ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి - మీ లక్ష్యసాధనలోని ఆటంకాలను తొలిగించుకోండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి - మీ లక్ష్యసాధనలోని ఆటంకాలను తొలిగించుకోండి

ఈ రోజు (ఏప్రిల్ 24) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం.. !


 


మేషం (Aries) – మీ మనసు ఏం చెబుతుందో ప్రశాంతంగా వినండి. ఇతరత్రా ఆలోచనలు మాని.. ఇతరులు చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసు చెప్పేది వినండి. కొన్ని సందర్భాలలో ఇతరుల సలహాలు పాటించడం కన్నా.. మీరు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలరనే సత్యాన్ని నమ్మండి.


వృషభం (Tarus) – మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులూ చేసుకోండి. అప్పుడే మీ కలలు నిజమవుతాయి. ఎప్పట్నుంచో మీరు ఒకటే పద్ధతిలో అన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈసారి భిన్నమైన పద్ధతిలో ప్రయత్నించి చూడండి.


మిథునం (Gemini) –  మీరు ఈ రోజు  ఏం చేసినా తప్పకుండా సంతోషం పొందుతారు. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారికి కూడా సంతోషాన్ని పంచండి. అందుకే.. ఏ పని చేసినా దానిని ఎంజాయ్ చేస్తూ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తూ పనిచేస్తేనే.. మంచి ఫలితాలను పొందగలరు. 


కర్కాటకం (Cancer) – మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు స్వర్గం నుంచి మీ కోసం సందేశాలు పంపుతున్నారు. కలలు, సంకేతాలు.. ఇలా ఏదో ఒక రూపంలో అవి మిమ్మల్ని చేరడమే కాదు.. మీ కోరికలను కూడా తీర్చుతాయి. ఈ విషయాలను మీరు నమ్మండి. మీకు ప్రియమైన వారి కోసం ఈ రోజు కేటాయించండి. 


సింహం (Leo) – మీ ఆత్మబలం మొత్తాన్ని కూడదీసుకొని మీ శక్తి గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అయితే పరిస్థితులకు ఎదురెళ్లడానికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యమే అని గుర్తుంచుకోండి. అవే మీ లక్ష్యసాధనలో తోడ్పడతాయని.. మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. 


క‌న్య (Virgo) – మీరు నూటికి పదిసార్లు ఆలోచించి తీసుకొనే నిర్ణయాలే..  మీ జీవితాన్ని అందంగా మార్చడంలో తోడ్పడతాయి. అందుకే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 


తుల (Libra) – ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు క్రమంగా సర్దుకుంటున్నాయి. ఈ క్రమంలో మీ అంచనాలను కొద్ది రోజులు పక్కన పెట్టండి. అన్నీ మీరు వేసిన ప్రణాళిక ప్రకారం జరగాల్సిన అవసరం లేదు. అందుకే జీవితంలో పెద్దగా మార్పులు మాత్రం చేసుకోకండి. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే ప్రయత్నంలో ఉంటే.. బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. 


వృశ్చికం (Scorpio) – మీరు ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేయాలో ఎలా చేయాలో కూడా నిర్ణయించుకోలేకపోతున్నారు. కాస్త నిశ్శబ్దంగా ఉండి, ప్రశాంతంగా ఆలోచించండి. తప్పకుండా మీకు స్పష్టత వస్తుంది.


ధనుస్సు (Saggitarius) – మీ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడండి. అడ్డంకులను అధిగమించి అనుకున్నది సాధించండి. ది బెస్ట్ మీకు లభిస్తుందని విశ్వసించండి. పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.


మకరం (Capricorn) – మీ చుట్టూ జరిగే సంఘటనలను జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడు, ఏం చేయాలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులే మీకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతి దానికీ ఒక కారణం ఉంటుందని గ్రహించండి.


కుంభం (Aquarius) – ఊహించని బహుమతులు, రివార్డ్స్ అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. అంతేకాదు.. మీ జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరగనున్నాయి. వాటికీ మీరు సంసిద్ధులుగా ఉండండి.


మీనం (Pisces) – మీ అంతర, బాహ్య ప్రపంచంలో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. మీరు చూసే విధానం లేదా ఆలోచించే శైలి కూడా మార్చుకుంటే మంచిది. మీ జీవితంలో కొత్త దశను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!