ఈ ఏడాది మోస్ట్ గ్లామ‌ర‌స్ స్టార్స్‌గా.. ఎంపికైన షారూఖ్ ఖాన్, దీపికా ప‌దుకొణె..!

ఈ ఏడాది మోస్ట్ గ్లామ‌ర‌స్ స్టార్స్‌గా.. ఎంపికైన షారూఖ్ ఖాన్, దీపికా ప‌దుకొణె..!

వెండితెర‌పై వినోదాన్ని పంచే తార‌లంటే అభిమానుల‌కు ఎంతో ఇష్టం. అందుకే కేవ‌లం సిల్వ‌ర్ స్క్రీన్ పైనే కాకుండా బ‌య‌ట కూడా వారు ఏం చేస్తున్నారు? ఏం ధ‌రిస్తున్నారు? ఎలాంటి ఫ్యాష‌న్స్ (Fashions) ఫాలో అవుతున్నారు.. వంటి విష‌యాల‌ను ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే న‌టీన‌టులు సైతం ఎక్క‌డికెళ్లినా త‌మ దుస్తులు, ఆహార్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఫ్యాష‌న‌బుల్‌గా , స్టైలిష్‌గా మెరిసిపోతుంటారు.


సాధార‌ణ స‌మ‌యంలోనే ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే తార‌లు యావ‌త్ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌ఖ్యాత అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ్వాలంటే ఇంకెంత జాగ్ర‌త్త‌గా ఉంటారో ఒక్క‌సారి ఆలోచించండి. అందుకే రెడ్ కార్పెట్ పై ఒక్కొక్క‌రూ ఒక్కో శైలిలో త‌మ‌వైన ఫ్యాష‌న్ సెన్స్‌తో హొయ‌లు పోతూ ఉంటారు.


తాజాగా ముంబ‌యిలో మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 12) జ‌రిగిన ఫిలింఫేర్ గ్లామ‌ర్ & స్టైల్ అవార్డ్స్ (Filmfare Glamour & Style Awards) కార్య‌క్ర‌మంలో కూడా ఇదే జ‌రిగింది. ఏటా నిర్వ‌హించే ఈ అవార్డుల వేడుక.. ఈ ఏడాది కూడా క‌న్నుల‌పండువ‌గా జ‌రిగింది. బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది న‌టీన‌టులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని సంద‌డి చేశారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మొద‌లుకొని ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీ రేఖ‌, కాజోల్, ప్రీతీ జింటా, జాన్వి క‌పూర్, దీపికా ప‌దుకొణె, సోనాక్షి సిన్హా.. త‌దిత‌రులు ఈ అవార్డుల వేడుక‌లో పాల్గొన్న వారి జాబితాలో ఉన్న‌వారే!


సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టుల‌కు ఫ్యాష‌న్, స్టైల్, బ్యూటీ.. వంటి ప‌లు విభాగాల్లో అవార్డులు అందించే ఈ కార్య‌క్ర‌మంలో ఈ ఏడాది ఎవ‌రెవ‌రు ఏ అవార్డుల‌ను గెలుచుకున్నారో ఓసారి చూద్దాం..


ఉత్తమ గ్లామర్ నటి- దీపికా పదుకొణె (Deepika Padukone)


ఉత్తమ గ్లామర్ నటుడు - షారూఖ్ ఖాన్ (Sharukh Khan)


ఉత్తమ స్టైలిష్ నటి - సోన‌మ్ క‌పూర్ (Sonam Kapoor)


ఉత్తమ స్టైలిష్ నటుడు - షాహిద్ క‌పూర్ (Shahid kapoor)


ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్ ఫిమేల్ - జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor)


ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్ మేల్ - ఇషాన్ ఖత్తర్ (Ishaan Khatter)


అల్టిమేట్ దివా - రేఖ (Rekha)


టైంలెస్ బ్యూటీ - కాజోల్ (Kajol)


ట్ర‌య‌ల్ బ్లేజ‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ - క‌రిష్మా క‌పూర్ (Karsihma Kapoor)


రిస్క్-టేకర్ అఫ్ ది ఇయర్ - సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)


హాట్ స్టెప్పర్ అఫ్ ది ఇయర్ - విక్కీ కౌశల్ (Vicky Kaushal)


క్లట్టర్ బ్రేకర్ అఫ్ ది ఇయర్ - ఆయుష్మాన్ ఖురానా (Ayushmaan Khuraana)


ఈ అవార్డుల కార్య‌క్ర‌మంలో టాలీవుడ్‌కు చెందిన ర‌కుల్ ప్రీత్ సింగ్, అదా శ‌ర్మ‌, పూజా హెగ్డే.. త‌దిత‌రులు కూడా సంద‌డి చేశారు. ఒక్కొక్క‌రూ త‌మ‌దైన ఫ్యాష‌న్ సెన్స్‌తో రెడ్ కార్పెట్ పై మ‌రింత హాట్ లుక్స్‌తో మెరిసిపోయారు


Featured Image: Instagram/aslisona


ఇవి కూడా చ‌ద‌వండి


ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన.. మహేష్ బాబుకి దక్కిన అరుదైన అవకాశం..!


రామ్ చరణ్‌ సరసన "RRR"లో నటించబోయే.. హీరోయిన్ ఈమేనా..?


స‌రోగ‌సీ ద్వారా జన్మించిన పండంటి బిడ్డకు.. తండ్రి పేరు పెట్టిన సీరియల్ క్వీన్