మీ రాశిఫ‌లాలు వీక్షించండి.. సరికొత్త జీవితానికి బాటలు వేయండి

మీ రాశిఫ‌లాలు వీక్షించండి.. సరికొత్త జీవితానికి బాటలు వేయండి

ఈ రోజు (ఏప్రిల్ 22) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీరు చేయాల్సిన పనంతా చేసి ఫలితం కోసం వేచి చూస్తోన్న ఈ తరుణంలో మిమ్మల్ని మీరు సందేహించుకోవడం తగదు. పాజిటివ్ థింకింగ్‌తో ఉండండి. మీ భయం, సందేహాలు.. అన్నీ పక్కన పెట్టి పాజిటివ్‌గా ఆలోచించండి.


వృషభం (Tarus) –  మీ మనసుని మీరే అనవసరమైన భయాలతో నింపుకున్నారు. అవి ఉన్నంత కాలం ఏ పనైనా మీకు అసాధ్యంగానే అనిపించవచ్చు. కాబట్టి వాటి బదులుగా ఆత్మవిశ్వాసం, మీరు సాధించిన విజయాలతో మనసులో ప్రశాంతతను నింపుకోండి. తప్పక ఫలితం కనిపిస్తుంది.


మిథునం (Gemini) – మీరు చేసే పనుల కారణంగా.. మీకు ప్రశాంతమైన జీవనం కొనసాగించడం వీలవుతోంది. మీరు ఏం చేయాలి? ఎలా చేయాలన్న విషయాన్ని మీ మనసే మీకు దిశానిర్దేశం చేస్తోంది. కనుక ధైర్యంగా ముందుకు వెళ్లండి.


కర్కాటకం (Cancer) – మీరు ఎంచుకున్న మార్గంలో ఇప్పటివరకు ఎన్ని అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్లారో మీకు తెలుసు. అయితే ఇకపై మీరు ఎంచుకునే మార్గాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి మీ మంచికే అని గ్రహించండి.


సింహం (Leo) – మీ జీవితంలో మీకు ఏది ముఖ్యమో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయించుకోండి. ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ అంశాలకు మీరు ప్రాధాన్యం ఇవ్వలేరు. కాబట్టి ముఖ్యమైన అంశాన్ని ఎంచుకొని దాని గురించి పని చేయడం మొదలుపెట్టండి. తద్వారా మీ భవితకు బాటలు వేయండి


క‌న్య (Virgo) – మీ జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోయేలా మీరు ఒక కొత్త దారిని ఎంచుకుంటున్నారు. మీరు ఆశించిన గుర్తింపు మీకు తప్పకుండా లభిస్తుంది. అయితే మీ క్రియేటివిటీకి మరింత పదును పెట్టాల్సి ఉంటుంది.


తుల (Libra) –  మీ ముందు ఉన్న అవకాశాలను ఛాలెంజ్‌గా తీసుకొని వాటిపై పోరాడే ధైర్యం ఇప్పుడు మీ సొంతం. ఈ విషయంలో మిమ్మల్ని మీరు వెనక్కి లాక్కోకండి. మీ మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా ఎదుటివారికి చెప్పండి.


వృశ్చికం (Scorpio) – మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవసరమైన వనరులు, వసతులు అన్నీ మీకు అందుబాటులోనే ఉన్నాయి. గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించండి. గతం నుండి నేర్చుకున్న పాఠాలను మరువకండి.


ధనుస్సు (Saggitarius) – మీకు ఒక కళ లేదా ఉద్యోగం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగినట్లు మీరు ఇటీవలే గ్రహించారు. అయితే ఈ విషయంలో మీ దగ్గరి బంధువు లేదా ఆప్తమిత్రుల దగ్గర్నుంచి మీకో సలహా అందవచ్చు. వీలైనంత పాజిటివ్‌గా దాని గురించి ఆలోచించండి.


మకరం (Capricorn) – ఒక తలుపు తెరవాలంటే మరొకటి మూయాల్సిందే. గతాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్న అవకాశాల గురించి ఆలోచిస్తేనే మీరు ముందుకు వెళ్లగలరు. పాజిటివ్‌గా వచ్చే మార్పుని ఆహ్వానిస్తేనే మీ జీవితం మారుతుందని గుర్తుంచుకోండి.


కుంభం (Aquarius) – రోజులో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ మీకంటూ కాస్త సమయం కేటాయించుకోండి. అలసిపోయిన శరీరం, మెదడుకి తిరిగి ఉత్సాహాన్నిచ్చేలా చిన్న చిన్న పనులు చేయండి. ప్రస్తుతం ఇది మీకు చాలా అవసరం.


మీనం (Pisces) – మీ మనసు మార్పును కోరుకుంటోంది. మీ జీవితానికి మీరే దిశానిర్దేశం చేయండి. కాబట్టి ఉన్న పరిస్థితుల నుంచి బయటకు వచ్చి సరైన నిర్ణయాలు తీసుకోండి. స్పష్టతతో ముందుకు వెళ్లండి.


Credit: Asha Shah


ఇవి కూడా చదవండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!