ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ప్రేమపై  నమ్మకాన్ని.. ఎందుకు కోల్పోకూడదంటే..?

ప్రేమపై నమ్మకాన్ని.. ఎందుకు కోల్పోకూడదంటే..?

మన జీవితంలో ఏదైనా పెద్ద కుదుపు ఎదురైతే మనం రెండు పనులు చేయచ్చు. మొదటిది జరిగిన దాన్నే పదే పదే తలచుకొని బాధపడుతూ.. మనల్ని మనం శిక్షించుకోవడం. లేదా అదే సంఘటనను పాజిటివ్‌గా తీసుకొని ఆ బాధ నుంచి బయటపడి హాయిగా జీవితాన్ని కొనసాగించడం. ఈ రెండింట్లో ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మన మానసిక పరిస్థితి ఆధారంగానే.. మనం ప్రయాణించే మార్గమూ మారుతుంది.

ఎవరిదో ఫేస్బుక్ అకౌంట్లోని స్టేటస్ చదివిన తర్వాత.. ఈ విషయాన్ని నాకు అన్వయించుకొన్నాను. మూడేళ్ల రిలేషన్ షిప్‌లో ఉన్నా ఇప్పటికీ నేను సంతోషంగా లేను. ఎందుకంటే కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి నాపై ఉంది. కానీ అతగాడేమో పెళ్లికి ఇంకా నేను సిద్ధంగా లేనని చెబుతున్నాడు. ఈ విషయంలో నేను అతన్ని తప్పు పట్టను. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాం. కాబట్టి కొన్ని రోజులు విడిగానే ఉండాల్సి వస్తుంది.

నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. నేను అనుకొన్నట్టుగా ఎప్పుడూ ఏదీ జరగలేదు. ఇది నా మూడ్ పై చాలా నెగటివ్ ప్రభావం చూపిస్తుంటుంది. ఈ ప్రభావం నేను చేసే పనులపైన కూడా పడుతూ ఉంటుంది. వీటి వల్ల నాకు జరిగే మంచి విషయాలను కూడా నేను గుర్తించలేకపోతున్నాను. ఎవరిని నిందించాలో తెలియక అందరి మీద చిరాకు పడిపోతుంటాను. అకారణంగా కోపం ప్రదర్శిస్తాను. దేవుణ్ని నిందిస్తాను.

నేను మీకు మొదట్లో చెప్పాను కదా.. ఆ వాక్యాలు నేను మారాల్సిన అవసరాన్ని నాకు తెలియజేశాయి. ఇంతవరకు నేను కంప్లైట్ చేసిన విషయాలన్నిటినీ పాజిటివ్‌గా చూడాల్సిన అవసరాన్ని నాకు తెలియజేశాయి. ఇప్పటి వరకు ‘నాకే ఇలా ఎందుకు జరుగుతుంది?’ అనే ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరాన్ని నేను గుర్తెరిగేలా చేశాయి. నాకు ప్రేమ జీవితం దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉండాలనే విషయాన్ని నేను గుర్తించాను. అందుకే పెన్నూ, పేపర్ అందుకొని లేఖ రాయడం మొదలుపెట్టాను.

ADVERTISEMENT

నా ప్రియమైన ప్రేమ దేవత,

నా మనసుకి నచ్చిన, నా మనుసుకి దగ్గరైన వ్యక్తిని ప్రేమించే అవకాశం నాకిచ్చినందుకు ధన్యవాదాలు. అతన్ని చూసిన ప్రతిసారి నా చుట్టూ తుమ్మెదలు ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రేమను పొందడం ఎంత అదృష్ట‌మో ఇప్పుడు నాకు తెలిసింది.

నీకు తెలుసు కదా.. అతని కోసం నేను చేసే చిన్న చిన్న పనులను పట్టించుకోనట్టు నటిస్తాడు. ఆ విషయాన్ని అతను చేసే పనులే చెబుతుంటాయి. ఓ ఉదాహరణ చెబుతా.. ఓసారి అతడు నన్ను నా ఉంగరాన్ని అడిగి.. తన వేలికి పెట్టుకొని తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత కానీ నాకు తెలియలేదు. తను నాకు ఉంగరం కొంటాడని. దాని కోసం రింగ్ సైజ్  సరిచూసుకున్నాడని. నేను మెట్లు ఎక్కే ప్రతిసారీ అతను నన్ను ఎంత అపురూపంగా చూసేవాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో నా అడుగు తడబడకుండా నేను చాలా  జాగ్రత్త పడాల్సి వచ్చేది. అతనికి తెలుసు నా మనసు, నా వ్యక్తిత్వం గురించి. బ్రేకప్ అయిన తర్వాత నేనెంత బాధపడినా.. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు నా ముఖంపై నవ్వులు పూయిస్తాయి. నా మనసుని సంతోషంతో నింపేస్తాయి.

గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటూ నిద్రపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో నీకు గుర్తుండే ఉంటుంది కదా. కొన్నిసార్లు ఫోన్లో అతని గురక వినిపించి మెలకువ వచ్చిన రోజులు కూడా నీకు గుర్తున్నాయి కదా. ఆ సమయంలో అతని గురక కూడా నాకు చాలా వినసొంపుగా అనిపించేది.

ADVERTISEMENT

మా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ వర్కవుట్ కాకపోయినా.. అతని సాంగత్యంలో నాకు చాలా హాయిగా ఉండేది. నా మనసు ప్రశాంతంగా ఉండేది. నా చిన్ననాటి స్నేహితురాలి తర్వాత.. నా మనసులోని మాటను భయం లేకుండా చెప్పగలిగింది అతని దగ్గరే. అతడితో నా భయాలు, నేను అభద్రతా భావం ఫీలయ్యే విషయాలు అన్నింటి గురించి పంచుకొన్నాను. అప్పుడు నా మనసులో చిన్న భయం ఉండేది. ఈ విషయాలన్నీ విని అతను వెనకడుగు వేస్తాడేమోనని. కానీ అతడు నన్ను చాలా ప్రేమించాడు. అతనికి ఎప్పుడైనా నిరుత్సాహంగా అనిపించినా.. కోపంగా అనిపించినా.. చిరాకు కలిగినా.. నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. అలా అతనికి మానసికంగా బలంగా మారడం నాకు చాలా సంతోషాన్నిచ్చేది. ఇప్పుడు నేను అలాంటి మధురానుభూతులను మిస్సవుతున్నాను. ఆ క్షణాలు మమ్మల్ని మరింత దగ్గర చేసేవి. ఇప్పుడు ఒకరికొకరం దూరం అవ్వడం వల్ల అతని సంతోషాన్ని, బాధను నేను పంచుకోలేకపోతున్నాను.

1-why-iam-not-giving-up-on-my-love

సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడే ఓ వ్యక్తిని పోగొట్టుకొన్న తర్వాత నేను కూడా మ్యూజిక్ వినడం ఆపేశాను. కానీ నేను ప్రేమించిన వ్యక్తి నా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే, నేను మళ్లీ సంగీతం వినడం మొదలుపెట్టాను. అతనికి నచ్చిన కొన్ని పాటలు నాక్కూడా నచ్చాయి.

కొన్ని సందర్భాల్లో అతడు మాట్లాడుతుంటే నేను చాలా చిరాకు పడేదాన్ని. కానీ ఇప్పుడు అతని మాటలు కూడా వినలేనంత దూరంలో ఉన్నాను. అతడు ఎప్పుడూ నేను కోరుకొన్నది సాధించే దిశగా నన్ను ప్రోత్సహించాడు. నా బలాన్ని గుర్తించేలా చేశాడు. నా కలను సాకారం చేసుకొనే దిశగా నన్ను నడిపించాడు.

ADVERTISEMENT

నాకు ‘ఐ లవ్యూ’ చెప్పిన మొదటి వ్యక్తి అతడే. అతని చేతిని మొదటిసారి పట్టుకొన్నప్పుడు కలిగిన అనుభూతిని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ క్షణం నా అరచేతులకు చిరు చెమటలు పట్టాయి. కానీ అతను దాన్ని పట్టించుకోకుండా.. నా చేయి ఇంత చిన్నగా ఉందేంటని ఆశ్చర్యపోయాడు.

ఇలాంటి ఎన్నో మధురానుభూతులు అతను నాకు అందించాడు. మా రిలేషన్ షిప్ మాదిరిగా మా తీపి గుర్తులను మరచిపోవడానికి నేను సిద్ధంగా లేను. నేను థ్యాంక్స్ చెప్పడానికి నా దగ్గర ఎన్నో కారణాలున్నాయి. 

డియర్ ప్రేమ దేవత.. నీ మీద, నేను ప్రేమించిన వ్యక్తి మీద కంప్లైంట్స్ ఏమీ లేవు. నేను బాధలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడి ఉండవచ్చు. దాన్ని కారణంగా చూపించి నా మీద నమ్మకాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే.. నేను నీపై నమ్మకంతో ఉన్నాను. నా ప్రిన్స్ ఛార్మింగ్‌ను తిరిగి కలుసుకొనేంత వరకు కాస్త ఓపికతో ఉండాలని తెలుసుకొన్నాను. ఆ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను.

తిరిగి love లో పడటానికి సిద్ధంగా ఉన్న

ADVERTISEMENT

నేను

Images: Shutterstock

Must Read:

డియర్ ఎక్స్ .. నీకెలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియడం లేదు..!

ADVERTISEMENT

డియ‌ర్ ఎక్స్‌.. న‌న్ను మోసం చేసినందుకు ధ‌న్య‌వాదాలు..!

చూపులతోనే మాటలు.. పుస్తకాల్లో ప్రేమలేఖలు.. ఆనాటి ప్రేమ అద్భుతం..

15 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT