ADVERTISEMENT
home / Astrology
ఈ రోజు రాశిఫలాలు చదివేయండి – కలలను సాకారం చేసుకోండి

ఈ రోజు రాశిఫలాలు చదివేయండి – కలలను సాకారం చేసుకోండి

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

 

మేషం (Aries) – మిమ్మల్ని బాధించే అంశాల గురించి న‌మ్మకంతో ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించండి. ఆయ‌న ఆదేశాల అనుగుణంగా న‌డుచుకునేందుకు ప్రయ‌త్నించండి. అన్నీ స‌ర్దుకుంటాయి.

వృషభం (Tarus) – డబ్బుకు సంబంధించిన మీకున్న అన్ని బాధ‌ల‌ను వ‌దిలేయండి. ఆర్థిక వ్యవహారాల‌కు సంబంధించి మీ న‌మ్మకాల‌ను మార్చుకోండి. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తే మీ ఆర్థిక వ్యవహారాలు కూడా బాగుంటాయి.

ADVERTISEMENT

మిథునం (Gemini) – క‌ల‌లు కంటే స‌రిపోదు. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఆ దిశ‌గా ఇప్పుడే ప్రయత్నాలు మొద‌లుపెట్టండి. మీకు స‌హాయ‌ప‌డేవారు ఎవ‌రో గుర్తించి వారి స‌హాయం తీసుకోండి.

కర్కాటకం (Cancer) – మీరు ఇప్పుడు ఉన్న గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌కు కార‌ణం ఏంటో తెలియ‌క ఎంత‌గానో స‌త‌మ‌త‌మైపోతున్నారు. అయితే దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఏం చేయాలో ముందు ఆలోచించండి.

సింహం (Leo) – స‌ర‌దాగా బ‌య‌ట‌కు వెళ్లి కాసేపు తాజా గాలి పీల్చుకోండి. ఇది మీలోని ప‌ని ఉత్పాద‌క‌త‌ను, క్రియేటివిటీని పెంచుతుంది. మ‌న‌సుకు ప్రశాంతంగా కూడా  అనిపించ‌డంతో పాటు చాలా విష‌యాల్లో ఒక స్పష్టత వ‌స్తుంది. అలాగే మీ మ‌న‌సులోని బాధ‌ను బీచ్ లోని ఇసుకపై రాయండి. మ‌న‌సు కాస్త తేలిక ప‌డుతుంది.

కన్య (Virgo) – మీరు సంతోషంగా ఉండాలంటే అన్నింటినీ త్యాగం చేయాల్సిన అవ‌స‌రం లేదు. దాని బ‌దులుగా మీ వ‌ద్ద ఉన్నవాటి విలువ గ్రహించి వాటిని ప్రేమించండి.

ADVERTISEMENT

తుల (Libra) – మీ చుట్టూ ఉన్నవారు మీ విజ‌యం, ఆర్థిక ఎదుగుద‌ల‌ను అడ్డుకుంటున్నారు. నెగెటివిటీ నుంచి దూరం జ‌రిగి సంతోషంగా ఉండేవారితో కలిసి ఉండేందుకు ప్రయత్నించండి

వృశ్చికం (Scorpio) – గ‌తంలో చేసిన పొర‌పాట్ల గురించి చింతించ‌కండి. ఆ స‌మ‌యానికి మీకు అది స‌రైందే అనిపించి చేశారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఆ పొర‌పాట్లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూసుకోండి. అంద‌మైన భ‌విష్యత్తుని నిర్మించుకోండి.

ధనుస్సు (Saggitarius) – మీకు అవ‌స‌ర‌మైన‌వ‌న్నీ ఇప్పుడు మీ వ‌ద్ద ఉన్నాయి. కాబట్టి మీలోని నెగెటివ్ ఆలోచ‌న‌లు, అర్థం లేని సందేహాల‌కు బ‌దులుగా పాజిటివ్ ఆలోచ‌న‌లు, సంతోషాన్ని నింపుకుంటే మీ జీవితం మ‌రింత సంతోషక‌రంగా మారుతుంది.

మకరం (Capricorn) – మీ ఐడియాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే వాటిని అమ‌లు చేయ‌డానికి మీకు ఇత‌రుల స‌హాయంతో పాటు కాస్త ఆర్థిక స‌హకారం కూడా అవ‌స‌రం అవుతుంది. ఇందుకోసం ప‌క్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని వాటిని అమ‌లు చేయండి. వాటిని అలా నిరుప‌యోగంగా వ‌దిలేయ‌కండి.

ADVERTISEMENT

కుంభం (Aquarius) – అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెట్టడం ఆపండి. ఆ డ‌బ్బుని మీ పెళ్లికో లేక ఏదైనా వెకేష‌న్ కో పొదుపు చేయ‌డం మొద‌లుపెట్టండి. ఆర్థికంగా మీ భ‌విష్య‌త్తు బ‌లంగా ఉండే విధంగా ఇప్పటి నుండి పునాదులు వేసుకోండి.

మీనం (Pisces) – మీరు సంపాదించే మొత్తంలో మీకోసం అంటూ కాస్త డ‌బ్బుని కేటాయించుకోండి. మిమ్మ‌ల్ని మీరు సంతోష‌ప‌రుచుకోక‌పోతే ఇక మీరు ఎంత సంపాదించి ఉప‌యోగం ఏంటి?? మీ సంతోష‌మే మీకు తొలి ప్రాధాన్యం కావాలి.

ఇవి కూడా చదివేయండి

ఈ రోజు రాశిఫలాలు చదివేయండి – మీ జీవిత గమనానికి బాటలు వేయండి

ADVERTISEMENT

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే విషయాలివే..

26 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT