్లు దొరకడం ఎంత కష్టం? ప్రతి ఇంటి ముందూ.. టులెట్ ఫర్ ఫ్యామిలీ అనే ఉంటుంది. ఎవరో దయతలిస్తే తప్ప బ్యాచిలర్స్‌కి ఇల్లు దొరకదు. అలాంటిది సినిమాల్లో సకల సౌకర్యాలతో కూడిన విల్లాల్లో ఉండే స్టూడెంట్స్‌ని చూస్తే ఈర్ష్య కలుగుతుంటుంది.

13 యాన్యువల్ కాంపిటీషన్లో కచ్చితంగా గెలవడం

వార్షికోత్సవం నాడు జరిగే పోటీల్లో ఎంత బాగా ప్రిపేరయినా.. బహుమతి తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ సినిమాల్లో మాత్రం పోటీకి సిద్ధం కాకపోయినా హీరో వచ్చి.. కాస్త బూస్టప్ ఇస్తే తెగ గెలిచేస్తుంటారు. అదెలాగో నాకిప్పటికీ అర్థం కాదు.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి

అల్లరి పిడుగు బుడుగు.. మనింట్లో చిచ్చర పిడుగైతే..?

మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??

ఇలాంటి చిత్ర‌విచిత్ర‌మైన వ్యక్తులు.. మీకూ మార్కెట్లో ఎదుర‌య్యారా?

ADVERTISEMENT
06 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT