ఈ రోజు రాశిఫలాలు.. మీ బంగారు భవిష్యత్తుకు వేస్తాయి బాటలు..

ఈ రోజు రాశిఫలాలు.. మీ బంగారు భవిష్యత్తుకు వేస్తాయి బాటలు..

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మీరు ప్రస్తుతం చాలా శక్తిమంతులని, ధైర్యవంతులని మీకు అనిపిస్తోంది. వాటి కారణంగా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని చక్కగా ఎదుర్కోగలరన్న నమ్మకం మీకు ఉంది. వాటితో పరిస్థితులను చక్కగా సరిదిద్దుకోండి.


వృషభం (Tarus) – మీ మనసు మీకు ఏదో చెబుతోంది. కానీ మీరు దానిని సరిగ్గా వినడం లేదు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీ మనసు చెప్పే మాట ఏంటో వినండి.


మిథునం (Gemini) – మీకు ఓ వ్యక్తితో చాలా బలమైన బంధం ఏర్పడుతుంది. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మీరు పెంచుకునే పెంపుడు జంతువు కావచ్చు. ఇప్పటి వరకు మీరు పడిన బాధ అంతా సంతోషంగా మారనుంది. మీ చుట్టూ ప్రేమ ఉంది.


కర్కాటకం (Cancer) – గత కొద్ది నెలలుగా మీ జీవితంలో ఉన్న కొన్ని బంధాలు మిమ్మల్ని కొన్ని విషయాల్లో వెనక్కి లాగడం లేదా నిరుత్సాహపరచడం వంటివి చేస్తున్నాయి. ఈసారి వాటిని ఉపేక్షించకుండా నెగెటివ్ బంధాలను అక్కడితో వదిలేయండి.


సింహం (Leo) – మీ జీవితంలో మీకు వర్కవుట్ అవ్వని పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని మీ మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు మీరు మార్చుకోగలరు. అలాగే మీ కోరికలేంటో కూడా మీరు ఒక జాబితా రాసుకుంటే మంచిది.


క‌న్య (Virgo) – ఉన్నట్లుండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోవచ్చు. ఒక్కసారిగా అవి తలకిందులుగా మారిపోవచ్చు. లేదా ఒకేసారి బోలెడన్ని అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండండి.


తుల (Libra) – మీ విషయంలో ఏదో జరిగిందని అందరికీ అలాగే జరగకపోవచ్చు. కాబట్టి పరిస్థితులను కేవలం మీ కోణం నుంచే కాకుండా ఇతరుల కోణం నుంచి కూడా అర్థం చేసుకోండి. లేదా మీరు చూసే కోణాన్ని మార్చుకోండి.


వృశ్చికం (Scorpio) – మీ జీవితంలో జరిగే మార్పులను వ్యతిరేకించడం లేదా వాటిని నియంత్రించడానికి ప్రయత్నించడం వంటివి చేయకండి. ఇతరులను అర్థం చేసుకునేందుకు పలు కోణాల్లో ప్రయత్నించినప్పుడే మార్పు మీ జీవితంలోనూ వస్తుంది.


ధనుస్సు (Saggitarius) – మిమ్మల్ని తక్కువ చేసి చూపించాలనుకునేవారు లేదా హద్దులు దాటి ప్రవర్తించేవారికి వారి హద్దులేంటో ఓసారి గుర్తు చేయండి. మీ గురించి మీరు ధైర్యంగా నిలబడి, మాట్లాడండి.


మకరం (Capricorn) – గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చి మీలో ఉన్న ఎమోషన్స్ ఒక్కసారిగా బయటకు రావచ్చు. బాధపడకండి. గతాన్ని అంగీకరించండి. విలువైన పాఠాలు నేర్పినందుకు దానికి ధన్యవాదాలు తెలపండి.


కుంభం (Aquarius) – మీ జీవితంలో ప్రస్తుతం ప్రేమ, సంతోషానికి ఇది సమయం. కాబట్టి ఈ అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల్లో మీ మనసులో ఉన్న కోరికలేంటో మీరు స్పష్టంగా తెలుసుకోండి.


మీనం (Pisces) – మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక్కసారి కళ్లు మూసుకుని కాస్త రిలాక్స్ అవ్వండి. అన్నీ సర్దుకుంటాయని నమ్మండి. అంతేకానీ వాటిని నియంత్రించాలని చూడకండి.


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి..


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?