ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ధైర్యం చేసి కండోమ్ కొనే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..!

ధైర్యం చేసి కండోమ్ కొనే అమ్మాయి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందంటే..!

సమాజం ఆధునిక పోకడలు అద్దుకొంటున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం అణువంతైనా మార్పు రావడం లేదు. నేటికీ మహిళలు తమ రుతుక్రమానికి సంబంధించిన సమస్యల గురించి చెప్పుకోవడాన్ని తప్పుగా భావిస్తారు. ఇక సెక్స్ గురించి మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం.

మరి ఇలాంటి సామాజిక పరిస్థితుల్లో అమ్మాయి ధైర్యం చేసి కండోమ్స్ కొనడానికి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇండియాలో మహిళలు కండోమ్స్ (condoms) కొనడం కష్టమైన పనా? అని Quoraలో అడిగిన ప్రశ్నకు కొంతమంది అమ్మాయిలు సమాధానమిచ్చారు. కండోమ్స్ కొనేటప్పుడు వారు ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.

కండోమ్స్ కొనడం కష్టం కాదు కానీ..: సూపర్ మార్కెట్లు, సెల్ఫ్ సర్వీస్ ఫార్మసీల్లో కండోమ్స్ కొనడం పెద్ద ఇబ్బందిగా ఏమీ అనిపించదు. కానీ మెడికల్ స్టోర్‌లో కొనాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. కండోమ్స్ ఏంటి? శానిటరీ న్యాప్కిన్ కొన్నా కొనకూడని వస్తువేదో కొంటున్నట్టు ఎగాదిగా చూస్తారు. కండోమ్స్ కొనడం కష్టం కాదు. కానీ వాటిని కొనేటప్పుడు ఒక్కసారిగా మారిపోయే వాతావరణమే ఇబ్బంది కలిగిస్తుంది. – పేరు చెప్పడానికి ఇష్టపడని అమ్మాయి

వారికి ఓ పట్టాన అర్థం కాలేదు..: ఫార్మసీ షాపుల్లో కండోమ్స్ కొనడం కాస్త కష్టమే. కొన్ని మెడికల్ స్టోర్స్‌లో పనిచేసేవారికి కండోమ్ కావాలని ఒకసారి అడిగితే సరిపోదు. అసలు అది వారి మెదడు రిసీవ్ చేసుకోలేదు. వారిలో చాలామందికి లూబ్రికెంట్ అంటే కూడా తెలీదు.

ADVERTISEMENT

ఓ ఫార్మసీ స్టూడెంట్‌గా మెడికల్ షాపులో పనిచేసేవారికి వీటి గురించి తెలిసి ఉండటం మంచిదని నేను భావిస్తాను. అయితే మహిళలు ఫార్మసిస్ట్‌గా పని చేసే చోట అయితే ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. కండోమ్స్ కొంటున్న సందర్భంలో ఓ మహిళా ఫార్మసిస్ట్ అబ్బాయి చేయాల్సిన పనిని.. అమ్మాయివి ధైర్యంగా చేస్తున్నావని మెచ్చుకొంది. – పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అమ్మాయి

1-girl-buys-condom

పేపర్లో చుట్టి ఇచ్చాడు..: ఓ సారి నేను కండోమ్స్ కొనడానికి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్‌కి వెళ్లి ‘భయ్యా మ్యాన్ ఫోర్స్ కండోమ్ ఇవ్వమ’ని అడిగాను. కండోమ్స్ అడిగినందుకు కాకుండా… భయ్యా అని పిలిచినందుకు ఎక్కువ ఇబ్బంది పడినట్లు కనిపించాడు. అతను మారుమాట్లాడకుండా.. నేను అడిగినవి ఎవరికీ కనబడకుండా.. ఓ పేపర్లో చుట్టి ఇచ్చాడు. డబ్బులిచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చేశాను. కండోమ్స్ కొనడం ఓ పెద్ధ అఛీవ్మెంట్‌గా అనిపించింది. – సుహానా త్రివేది

నాకేం కావాలో అడగనేలేదు..: సాధారణంగా నా బాయ్ ఫ్రెండ్ కండోమ్స్ తీసుకొస్తాడు. కానీ ఓ సారి తనకు వీలుపడక నన్నే తీసుకురమ్మన్నాడు. ఆ రోజు నేను దాదాపు మూడు చోట్లకు వెళ్లాల్సి వచ్చింది. మొదటి రెండు చోట్ల నాకు కావాల్సినవి దొరకలేదు. దగ్గర్లోనే ఉన్న షాపింగ్ మాల్‌కు వెళ్లాను. అక్కడ కచ్చితంగా దొరుకుతాయనే నమ్మకంతో వెళ్లాను. షాపింగ్ మాల్‌లో అవి ఎక్కడ ఉన్నాయో చెప్పమని ఓ సేల్స్ గర్ల్‌ని అడిగాను. ఆమెకు అవేంటో తెలియలేదు. పైగా నేను అడుగుతుంటే ఇబ్బందిగా మొహం పెట్టింది. అందుకే మెడికల్ స్టోర్లో కొనాలని నిర్ణయించుకొన్నాను. అక్కడికైతే వెళ్లగలిగాను.. కానీ ధైర్యం చాలలేదు. నాతో పాటు అక్కడ మరో ఇద్దరు మహిళలున్నారు.

ADVERTISEMENT

వారు అక్కడ నుంచి వెళ్లిపోయినంత వరకు ఆగి.. కండోమ్స్ కావాలని అడిగాను. బహుశా వారు అక్కడే ఉంటే నన్ను జడ్జ్ చేస్తారేమోననే భయం వల్లే అలా చేశాను. స్టోర్‌లో ఉన్న ఫార్మసిస్ట్ నాకు పెళ్లయిందా? లేదా? అని కనుక్కొనే పనిలో పడ్డాడు. మెడలో మంగళసూత్రం కోసం కళ్లతోనే వెతకడం మొదలుపెట్టాడు. అతను నన్ను అడిగిందల్లా.. 10 కండోమ్స్ ఉన్న ప్యాక్ కావాలా? 3 ఉన్న ప్యాక్ కావాలా అని  మాత్రమే. నాకు ఏ బ్రాండ్ కావాలి? ఏ టైప్ కావాలి? అని ఏమీ అడగలేదు. తన కౌంటర్ కింద ఉన్న వాటిల ో ఒకదాన్ని తీసి కాగితం కవర్‌లో ఎవరికీ కనబడకుండా ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇలా మొదటి సారి కండోమ్స్ కొన్నప్పుడు కాస్త ఇబ్బంది పడినా.. వాటిని తీసుకొని షాప్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాత్రం చాలా గర్వంగా అనిపించింది. – పేరు చెప్పడానికి ఇష్టపడని చెందిన అమ్మాయి

Images: Shutterstock

ఇవి కూడా చదవండి

మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే.. మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అర్థం..!

ADVERTISEMENT

సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!

చాటింగ్ టిప్స్: మాట ఇలా కలిపితే మనసుకి దగ్గర అవుతారు..!

08 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT